`గొప్ప ఆలోచ‌న‌ల్లోనే గొప్ప‌వాళ్లు పుడ‌తారు * `మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్` బుక్ స‌మ‌రీ

the magic of thinking big book summery

గొప్ప‌వాళ్లంద‌రూ గొప్ప ఆలోచ‌న‌ల నుంచే పుడ‌తారు. నువ్వు గొప్ప‌గా ఆలోచించ గ‌లిగిన‌ప్పడే విజేత‌వ‌వుతావు. ఒక వేళ‌ విజ‌యం సాధించ‌లేక‌పోయినా ఉన్నంత‌లో ఉన్న‌తంగా బ‌త‌క‌గ‌లుగుతావు. నిన్ను న‌డిపించేదీ, నిన్ను శాసించేదీ నీ ఆలోచ‌నే.. ఎంతో మంది వేదాంతులు చెప్పిన, విజేతలు వ‌ల్లించిన విష‌యం ఇదే. ఎప్ప‌టికీ ఇదే నిజం.

1959లో ప్ర‌చురిత‌మైన `ద మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్‌` పుస్తకంలో ర‌చ‌యిత డేవిడ్ మ‌న ఆలోచ‌న‌ల గొప్ప‌త‌నాన్ని వివ‌రించారు. సాధారణంగా  ఒక వ్యక్తి ఆలోచనలు ఎంత గొప్పవి అనే దానిని బట్టి అతని విజయం  ఆధారపడి ఉంటుందని డేవిడ్ అంటారు. మన ఆలోచన విధానాన్ని తెలియజేయడానికి  కొన్ని సూత్రాలను ఈ పుస్త‌కంలో వివ‌రించారు.

definitely you will get success

నువ్వు విజ‌యం సాధించ‌గ‌ల‌వు..
ప్రతి వ్యక్తి బ్రైన్ లో ఆలోచనలు తయరయ్యే ఫ్యాక్టరీ ఉంటుంది. దీనిని ఇద్దరు పర్యవేక్షిస్తారు. 1.విజయం 2. అపజయం.
* మనం మంచిగా ఆలోచిస్తే  మన ఆలోచనలు మంచి జరిగేలా చేస్తాయి. మనం చెడుగా ఆలోచిస్తే చెడు ప్రభావం చూపిస్తాయి.
* కేవలం విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. అప్పుడే విజయానికి తగ్గ ఆలోచనలు వస్తాయి.
మనం ఓడిపోతామేమో అని ఆలోచించకూడదు.
* మన సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. విజయం సాధించనవాళ్ళు సూపర్ మ్యాన్ కాదు.  విజయం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది.
* పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. చిన్న గోల్స్ పెట్టుకుంటే రిజల్ట్ చిన్నగానే ఉంటుంది.

never tell reasons

కార‌ణాలు చెప్పొద్దు..
మనం విజయం సాధించాలంటే ముందు సాకులు చెప్పడం మానేయాలి. మ‌న‌కు ప‌ని చేత‌కాన‌ప్ప‌డే సాకులు వెతుకుతాం.
* మనకి ఆరోగ్యం బాగులేదు అని చెప్పకూడదు. మన రోగం గురించి ఎంత ఎక్కువ చేబితే అది అంత ముదిరిపోతుంది. మన ఆరోగ్యం గురించి బాధ‌పడడానికి ఒప్పుకోకూడదు. ఆరోగ్యం బాగులేదు అని ఏడ్చే బదులు కొంతైనా బాగుందని సంతోషించాలి.
* చాలామంది మన తెలివితేటలను తక్కువ చేసి ఎదుటవారి  తెలివిని ఎక్కువ చేస్తుంటారు. ఈ ఆలోచన పోవాలంటే మనలో ఉన్న టాలెంట్ ని తక్కువ చేసి చూడకూడదు. తెలివితేటల కన్నా మనం గెలుస్తామనే నమ్మకం ముఖ్యం.
* కొత్త ఆలోచనలను సృష్టించి మనం చేయాల్సిన పనులను కొత్తగా చేయడానికి మన తెలివిని ఉపయోగించాలి.
* మనం వయసు అయిపోయిందని అనకూడదు. మనం ఇంకా యుక్త వయసులో ఉన్నామనుకొని కొత్త అవకాశాల కోసం ఉత్సాహంగా ప‌రిగెత్తాలి.
* ఒక పనిని ఎప్పుడో మొదలుపెట్టవలిసింది అనుకునే బదులు, నేనిప్పుడూ మొదలుపెడతా అని అనుకోవాలి.

క‌ష్ట‌ప‌డ‌డమే మార్గం..
హార్డ్ వ‌ర్క్ కి వేరే ప్ర‌త్య‌మ్నాయం లేదు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం అనేది ఒక్క‌టే మార్గం.
ఏ ఫ్రొఫెషన్ లోనైనా విజయం సాధించడం అనేది కష్టపడి పనిచేస్తేనే సాధ్య‌మ‌వుతుంది.
అదృష్టం అంటే మన విజయానికి కావాల్సిన  సరైన ప్లానింగ్, స్ట్రాట‌జీ, పోజిటివ్ గా ఆలోచించడం.
ఏ ప్రయత్నం చేయకుండా  కేవలం  అదృష్టం సహాయంతో ఇంతవరకూ ఎవరూ సక్సెస్ కాలేదని గుర్తించుకోవాలి.

