ఇన్నోవేషన్, టెక్నాలజీ, యువతలో వ్యాపారాభిలాష.. ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతున్నాయి. ప్రత్యేకంగా స్టార్టప్ రంగం ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో భారత్ నుంచి మిలియన్ల స్టార్టప్‌లు వెలుగులోకి వచ్చాయి. అందులో యూనికార్న్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ప్రారంభించిన స్టార్టప్‌లలో 80–90% వరకు మొదటి 3 ఏళ్లలోనే మూతబడుతున్నాయన్నది మరో వాస్తవం. స్టార్టప్‌లు ఎలా విజయం సాధిస్తాయి? ఎందుకు విఫలమవుతాయి? విజయవంతమైన స్టార్టప్‌ను ఎలా మొదలుపెట్టాలి? అనేది తెలుసుకోవడం ప్రతి యువ పారిశ్రామికవేత్తకు ఎంతో ముఖ్యం.
స్టార్టప్ అంటే ఏమిటి? What Is a Startup?
కొత్త ఆలోచనను ఆధారంగా తీసుకుని చిన్న పెట్టుబడితో మొదలయ్యే వ్యాపార సంస్థనే స్టార్టప్ అంటారు. వివిధ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు ఇవ్వడం, సేవలను వేగంగా అందించడం, వినియోగదారుల అవసరాలను తీర్చడం. వీటన్నింటికీ స్టార్టప్‌లు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్నాయి. భారత్‌లో స్టార్టప్ ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు యువతలో వ్యాపార ఆలోచనలకు నూతన ఊపిరి పోశాయి.
స్టార్టప్‌ను ఎలా ప్రారంభించాలి? How to Start a Startup?
మొదటిగా “సమస్య”ని గుర్తించాలి. ప్రతి విజయవంతమైన వ్యాపారం ఒక సమస్యను పరిష్కరించడం ద్వారానే ఎదిగింది.
ఉదాహరణకు Zomato, Swiggyలు ఫుడ్ డెలివరీ సమస్యను పరిష్కరించాయి. Ola క్యాబ్ సేవలను సులభం చేసింది. Paytm డిజిటల్ పేమెంట్స్‌కి పరిష్కారం చూపింది. స్టార్టప్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు ఏమిటంటే.. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యను నేను పరిష్కరించగలను?” అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలి.
క్లీన్ బిజినెస్ మోడల్ తయారు చేయాలి..A Clean Business Model Must Be Prepared
స్టార్టప్‌కి బిజినెస్ మోడల్ చాలా ముఖ్యమైనది. మీరు ఏమి అందించబోతున్నారు? ఎవరికి అందించబోతున్నారు? డబ్బు ఎలా సంపాదించబోతున్నారు? మీ సేవ/ఉత్పత్తి ఎందుకు ప్రత్యేకం? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉంటేనే వ్యాపారం నిలకడగా సాగుతుంది.
మార్కెట్ రీసెర్చ్ తప్పనిసరి..Market Research Is Essential
విజయం పొందే స్టార్టప్ అవ్వాలంటే.. ఆ రంగంలో ఇప్పటికే ఉన్న కంపెనీలు ఏమి చేస్తున్నాయి? వారి లోపాలు ఏమిటి? ప్రజలు ఏ విధమైన సేవను ఎక్కువగా కోరుకుంటున్నారు? ఇవన్నీ అధ్యయనం చేయాలి. సరైన మార్కెట్ రీసెర్చ్‌తో స్టార్టప్‌కి బలమైన దిశ లభిస్తుంది.
కనీస ఖర్చుతో “MVP” ప్రొడక్ట్ తయారు చేయాలి.. Build an MVP Product with Minimum Cost
MVP అంటే Minimum Viable Product. అంటే పూర్తి ప్రొడక్ట్ కాకపోయినా, వినియోగదారులు ఉపయోగించేలా ఉండే మొదటి వెర్షన్. ఇది రెండు ప్రయోజనాలు ఇస్తుంది. పెట్టుబడి తక్కువ అవుతుంది. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అసలు ఉత్పత్తిని మెరుగుపరచవచ్చు
బలమైన టీమ్..A Strong Team
ఒక్క వ్యక్తి స్టార్టప్‌ను పెద్దది చేయలేడు. టెక్నికల్ వ్యక్తి ఉండాలి. మార్కెటింగ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. ఫైనాన్స్, అకౌంట్స్ చూసుకునే వ్యక్తి ఉండాలి. కలిసికట్టుగా పనిచేసే టీమ్ ఉన్న స్టార్టప్‌లు వేగంగా ఎదుగుతాయి.
పెట్టుబడి (ఫండింగ్) Funding (Investment)
భారతదేశంలో ఇప్పుడే పెట్టుబడులు పొందడం అంత కష్టమేమీ కాదు. అయితే పెట్టుబడి తీసుకునే ముందు ..బిజినెస్ ప్లాన్ 100% క్లియర్ గా ఉండాలి. సాధారణంగా స్టార్టప్‌లు తీసుకునే ఫండింగ్ రకాలివి..
• ఏంజెల్ ఇన్వెస్టర్లు
• వెంచర్ క్యాపిటల్ సంస్థలు
• స్టార్టప్ ఇండియా నిధులు
• ప్రభుత్వ గ్రాంట్లు
• బ్యాంకు రుణాలు
• క్రౌడ్ ఫండింగ్
రిజిస్ట్రేషన్ & లీగల్ ఫార్మాలిటీలు.. Registration & Legal Formalities
• కంపెనీ రిజిస్ట్రేషన్ (Private Limited / LLP)
• GST
• ట్రేడ్‌మార్క్
• పేటెంట్స్ (సాంకేతిక ఉత్పత్తులకు)
• వ్యాపారం చట్టపరంగా బలంగా ఉండాలి.
మార్కెటింగ్ – వినియోగదారులకు చేరే మార్గం.. Marketing – The Path to Reach Consumers
ఇప్పటి కాలంలో మార్కెటింగ్ లేకుండా ఏ స్టార్టప్ కూడా నిలబడదు.
• సోషల్ మీడియా ప్రచారం
• డిజిటల్ అడ్స్
• ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్
• రిఫరల్ ఆఫర్లు
• డిస్కౌంట్లు
• సర్వీసులో ప్రత్యేకత
• అత్యల్ప ఖర్చుతో గరిష్ట ప్రచారం చేసే వ్యూహం అవసరం.
దేశంలో స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతున్నాయి? Why Are Startups Failing in the Country?
దేశంలో అత్యధిక స్టార్టప్‌లు విఫలమవడానికి ప్రధాన కారణాలు ఇవే—
1) సరైన ప్లానింగ్ లేకపోవడం: ఎంతో మంది ఒక ఆలోచనతో మొదలు పెడతారు. కానీ ఆలోచనను వ్యాపారంగా మార్చే స్పష్టమైన వ్యూహం ఉండదు. ఖర్చు ఎక్కడ పెరుగుతుంది? లాభం ఎప్పటి నుంచి మొదలవుతుంది? మార్కెట్లో పోటీ ఎంత ఉంది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు లేని స్టార్టప్‌లు తొందరగానే మూతపడతాయి.
2) మార్కెట్ డిమాండ్ తప్పుగా అంచనా వేయడం: చాలా స్టార్టప్‌లు తమ ఉత్పత్తి అవసరం ప్రజలకు ఎంత ఉందో ముందుగా తెలుసుకోరు. ఫలితంగా పెద్ద పెట్టుబడి పెట్టి సర్వీసులు అందిస్తే సరిపడా వినియోగదారులు దొరకరు.
