ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..?
waht is the use of credit card
ఈ రోజుల్లో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పడు కొనండి.. తర్వాత పే చేయండి అంటూ ఉద్యమంలా వస్తు విక్రయాలు చేస్తున్నారు. ఈ దశలో క్రెడిట్ కార్డులకూ ప్రాధాన్యం పెరిగింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారందరూ సుమారుగా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. నిత్య జీవితంలో వీటి అవసరం పెరగడంతో కొందరు ఒకటికి మించి క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండవచ్చు అనే సందేహాలు మాత్రం అందరిలోనూ కలుగుతుంది.
how many credit cards can we have
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే వారి ఆదాయానికి మించి ఖర్చు చేసే ఆస్కారం ఉంటుందని, దీంతో వారు రుణ ఉచ్చులో చిక్కుకు పోయే ప్రమాదం ఉందనే కారణంతోనే ఒక వ్యక్తికి ఒక క్రెడిట్ కార్డు సరిపోతుందని కొందమంది సలహా ఇస్తుంటారు. నిజానికి, ఖర్చులను నియంత్రించుకోగల సామర్థ్యం మీకుంటే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉండడం మంచిదే.
interest rate on credit card
రెండు కార్డులతో వడ్డీ లేని రుణం ఎక్కువ కాలం
క్రెడిట్ కార్డుతో ఏమైనా వస్తువులను కొంటే .. బ్యాంకు లేదా క్రెడిట్ జారీ సంస్థ వద్ద అప్పు తీసుకోనట్లే భావించాలి. కార్డు ద్వారా వినియోగించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి బ్యాంకులు కొంత సమయం ఇస్తాయి. ఆ సమయం లోపల చెల్లింపు చేసినట్లయితే ఎలాంటి వడ్డీ ఉండదు. రెండు క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం ద్వారా మీ వడ్డీ లేని చెల్లింపుల కాలవ్యవధిని పెంచుకోవచ్చు. ఉదాహరణకి మీ బిల్లింగ్ సైకిల్ చివరి తేది సెప్టెంబరు 30 అనుకుంటే , మీ వడ్డీ లేని చెల్లింపులకు అక్టోబరు 21 వరకు గడువు ఉంటుంది. మీరు సెప్టెంబరు 1 వతేదీన క్రెడిట్ కార్డు వినియోగించి వస్తువులను కొన్నారనుకుందాం. మీ వడ్డీ లేని చెల్లింపుల గడువుతేదీ అక్టోబర్ 21 వరకూ ఉంటుంది. అంటే మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి దాదాపు 50 రోజుల సమయం లభిస్తుంది. ఒక వేళ మీరు సెప్టెంబరు 30 న కొనుగోలు చేసినట్లయితే గడువుతేదీ.. అక్టోబర్ 21 అయినందువల్ల మీకు 21 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. నెలలో ఒక్కోరోజు గడుస్తున్నప్పుడు మీ వడ్డీ లేని రుణ కాలవ్యవధి కూడా తగ్గిపోతుంది. అదే బిల్లింగ్ సైకిల్ చివరి తేదీ 15 గా ఉన్న మరొక కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే అప్పుడు సెప్టెంబరు 30 తేది కొనుగోళ్ళను ఈ కార్డు ఉపయెగించి చేస్తే మీ వడ్డీ లేని రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు.
క్రెడిట్ కార్డు బిల్లును సరైన సమయంలో చెల్లించడం ద్వారా ఎక్కువ వడ్డీ నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని సమయాల్లో వ్యక్తులు క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు చెల్లించలేక కనీసం 5 శాతం బిల్లును చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాంకు వారు 2 నుంచి 3 శాతం వడ్డీ విధిస్తారు. ఇది మీరు చెల్లించని బిల్లులకు మాత్రమే కాకుండా తర్వాత చేయబోయే కొనుగోళ్ళకు కూడా వర్తిస్తుంది. మీరు మరొక క్రెడిట్ కార్డు కలిగి ఉంటే మీ పాత బిల్లును చెల్లించేంత వరకు, మీ వద్ద ఉన్న రెండో కార్డుపై తర్వాత నెల కొనుగోళ్ళు చేయడం ద్వారా ఎక్కువ వడ్డీ రేట్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
తక్కువ వడ్డీతో వస్తువులను బదిలీ…
మీకు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే చెల్లించని క్రెడిట్ కార్డు బిల్లులపై ఎక్కువ వడ్డీ రేట్లను తగ్గించుకోవచ్చు. చాలా సంస్థలు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు చెల్లించని మొత్తాన్ని వారి కార్డులకు బదిలీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మొదటి రెండు నెలలకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. తర్వాత కూడా నెలకు 1.5 నుంచి 2 శాతం వడ్డీ మాత్రమే చెల్లించే వీలుకల్పిస్తున్నాయి.
what is co branded credit cards
కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు..
కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు, సర్వీసు ప్రొవైడర్లతో అనుసంధానం అయ్యి కార్డులను అందిస్తాయి. వీటినే కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అంటారు. ఇక్కడ అన్ని కార్డులు ఒకేలా ఉండవు. కొన్ని కిరాణా దుకాణాల్లో కొనుగోళ్ళకు, మరికొన్ని ఆన్ లైన్లో షాపింగ్ కు, ఇంకొన్ని వాహన ఇంధన కొనుగోళ్ళకు లాభదాయకంగా ఉండొచ్చు. ఒక కంపెనీ వస్తువు కొన్నప్పుడు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే మనకు రివా ర్డ్ పాయింట్లు ఇస్తారు. వీటితో మనకు అదనపు లాభం చేకూరుతుంది. మీరు ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో… దానికి సంబంధించిన మరో క్రెడిట్ కార్డును వాడడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు.
ప్రత్యమ్నాయ చెల్లింపుల కోసం…
టెక్నాలజీ ఉపయోగించి డిజిటల్ లావాదేవీలు చెల్లించడం సులభం కానీ ఒక్కోసారి ఊహించని సాంకేతిక కారణాల వల్ల ఒక క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరగకపోవచ్చు. కార్డు సర్వీసు లోపం వల్ల కానీ, పీవోఎస్ మిషన్ కార్డుపై ఉన్న చిప్ రీడ్ కాకపోవడం వల్ల కాని ఇలాంటి ఇబ్బంది రావచ్చు. అలా పరిస్థితుల్లో రెండో కార్డు ఉపయోగపడుతుంది.
క్రెడిట్ కార్డు సరైన రీతిలో వినియోగిస్తే క్రెడిట్ స్కోరు పెంచుకోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో క్రెడిట్ స్కోరుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్ కార్డుకు ఉన్న పరిమితిపై మీరు ఎంత మొత్తంలో వినియోగిస్తున్నారో అన్నదానిని బట్టి క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. మీకున్న లిమిట్‌లో సగం మాత్రమే వాడుకుంటే స్కోరు పెరుగుతుంది.
ఒక కార్డు తీసుకున్నా, రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్డులు ఉపయోగించినా ఖర్చులపై నియంత్రణ, నిర్వహణ సరిగ్గా ఉంటే ప్రయెజనాలు పొందొచ్చు.నెలవారీ ఆదాయం ఎంత, ఎంత ఖర్చు చేస్తున్నాం.. అనే విషయాలపై ఖచ్చితమైన సమాచారం ఉండడం.. అలాగే సరైన సమయానికి బిల్లు చెల్లించగలగడం ముఖ్యం. సమయంలోపల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే పడే వడ్డీ భారం, పెనాల్టీలు చాలా అధికంగా ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లందరూ దృష్టిలో పెట్టుకోవాలి.
Leave a Reply