భ‌యం వ‌ద్దు..
మనం సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఆపాలనుకునే ఒకే ఒక్క శత్రువు భయం.  భయం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుంది. మ‌న‌ల్ని వెన‌క్కు న‌డిపిస్తుంది.
* మన వ్యక్తిగత స్వరూపం గురించి ఆందోళన చెందకూడ‌దు. మన వ్యక్తిత్వం గొప్పగా ఉన్నట్లు చూసుకోవాలి. అప్పుడు అందరూ మనల్ని ఇష్టపడతారు.
* ఇతరులు ఏమంటారో అని భయపడకూడదు.
* సెల్ప్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నించాలి. అందరికీ కనిపించేలా ఉండాలి.
* ఎవరితోనైనా మాట్లాడేటపుడు సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడాలి.
* మన నడకవేగాన్ని 25 శాతం పెంచాలి.
*స్పష్టంగా మన భావాలను వ్యక్తపరచాలి. మనస్పూర్తిగా నవ్వాలి.

థింక్ బిగ్‌..
కొంతమంది వ్యక్తులు  ఉద్యోగాలు చేస్తూ మా జీవితం ఇంతే అని నిరాశ చెందుతారు. కానీ సక్సెస్ ఫుల్ పర్సన్ తమ ప్యూచర్ లో ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉంటారు.  మనం గొప్పగా ఆలోచించాలంటే కొన్ని పనులు చెయ్యాలి. ప్రస్తుతం మన వద్ద ఉన్న విలువను ఎలా పెంచాలో ఆలోచించాలి.
చిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తి చిన్న లక్ష్యాలను పెట్టుకుంటాడు. సాధారణమైన వాళ్ళతో పోటీపడతారు.
తమ అవసరాలను తగ్గించుకుని డబ్బును పొదుపు చేస్తారు.
పెద్ద ఆలోచనలు ఉన్న వ్యక్తి  గొప్ప,గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. పెద్దవాళ్ళతో పోటీ పడతారు. సంపాదన పెంచుకుని అవసరాలను తీర్చుకుంటారు.

మిమ్మ‌ల్ని న‌మ్మండి..
మ‌నమీద మ‌న‌కు న‌మ్మ‌కం లేక‌పోతే ఏదీ సాధ్యం కాదు. అలా సాధించిన విజ‌యం కూడా మ‌న‌ది కాదు.
* మనం ఏ పనైనా కొత్తగా ఆలోచించి చేయడం వల్ల మన ఆలోచనలు లాభాలు తెచ్చిపెడతాయి.
అందరిలా కాకుండా ఏదైనా పనిని కొత్తగా చేయడానికి ప్రయత్నించాలి.
* మనం మాట్లాడే పదాల్లో `ఇది మ‌నం చేయలేం`, `ఇది మనవల్ల కాదు` అనే పదాలను తీసెయ్యాలి. మనం చెయ్యగలం అని నమ్మితే దానికి దారి ఖచ్చితంగా దొరుకుతుంది.
* మనం చేసే పనిలో మనం ఇంతకన్నా ఎక్కువ చేయగలను, అని అనుకోవాలి.
* గొప్పవాళ్ళు తక్కువ మాట్లాడుతారు. ఎక్కువ వింటారు.

మీరు ఏమ‌నుకుంటే అదే..
మన గురించి మనం ఏమనుకుంటే మనం అలాగే తయారవుతాం.
* మనకి సమాజంలో ఎక్కువ గౌరవం రావాలంటే మన భాషా మార్చుకోవాలి.
* చీప్ వస్తువులు కొనేముందు ఒక బ్రాండెడ్ వస్తువులు కొనడం అలవాటు చేసుకోవాలి.
* సక్సెస్ ఫుల్ పర్సన్ తో మనల్ని పోల్చుకోవాలి.  మనకి కోపం వచ్చినపుడు సక్సెస్ ఫుల్ వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలి.
* మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దుకోవాలి.  మన చుట్టూ ఉన్న మనుషులు బట్టి మన అలవాట్లు, మన వ్యక్తిత్వం మారుతుంది.

మనుషులు మూడు ర‌కాలు..
1. మొదటి వర్గం వారు ఏ పనిచెయ్యకుండా అదృష్టం మీద ఆధారపడతారు.  అన్నీ తమ కాళ్ళ దగ్గరకి వస్తాయని ఊహిస్తారు. గొప్ప,గొప్ప విజయాలను సాధించే సామర్థ్యం ఉందని వాళ్ళ గట్టి నమ్మకం.
2. రెండో వర్గం ఒక స్థాయి వరకు బాగా కష్టపడతారు. తర్వాత వచ్చే అడ్డంకులు చూసి ఇప్పటివరకు కష్టపడింది చాలు అనుకుంటారు.  ఈ వర్గం వారికి ఓటమి అంటే భయం.
3. మూడో వర్గం వారికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉంటుంది. సాధించేవరకూ వదిలిపెట్టరు. మొత్తం మనుషుల్లో 2-3 శాతం మాత్ర‌మే ఈ వర్గానికి వస్తారు.
ఈ వర్గంలోకి రావాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
* మన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ ఉన్న మనుషులు ఉండాలి.
* సక్సెస్ పుల్ పీపుల్‌ దగ్గర సలహాలు తీసుకోవాలి.
* మన ప్రొఫెషన్ వాళ్ళతో కాకుండా వేరే ప్రొఫిషన్ వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకోవాలి.
* కొత్త విషయాలను తెలుసుకోవాలి.

Author photo
Publication date:
Author: admin

2 thoughts on “`గొప్ప ఆలోచ‌న‌ల్లోనే గొప్ప‌వాళ్లు పుడ‌తారు * `మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్` బుక్ స‌మ‌రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *