
are you beginner in stock market
కరోనా తరువాత స్టాక్‌మార్కెట్‌కు మంచి క్రేజ్ పెరిగింది. చాలా మంది ఆసక్తిగా పెట్టుబడులు పెడుతున్నారు. మార్కెట్ కూడా అప్పటినుంచి అమాంతం పెరిగింది. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఐపీఓలు ఎక్కువగా వస్తుండటం, మార్కెట్లో మంచి లాభాలు రావడం ఇలా ఎన్నో కారణాల వల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు.
కానీ ఈ పరిస్థితే ఎప్పుడూ ఉండదు. తారుమారు కావచ్చు. అందుకే మార్కట్లో ఇన్వెస్ట్ చేసేముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని, సరైన అవగాహనతోనే ముందుకు రావాలి.
what about losses in stock market
నష్టాల గురించీ తెలుసుకోవాలి
ఏ ఇద్దరు వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. డబ్బు గురించి అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. అందుకే ఒకరికి నష్టం వచ్చినా మరొకరికి లాభం వస్తుంది. స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ముందుగా నష్టం వస్తే ఎంతవరకు తట్టుకోగలం అనేది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లు పెరిగితే మనకి తేలిగ్గా అర్థం కాదు. కానీ, మార్కెట్లు పడిపోతున్నప్పుడు మనం ఆందోళనకి గురవుతాం. దీన్ని తట్టుకునే శక్తి మనకి ఎంత వరకూ ఉందో తెలుసుకుంటే భవిష్యత్తులో లాభాలను పొందవచ్చు.
సలహాలు ఇచ్చేవారు లాభాలను మాత్రమే కానీ, నష్టాల గురించి చెప్పరు.
మన స్నేహితులు, బంధువుల్లో పెట్టుబడుల గురించి సలహాలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. వారి సలహాలతో కొన్ని సార్లు లాభాలు వస్తాయి. కానీ పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక కారణం కాకూడదు. కానీ నష్టపోయినపుడు ఎవరూ మాట్లాడరు. మనకి సలహాలు ఇచ్చినపుడు నష్టాల గురించి కూడా అడిగి తెలుసుకోవాలి.
own research make you strong in stock market
సొంత పరిశీలనే కీలకం..
మార్కెట్ పడిపోతున్నపుడు, పెరుగుతున్నపుడు రెండు దశల్లో మన సొంత అవగాహనతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
* మార్కెట్ పడిపోతున్నపుడు ఎందుకు పడిపోతుందో అర్థం చేసుకోవాలి.
* బుల్ మార్కెట్లో అన్ని షేర్లూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో కొత్త పథకాలు, వినూత్న ఆవిష్కరణలు, విదేశీ మార్కెట్లో పెట్టుబడి అవకాశాలు.. ఇలా ఎన్నో పాజిటివ్ విషయాలు వస్తుంటాయి. ఇన్వెస్టర్స్ కి అవగాహన పెంచుకునేందుకు తగిన సమయం ఉండదు. చరిత్రను పరిశీలించినా మంచి రాబడులు కనిపిస్తుంటాయి. ఒక్కసారిగా మార్కెట్ పడిపోవడం ప్రారంభమైనపుడు అది ఎందుకు తగ్గుతుందో అన్న విషయం తెలుసుకోలేకపోతే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది.
* మనకి స్టాక్ మార్కెట్ల గురించి బాగా తెలిసి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే దానికొక లక్ష్యం ఉండాలి.
* పెట్టుబడులు పెట్టడం అంటే ఒక పందెం కాదు. దీనికి ఒక లక్ష్యం ఉండాలి. దానిని సాధించాలనే తపన ఉండాలి. అందుకు సంబంధించిన పథకాలు, మొత్తం అన్నింటి గురించి ఆలోచించాలి. దీర్ఘకాలిక దృక్పథం, ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ప్రతి పెట్టుబడినీ ఒక ఆర్థిక లక్ష్యంతో ముడిపెట్టాలి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ఏడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. అప్పుడే స్వల్పకాలిక హెచ్చుతగ్గులు మనల్ని భయపెట్టవు.
* మనకి అన్ని విషయాలు తెలియకపోతే, తెలిసినవాళ్ళ సలహాలు తీసుకోవడానికి ఇబ్బంది పడకూడదు. ఇన్వెస్ట్ చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు తప్పవు. కానీ వాటిని తొందరగా గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. స్టాక్ మార్కెట్లో ప్రతి దశలోనూ పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. వీటిని ఎంత వేగంగా అందుకుంటామో ఇక్కడ కీలకమని గుర్తించాలి.