3) డబ్బు వ్యయం నియంత్రించకపోవడం: ఫండింగ్ వచ్చిన వెంటనే ఆఫీస్‌ను ఫ్యాన్సీగా మార్చడం, అవసరం లేని ఉద్యోగులను నియమించడం, మార్కెటింగ్‌పై అధిక ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. డబ్బు తగ్గడంతో ఆపరేషన్లు నిలిచిపోతాయి.
4) బలహీనమైన నాయకత్వం: ఒక స్టార్టప్‌ను ముందుకు నడిపేది వ్యవస్థాపకుడి దిశ, ధైర్యం. తప్పు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అనుభవం లేకపోవడం స్టార్టప్‌లను దారితప్పిస్తాయి.
5) సరైన టీమ్ లేకపోవడం: టెక్నాలజీ తెలిసిన వ్యక్తి లేకపోవడం, మార్కెటింగ్ బలహీనంగా ఉండడం, ఫైనాన్స్ నిర్వహణలో పొరపాట్లు స్టార్టప్ విఫలమవడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
6) పోటీని తక్కువగా అంచనా వేయడం: మార్కెట్లో ఇప్పటికే ఉన్న కంపెనీలను చిన్నచూపు చూడడం కూడా పెద్ద ప్రమాదం. కొత్త స్టార్టప్‌లు ప్రత్యేకతను చూపకపోతే వినియోగదారులు మారరు.
7) వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకోకపోవడం: సేవలో లోపాలు ఉన్నా… వాటిని సరిచేయకపోవడం వల్ల స్టార్టప్‌పై నమ్మకం తగ్గుతుంది.
8) లీగల్ సమస్యలు & లైసెన్సులు: అనధికారిక సేవలు, రిజిస్ట్రేషన్ లేకపోవడం, పన్ను సమస్యలు ,చట్టపరమైన సమస్యలు కూడా చాలా స్టార్టప్‌లను ఆపేస్తాయి.
విజయం సాధించే స్టార్టప్‌లు ఎలా పనిచేస్తాయంటే? How Successful Startups Operate?
– మార్కెట్ అవసరాలను స్పష్టంగా అర్థం చేసుకుంటాయి
– ఖర్చులను నియంత్రిస్తాయి
– నాణ్యమైన సేవ/ఉత్పత్తి అందిస్తాయి
– నిరంతరం ఇన్నోవేషన్ చేస్తాయి
-కస్టమర్ల సంతృప్తిని మొదటి స్థానంలో పెట్టుకుంటాయి
– బలమైన నాయకత్వం ఉంటుంది
-డేటాను ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయి
భారత యువతకు భారీ అవకాశాలు ..Huge Opportunities for Indian Youth
• ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టం భారత్‌ది
• 75,000 పైగా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు
• డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచంలో నంబర్-1
• యువత జనాభా అధికం
• AI, EV, గ్రీన్ ఎనర్జీ, అగ్రిటెక్‌లో విపరీత అవకాశాలు.
సరైన దిశలో పయనిస్తే విజయం ఖాయం.. Success Is Certain If You Move in the Right Direction
భారతదేశంలో స్టార్టప్ ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం అని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్ ప్రారంభించడం కష్టం కాదు… సరైన దిశలో పయనిస్తే విజయం ఖాయం. స్టార్టప్ అంటే కేవలం ఒక వ్యాపారం కాదు. సమస్యకు పరిష్కారం, సమాజానికి సేవ, భవిష్యత్తుకు మార్గదర్శి. స్టార్టప్‌ను విజయవంతం చేయాలంటే .. స్పష్టమైన ప్లాన్, అద్భుతమైన టీమ్, ఖర్చుపై నియంత్రణ, మార్కెట్ అవగాహన తప్పనిసరి. ఎటువంటి స్టార్టప్ అయినా సరైన వ్యూహంతో ప్రారంభిస్తే, భారతదేశం ప్రపంచ స్టార్టప్ హబ్‌గా అవతరించేదాకా ఇదే వేగం కొనసాగుతుంది.

