Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

15 రోజుల్లో డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ .. ! బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు! Death Claim Settlement in Just 15 Days… No Need to Visit the Bank!

Posted on 19/02/2026 By admin No Comments on 15 రోజుల్లో డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ .. ! బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు! Death Claim Settlement in Just 15 Days… No Need to Visit the Bank!

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే… ఆ బాధను భరించడం ఒక వైపు, మిగిలిన వారి జీవితాన్ని ముందుకు నడిపించడం మరో పెద్ద సవాల్‌. అంత్యక్రియల ఖర్చులు, రోజువారీ అవసరాలు, పిల్లల చదువులు, అప్పులు… అన్నీ ఒకేసారి ఎదురొస్తాయి. ఇలాంటి సమయంలో, మరణించిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్మును పొందాలంటే కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఇబ్బందులు మాత్రం మాటల్లో చెప్పలేనంత తీవ్రమైనవి. కొన్నిసార్లు నెలలు గడిచినా క్లెయిమ్ (Death Claim) ముందుకు కదలని పరిస్థితి. ఈ క్రమంలో చిన్న మొత్తాల డిపాజిట్లు ఉన్న కుటుంబాలు “అంత కష్టపడలేం” అంటూ ఆ డబ్బునే వదిలేసిన సందర్భాలూ ఎన్నో. ఈ దుస్థితికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు వేసింది Indian Overseas Bank.

బాధలో ఉన్న కుటుంబాలకు డిజిటల్ చేయూత.. A Human-Centric Banking Reform
డెత్ క్లెయిమ్ (Death Claim) సెటిల్‌మెంట్ అంటే తప్పనిసరిగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అధికారులను కలవాలి. పత్రాల కట్టలు మోయాలి అన్న భావనకు ఐఓబీ తెరదించింది. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో, ఆయన కుటుంబ సభ్యులు లేదా వారసులు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే డెత్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు… బాధలో ఉన్న కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా ఆదుకునే నిర్ణయం.

15 రోజుల గడువు… స్పష్టమైన హామీ.. No More Endless Waiting
ఈ కొత్త విధానంలో (Death Claim) అత్యంత కీలక అంశం – కాలపరిమితి. అవసరమైన పత్రాలు సక్రమంగా సమర్పిస్తే, 15 రోజుల్లోనే డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తవుతుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్పష్టంగా ప్రకటించింది. ఇప్పటివరకు డెత్ క్లెయిమ్‌లు అంటే నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ నిరీక్షణే బాధిత కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితికి బ్రేక్ పడనుంది.

రూ.15 లక్షల వరకు… ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు.. Big Relief for Middle-Class Families
డెత్ క్లెయిమ్‌లలో (Death Claim)చాలామందిని వెనక్కి నెట్టిన అంశం థర్డ్ పార్టీ ష్యూరిటీ. ఎవరో ఒకరు గ్యారంటీ ఇవ్వాలి, బాండ్‌పై సంతకం చేయాలి, న్యాయపరమైన చిక్కుల్లో పడాల్సి వస్తుందన్న భయం కుటుంబాలను వెంటాడేది. ఈ భయాలకు చెక్ పెడుతూ ఐఓబీ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15 లక్షల వరకు ఉన్న డిపాజిట్లకు ఎలాంటి థర్డ్ పార్టీ ష్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది.

ఆన్‌లైన్ క్లెయిమ్ విధానం ఎలా ఉంటుంది? Simple, Transparent, Digital
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక పోర్టల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెత్ క్లెయిమ్ (Death Claim) సెటిల్‌మెంట్ విభాగం ద్వారా ఈ ప్రక్రియ సాగుతుంది. నామినీ లేదా చట్టబద్ధ వారసుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఫారం, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ గుర్తింపు పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నామినీ లేని ఖాతాల విషయంలో ఇండెమ్నిటీ బాండ్‌, డిస్‌క్లెయిమర్ లెటర్‌, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ వంటి పత్రాలకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలను బ్యాంక్ ఇచ్చింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం… ఈ మొత్తం ప్రక్రియలో బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం.

ఆర్‌బీఐ మార్గదర్శకాల అమలు.. RBI Push Behind the Reform
ఈ మార్పుల వెనుక కేంద్ర బ్యాంక్ ఆదేశాలున్నాయి. Reserve Bank of India గత ఏడాది సెప్టెంబర్‌లో డెత్ క్లెయిమ్‌ (Death Claim)లపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్‌లను 15 రోజులలోపు సెటిల్ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆలస్యం జరిగితే నామినీలకు పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. 2026 మార్చి 31లోపు అన్ని బ్యాంకులూ ఈ నిబంధనలను అమలు చేయాలని సూచించింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా, ముందడుగు వేసిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఐఓబీ ఒకటిగా నిలిచింది.

ఇతర బ్యాంకులకు దారి చూపే నిర్ణయం.. A Model for the Banking Sector
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ ఆన్‌లైన్ డెత్ క్లెయిమ్ (Death Claim)విధానం, ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో చర్చకు దారితీస్తోంది. త్వరలోనే ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులూ ఇలాంటి సదుపాయాలను తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలా జరిగితే, డెత్ క్లెయిమ్ అంటే భయపడే పరిస్థితి మారిపోతుంది.

బాధలోనూ గౌరవం… ఇదే అసలైన మార్పు.. Restoring Dignity to the Process
డెత్ క్లెయిమ్ (Death Claim)సెటిల్‌మెంట్ అనేది కేవలం ఒక ఫైనాన్షియల్ ప్రాసెస్ కాదు. అది ఒక కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ దశలో బ్యాంక్ వ్యవహారం మరింత మానవీయంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిర్ణయం, కాగితాల కంటే మనిషిని ముందుంచిన మార్పుగా చెప్పుకోవచ్చు. బాధను పూర్తిగా తుడిచివేయలేకపోయినా, ఆర్థిక భారం మాత్రం తేలిక చేసే అడుగు ఇది.

బాధిత కుటుంబాలకు ఊర‌ట‌.. Relief for Bereaved Families
15 రోజుల్లో డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ (Death Claim)అనే ఈ నిర్ణయం, బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక మౌన సంస్కరణగా నిలవనుంది. బాధలో ఉన్న కుటుంబాలకు ఇది నిజమైన ఊరట. రేపటి బ్యాంకింగ్ మరింత మానవీయంగా మారుతుందన్న ఆశకు ఇది నిదర్శనం.

ఆలస్యమైతే పరిహారం తప్పదు..Compensation Is Mandatory if There Is a Delay
డెత్ క్లెయిమ్‌ను నిర్ణీత గడువులో పరిష్కరించకపోతే, బ్యాంకులు బాధ్యత వహించాల్సిందేనని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. ఆలస్యం జరిగిన ప్రతి రోజుకు, నామినీ లేదా చట్టబద్ధ వారసులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో బ్యాంకింగ్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇకపై డెత్ క్లెయిమ్‌లను నిర్లక్ష్యం చేసే పరిస్థితికి బ్రేక్ పడనుంది.

నామినీ ఉన్నా… లేకపోయినా గడువు ఒకటే.. Same Deadline — Whether a Nominee Exists or Not
ఖాతాకు నామినీ ఉన్నా, లేకపోయినా డెత్ క్లెయిమ్ పరిష్కారానికి వర్తించే గడువు ఒకటేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నామినీ లేని సందర్భాల్లో ఇండెమ్నిటీ బాండ్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ వంటి అదనపు పత్రాలు అవసరమైనప్పటికీ, అవన్నీ సమర్పించిన తర్వాత 15 రోజులలోనే క్లెయిమ్ పూర్తి చేయాలి. దీంతో నామినీ లేకపోవడం వల్ల సంవత్సరాల తరబడి డబ్బు నిలిచిపోయే పరిస్థితి ఇక ఉండదన్న విశ్వాసం ఏర్పడుతోంది.

 

73
FEATURE NEWS Tags:A Human-Centric Banking Reform, A Model for the Banking Sector, Big Relief for Middle-Class Families, Compensation Is Mandatory if There Is a Delay, Digital, No More Endless Waiting, RBI Push Behind the Reform, Relief for Bereaved Families, Restoring Dignity to the Process, Same Deadline — Whether a Nominee Exists or Not, Simple, Transparent

Post navigation

Previous Post: అమెరికా హడావుడి మధ్య… చిలీతో భారత్ నిశ్శబ్ద వ్యూహాత్మక అడుగు! Amid the U.S. Hype… India’s Silent Strategic Move with Chile!
Next Post: ప్రాపర్టీ టాక్స్ ను ఎలా లెక్కిస్తారో తెలుసా? Do You Know How Property Tax Is Calculated?

Related Posts

  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS
  • ఏదీ స‌రైన పెట్టుబ‌డి..? FEATURE NEWS
  • what are the problems with small Loan Apps  లోన్ యాప్స్‌తో  సమస్యలు ఏమిటి FEATURE NEWS
  • మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore FEATURE NEWS
  • అదానీపై హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లేమిటి What is Hindenburg’s allegation against Adani FEATURE NEWS
  • 15:65:20 రూల్ పాటించండి.. సంప‌న్నుల‌వ్వండి! Follow the 15:65:20 Rule… Become Wealthy! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • వెండి ధర పైపైకి.. కిలో రూ.2ల‌క్ష‌లు .. Silver Prices Soar: One Kilogram Crosses ₹2 Lakh FEATURE NEWS
  • ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies FEATURE NEWS
  • విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు.. EPFO New Guidelines for International Workers FINICAL PLANNING
  • కమొడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి? కమొడిటీలో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి ? What is Commodity Trading FEATURE NEWS
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అంటే..? MARKET
  • ఏప్రిల్‌ 1 నుంచి ఏటీఎం రూల్స్‌లో మార్పులు… బ్యాంకు ఖాతాదారుల‌పై అదనపు భారం? ATM Rule Changes from April 1… Extra Burden on Customers? FEATURE NEWS
  • దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ! Gold and Silver Prices Slip FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme