Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ప్రాపర్టీ టాక్స్ ను ఎలా లెక్కిస్తారో తెలుసా? Do You Know How Property Tax Is Calculated?

Posted on 19/02/2026 By admin No Comments on ప్రాపర్టీ టాక్స్ ను ఎలా లెక్కిస్తారో తెలుసా? Do You Know How Property Tax Is Calculated?

ఇల్లు కట్టుకున్నాం… స్థలం కొనుక్కున్నాం… ఇదంతా మన ఆస్తి అనుకుంటాం. కానీ ఆ ఆస్తి మీద ప్రతి ఏడాది ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఉందన్న విషయం చాలామందికి పూర్తిగా తెలియదు. అదే ప్రాపర్టీ టాక్స్. ఇది ఆదాయపు పన్నులా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది కాదు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, స్థానిక సివిక్ బాడీలు వసూలు చేసే పన్ను ఇది. ఇల్లు ఉన్నవారు, అపార్ట్‌మెంట్ యజమానులు, షాపులు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఖాళీ స్థలాలు ఉన్నవారు… అందరూ ఈ టాక్స్ పరిధిలోకే వస్తారు. అంటే రియల్ ఎస్టేట్ యజమానిగా ఉన్న ప్రతిఒక్కరూ ప్రాపర్టీ టాక్స్ చెల్లించాల్సిందే.

ఈ టాక్స్ ఎందుకు వసూలు చేస్తారు? Why Do Municipalities Collect Property Tax?
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మున్సిపాలిటీలకు ప్రాపర్టీ టాక్స్ ప్రధాన వనరు. ఈ డబ్బుతోనే నగరాలు, పట్టణాలు నడుస్తాయి.
రోడ్లు వేయడం, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహించడం, పార్కులు అభివృద్ధి చేయడం, వీధి దీపాలు వెలిగించడం, చెత్త సేకరణ, నీటి సరఫరా, ప్రజా మరుగుదొడ్లు… ఇవన్నీ ప్రాపర్టీ టాక్స్ ద్వారానే సాధ్యమవుతాయి. మన ఇంటి ముందు రోడ్ బాగుంటే, స్ట్రీట్ లైట్ వెలిగితే, డ్రైనేజ్ మూసుకుపోకపోతే… అందుకు కారణం మనం చెల్లించిన ప్రాపర్టీ టాక్సే అన్న విషయం చాలామందికి గుర్తుండదు.

ఎంత తరచుగా ప్రాపర్టీ టాక్స్ చెల్లించాలి?  How Often Should Property Tax Be Paid?
సాధారణంగా ప్రాపర్టీ టాక్స్‌ను ఏడాదికి ఒకసారి చెల్లించాలి. అయితే కొన్ని నగరాల్లో సౌలభ్యం కోసం ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి చెల్లించే అవకాశం కూడా ఇస్తారు. కొన్ని మున్సిపాలిటీలు ముందుగానే మొత్తం చెల్లిస్తే రాయితీ కూడా ఇస్తాయి. అందుకే చాలా మంది ఒకేసారి చెల్లించడం ఇష్టపడతారు.

ఎక్కువ విలువ ఉన్న ఆస్తికి ఎక్కువ టాక్స్ ఎందుకు? Higher Value, Higher Tax
ప్రాపర్టీ టాక్స్ ఒకేలా ఉండదు. మీ ఇంటి విలువ ఎంత ఉంటే, ఆ మేరకు టాక్స్ కూడా పెరుగుతుంది. సిటీ సెంటర్‌లో ఉన్న ఇల్లు, ప్రైమ్ ఏరియాలోని అపార్ట్‌మెంట్, కమర్షియల్ షాపు… ఇవన్నీ ఎక్కువ టాక్స్ కట్టాలి. అదే పట్టణ అవుట్‌స్కర్ట్స్‌లో, తక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో టాక్స్ తక్కువగా ఉంటుంది. ఇది న్యాయమైన విధానమే అని అధికారులు చెబుతారు. ఎందుకంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువగా చెల్లించాలి అన్నదే దీని వెనుక ఆలోచన.

ప్రాపర్టీ టాక్స్ ఎలా లెక్కిస్తారంటే? How Is Property Tax Calculated?
ఇదే చాలామందికి క్లారిటీ లేని అంశం. “ఇంత టాక్స్ ఎలా వచ్చింది?” అని బిల్ చేతికి రాగానే అనుకుంటుంటాం. నిజానికి ప్రతి మున్సిపాలిటీకి తాము అనుసరించే రూల్స్ ఉంటాయి. అయినా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఒక సాధారణ ఫార్ములానే ఉపయోగిస్తారు. ఆ ఫార్ములా ప్రకారం… ఆ ప్రాంతానికి నిర్ణయించిన బేస్ వాల్యూ, ఇంటి మొత్తం నిర్మాణ విస్తీర్ణం, ఇల్లు ఎంత పాతది, అది రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ఆస్తా, స్వంతంగా వాడుతున్నారా లేక అద్దెకు ఇచ్చారా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇల్లు కొత్తదైతే టాక్స్ ఎక్కువగా ఉంటుంది. పాత ఇళ్లకు కొంత డిప్రిసియేషన్ వర్తింపజేస్తారు. అంటే వయస్సు పెరిగే కొద్దీ టాక్స్‌లో కొంత తగ్గింపు వస్తుంది.

బిల్ట్ అప్ ఏరియా అంటే ఏమిటి? Understanding Built-up Area
చాలామంది కార్పెట్ ఏరియా ఆధారంగా టాక్స్ అనుకుంటారు. కానీ మున్సిపాలిటీలు బిల్ట్ అప్ ఏరియానే లెక్కలోకి తీసుకుంటాయి. కార్పెట్ ఏరియా మాత్రమే కాదు… గోడలు, బాల్కనీ, మెట్లు, ఇతర నిర్మాణ భాగాలు అన్నీ కలిపి మొత్తం బిల్డింగ్ విస్తీర్ణమే బిల్ట్ అప్ ఏరియా. అందుకే అపార్ట్‌మెంట్ బిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.

యూజ్ కేటగిరీ ఎందుకు ముఖ్యం? Usage Matters a Lot
ఇల్లు మీరే నివసిస్తున్నారా? లేక అద్దెకు ఇచ్చారా? లేక ఖాళీగా ఉందా? ఈ మూడు పరిస్థితుల్లో టాక్స్ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. స్వంత వినియోగంలో ఉన్న ఇళ్లకు కొంత తక్కువ రేటు ఉంటుంది. అద్దె ఇళ్లకు ఎక్కువగా వసూలు చేస్తారు. ఎందుకంటే అది ఆదాయం తీసుకొచ్చే ఆస్తిగా పరిగణిస్తారు.

ఇండియాలో ప్రాపర్టీ టాక్స్ విధానాలు.. Different Systems Followed in India
దేశవ్యాప్తంగా ఒకే విధానం లేదు. ప్రధానంగా మూడు విధానాలు అమలులో ఉన్నాయి. మార్కెట్ విలువ ఆధారంగా టాక్స్ లెక్కించే విధానం క్యాపిటల్ వాల్యూ సిస్టమ్. ఇది ముఖ్యంగా Mumbaiలో అమలులో ఉంది. ఏరియా ఆధారంగా లెక్కించే విధానాన్ని యూనిట్ ఏరియా వాల్యూ సిస్టమ్ అంటారు. ఇది Delhi, Bengaluru వంటి నగరాల్లో ఉంది. అద్దె విలువను ఆధారంగా చేసుకునే విధానం అన్యువల్ రెంటల్ వాల్యూ సిస్టమ్. ఇది Hyderabad, Chennai లో అమలులో ఉంది.

రెసిడెన్షియల్ ఇళ్లకు టాక్స్ ఎలా నిర్ణయిస్తారు? Residential Property Tax Explained
నగర మధ్యలో ఉన్న ఇల్లు అయితే టాక్స్ ఎక్కువ. ఇల్లు కొత్తదైతే టాక్స్ ఎక్కువ. ఇల్లు పెద్దదైతే టాక్స్ ఎక్కువ. ఇండిపెండెంట్ హౌస్‌కు, అపార్ట్‌మెంట్‌కు కూడా రేట్లు వేర్వేరు. ఈ అంశాలన్నింటినీ కలిపి తుది టాక్స్‌ను నిర్ణయిస్తారు.

సమయానికి కట్టకపోతే ఏమవుతుంది? Late Payment Comes at a Cost
ఇదే చాలామంది నిర్లక్ష్యం చేసే విషయం. “తరువాత కడతాం” అనుకుంటే టాక్స్‌తో పాటు పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. లేట్ పేమెంట్‌పై వడ్డీ 5 శాతం నుంచి 20 శాతం వరకు ఉండొచ్చు. ఇది మున్సిపాలిటీపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. Bengaluru గత ఏడాది టాక్స్ చెల్లించని వారిపై అవుట్‌స్టాండింగ్ అమౌంట్‌కు సమానమైన పెనాల్టీతో పాటు సంవత్సరానికి 15 శాతం వరకు వడ్డీ విధిస్తామని ప్రకటించింది. 2025–26 సంవత్సరానికి టాక్స్ చెల్లించకపోతే నవంబర్ చివరి నుంచి పెనాల్టీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చా? Easy Online Payment Options
ఇప్పుడు చాలా మున్సిపాలిటీలు ప్రాపర్టీ టాక్స్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించే సదుపాయం కల్పించాయి. మీ ఏరియా మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాపర్టీ నంబర్ నమోదు చేస్తే బిల్ వివరాలు కనిపిస్తాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డు ద్వారా చెల్లించవచ్చు. బిల్ కాపీ కూడా వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది. ఏదేమైనా ప్రాపర్టీ టాక్స్ అనేది తప్పించుకునే పన్ను కాదు. ఇది మన నగరం, మన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే నిధి. సమయానికి చెల్లిస్తే పెనాల్టీ భారం ఉండదు. రాయితీలు కూడా పొందవచ్చు. ఇల్లు మనదైతే… నగరం కూడా మనదే. ఆ నగరాన్ని బాగుచేయడంలో మన వంతు బాధ్యతగా ప్రాపర్టీ టాక్స్‌ను సమయానికి చెల్లించడం ప్రతి పౌరుడి కర్తవ్యం.

107
FEATURE NEWS Tags:Different Systems Followed in India, Easy Online Payment Options, Higher Tax, Higher Value, How Is Property Tax Calculated?, How Often Should Property Tax Be Paid?, Late Payment Comes at a Cost, Residential Property Tax Explained, Understanding Built-up Area, Usage Matters a Lot, Why Do Municipalities Collect Property Tax?

Post navigation

Previous Post: 15 రోజుల్లో డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ .. ! బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు! Death Claim Settlement in Just 15 Days… No Need to Visit the Bank!
Next Post: టర్మ్ పాలసీ రద్దయ్యిందా? అయితే వెంట‌నే పునరుద్ధరించుకోండి! Has Your Term Policy Lapsed? Revive It Immediately!

Related Posts

  • స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier FEATURE NEWS
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే FEATURE NEWS
  • కమొడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి? కమొడిటీలో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి ? What is Commodity Trading FEATURE NEWS
  • డిజిటల్‌ చెల్లింపుల‌కు మించి నగదు వినియోగం .. Cash Usage Outpaces Digital Payments FEATURE NEWS
  • తల్లిదండ్రులకు అద్దె చెల్లిస్తే HRA మినహాయింపు ఉంటుందా? Will You Get HRA Exemption If You Pay Rent to Your Parents? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • క్రెడిట్ కార్డును స‌ద్వినియోగం చేసుకోండి how to get profits from credit card FEATURE NEWS
  • గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates FEATURE NEWS
  • అర్బన్‌ సహకార బ్యాంకుల రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు.. RBI Introduces New Lending Norms for Urban Co-operative Banks FEATURE NEWS
  • ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status? FEATURE NEWS
  • ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి! Using Instant Loan Apps? Take These Precautions! FEATURE NEWS
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying FEATURE NEWS
  • లోన్‌పై రూ.లక్షలు ఎలా ఆదా చేయాలో తెలుసా? Do You Know How to Save Lakhs on Your Loan? FINICAL PLANNING
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ .. రూ.2 లక్షల పెట్టుబడితో రూ.1 లక్షకు పైగా లాభం! SBI FD Bonanza: Earn Over ₹1 Lakh Profit with a ₹2 Lakh Investment INVESTMENTS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme