
సొంతంగా బిజినెస్ చేసుకోవాలని, ఇండిపెండెంట్గా బతకాలని చాలా మందికి ఉంటుంది. కానీ అనుకున్నంత ఈజీగా అది సాధ్యపడదు. మనకున్న బాధ్యతలు, బౌండరీస్ ను దాటుకుని బిజినెస్ మొదలు పెట్టడమే మనకు చాలా కష్టం. అయినా రిస్క్ తీసుకుని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశామే అనుకుందాం. మారి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడం మనకు వీలవుతుందా. మరి బిజినెస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలో అన్న విషయాన్ని ZERO TO ONE పుస్తకంలో రచయిత స్పష్టంగా వివరించారు.
`ZERO TO ONE` పుస్తకంను PETER THIEL రచించారు. PETER THIEL 5 బిలియన్ డాలర్ల సంపద గల బిజినెస్ మేన్. ఫేస్బుక్ లో ఇన్వెస్ట్ చేసిన తొలి అవుట్ సైడ్ ఇన్వెస్టర్. ఈ పుస్తకం ద్వారా PETER THIEL స్టార్ట్ అప్ బిజినెస్ కి అవసరమైన సక్సెస్ స్ట్రాటెజీస్ ను, బిజినెస్ పట్ల తనకున్న అభిప్రాయాలను ఆలోచన విధానాన్నివివరించారు. మొదటిలోనే మన బిజినెస్ ను టాప్ పొజిషన్ కి తీసుకువెళ్ళాలంటే మనం తప్పకుండా ఈ విషయాలను తెలుసుకుందాం.
THE CHALLENGE OF THE FUTURE
భవిష్యత్తు అంటే ఈ రోజులకు పూర్తి డిఫరెంట్ గా ఉండాలి. అలా మారే సమాజానికి తగ్గట్టుగా మనం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. మనం పెట్టే బిజినెస్ ఆ మార్పులకు అనుగుణంగా ఉండాలి.
మార్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది.
* HORIZONTAL
* VERTICAL
మార్పు HORIZONTAL గా ఉంటే GLOBALIZATION అంటారు.
మార్పు VERTICAL గా ఉంటే TECHNOLOGY అంటారు.
ఇది వరకే ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడాన్ని HORIZONTAL పద్దతి అంటారు.
ఇంతవరకు ఎవరూ కనిపెట్టనిది కనిపెడితే దాన్ని VERTICAL పద్దతి అంటారు. ఇక్కడ కొత్తదారులను కనుక్కోవడం అవసరం. ప్రపంచం నిజంగా అభివృద్ది చెందాలంటే మార్పు అనేది వర్టికల్ గా జరగాలి. అలాంటి మార్పు స్టార్ట్ అప్ ద్వారానే సాధ్యపడుతుంది. స్టార్ట్ అప్ పెట్టాలంటే కొత్తగా ఆలోచించాలి. దానికి ధైర్యం కావాలి.
what is dot com bubble in 2000
అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ 5048 పాయింట్లకు చేరి 3 వారాల్లో 3321 పాయింట్లకు పడిపోయింది. ఎంతోమంది ఇన్వెస్టర్స్ తీవ్రంగా నష్టపోయారు. దీనికి కారణం 1999 సంవత్సరంలో డాట్ కమ్ అనే పదాన్ని చివర్లో కలిపి రోజుకో కొత్తకంపెనీ పుట్టుకొచ్చి స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యాయి. కంపెనీలు లాంచ్ చేసినపుడల్లా కంపెనీ ఓనర్స్ పార్టీలు చేసుకునేవారు. Party like it’s 1999 అని పేరు వచ్చింది. దాని తర్వాత 2000లో స్టాక్ మార్కెట్లన్నీ బబుల్ లా పేలిపోయాయని చెబుతుంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత entrepreneurs నేర్చుకున్న పాఠాలివి.
అప్పటి వరకూ బిజినెస్ మెన్కి కొన్ని అభిప్రాయాలు ఉండేవి. రిస్క్ చేయకుండా మెల్లగా బిజినెస్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్లాన్ చేయకుండా సిట్యూవేషన్ కి తగ్గట్టుగా నడుచుకోవాలి.
మార్కెట్లో ముందుగా ఉన్న వాటినే తయారుచేయాలి. ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టాలి, సేల్స్ మీద కాదు.
అయితే ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలని రచయిత చెప్తారు.
* రిస్క్ తప్పకుండా తీసుకోవాలి.
* ఏదో ఒక ప్లాన్ లేకుండా ఉండకూడదు.
*యఆల్ రడీ ఉన్న వాటివి తయారు చేస్తే మన లాబాలు తగ్గిపోతాయి.
* ప్రొడక్ట్ తో పాటు సేల్స్ చేయడం కూడా ముఖ్యం.
ఇలా కొన్ని ఖచ్చితమైన విషయాలను రచయిత ప్రతిపాదించారు. ప్రతి ఒక్క స్టార్ట్ అప్ కి ఈ 4 సూత్రాలు వర్తిస్తాయి.
కంపెనీలు బాగుండాలంటే…
Happy గా ఉన్న కంపెనీలన్నీ ప్రత్యేకం.
ఫెయిల్యూర్స్ కంపెనీలన్నీ మార్కెట్లో పోటీలు తట్టుకోలేనివి.
ఇక్కడ రచయిత రెండు రకాల మార్కెట్స్ గురించి వివరించారు.
1.Monopoly మార్కెట్ అంటే ఒక ప్రొడక్ట్ ని కేవలం ఒక కంపెనీ మాత్రమే తయారుచేయాలి. ఆ కంపెనీ ప్రొడక్ట్ ని ఎంత కి అమ్మితే అంతకే కొనాలి.
2.Perfect Competition అంటే ఒకే ప్రొడక్ట్ ను మార్కెట్లో చాలా కంపెనీలు అమ్మడం. మిగతా కంపెనీస్ ఆ ప్రొడక్ట్ ని ఎంతకి అమ్మితే ఆ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కంపెనీలు కూడా దాదాపు అదే రెటుకి అమ్మాలి.
* మనం స్థాపించబోయే బిజినెస్ లేదా కంపెనీ ప్రపంచ స్థాయిలో ఉండాలంటే మనం ఒకటి ఆలోచించాలి. ఏ ఒక్కరు ఇంతవరకూ డీల్ చేయని కంపెనీ ఏదైనా ఉందా అని ఆలోచించుకోవాలి.
* మార్కెట్లో కస్టమర్స్ అవసరాలను తెలుసుకుని వాళ్ళకు మనం ఆ ప్రొడక్ట్ సప్లై చేయగలిగితే మనం క్లిక్ అయినట్టే.
కంపిటీషన్ ఉంటేనే..
ఇతరులతో పోటీ పడటం అనేది మన ఎదుగుదలను ఆపేస్తుంది. మనతోనే మనం పోటీ పడాలి. ఇదే విషయం కంపెనీలకు కూడా వర్తిస్తుంది. కాంపిటేషన్ ఉండకూడదంటే మీ కాంపిటేటర్స్ ని మీలో కలుపుకోవాలి. కాంపిటేషన్ ను తప్పించుకోవడమే Monopoly బిజినెస్లో ఫస్ట్ స్టెప్. ఒక కంపెనీ పెట్టే ముందు మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఈ రోజు నుంచి 10 సంవత్సరాల వరకు నిలబడగలదా అని ప్రశ్నించుకోవాలి. కంపెనీ స్టార్ట్ చేసిన వెంటనే లాభాల మీద దృష్టిపెట్టకూడదు.
Monopolyలో ఈ ఫ్యాక్టర్స్ ఉండాలి
మనం తయారు చేసే ప్రొడక్ట్ ఇతరులు కాపీ కొట్టడానికి వీలుగా ఉండకూడదు.
ముందు ఒక స్మాల్ గ్రూప్ లేదా ఒక ఏరియాపై ఫోకస్ పెట్టాలి. తర్వాత అదే పెద్దనెట్ వర్క్ అవుతుంది.
బిజినెస్ పెరిగే కొద్దీ మన ఖర్చులు తగ్గుతాయి. వస్తువులను తయారుచేసిన వారికే ఇవి కలిసొస్తాయి.
మంచి క్వాలిటీ బ్రాండెడ్ స్టోర్స్, ప్రోపర్ మార్కెట్ తో పాటు మంచి బ్రాండ్ ను క్రియేట్ చెయ్యాలి.
చిన్న మార్కెట్ తో మొదలుపెట్టి పెద్ద మార్కెట్ ను సాధించండి. ఒక Monopoly కంపెనీను తయారు చేయాలంటే మనకుఖచ్చితమైన విజన్ ఉండాలి.
అదృష్టం కన్నా..
అదృష్టం అనేది హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ద్వారా వస్తుంది. మనుషులు 4 రకాలుగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
1.Definite Optimism: అంతా మంచే జరుగుతుంది అని అనుకోవడం.
2.Indefinite Optimism : ప్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు గాని అంత మంచే జరుగుతుందని అనుకోవడం.
3.Definite Pessimism : ప్యూచర్ అంతా దరిద్రంగా ఉండబోతుందని అనుకోవడం.
Indefinite Pessimism : ప్యూచర్ గురించి తెలియదు గానీ ఏదో ఒకటి జరుగుతుంది అనుకోవడం.
మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలా విషయాలను గురించి ఆలోచించాలి. అనేక విషయాల గురించి పరిశీలించి నేర్చుకోవాలి. వాటిని సక్సెస్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇవన్నీ జరగాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ అప్లయ్ చేయాలో రచయిత ZERO TO ONE బుక్ లో ఉదహరణలతో వివరించారు.
ప్రతి ఒక్క స్టార్ట్ అప్ కంపెనీ ఒక ప్రొడక్ట్ లేదా ఒక సర్వీస్ ఏదైతే ప్యూచర్ లో ఒక వాల్యూలో ఉండబోతుందో దాని మీద మాత్రమే ఫోకస్ చెయ్యాలి. మనకు దేనిలో బాగా నైపుణ్యం ఉంటే దానిని ఉపయోగించి స్టార్ట్ అప్ మొదలుపెట్టండి. ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది అన్నీ కనిపెట్టేశారు. మనం కనుక్కోడానికి మరేం మిగలలేదు అనుకోకండి. ఇంకా ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుక్కోవలిసి ఉంది. ఒక పని మనం చేయడం కష్టం అనుకుంటే కనీసం ప్రయత్నం కూడా చెయ్యలేం.
FOUNDATIONS
తప్పులు అందరూ చేస్తారు. కాని కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించవలిసి ఉంటుంది. ఒక స్టార్ట్ అప్ పెట్టిన మొదట్లో చేసిన తప్పులు చాలా నష్టం కలిగిస్తాయి. వాటిని మొదట్లో సరిచేయాలి. అలాంటి తప్పుల్లో ఒకటి కో ఫౌండర్ ను సెలెక్ట్ చేసుకోవడం. కో ఫౌండర్ మనకు బాగా తెలిసిన వ్యక్తి అయితే చాలా మంచిది. ఒక కంపెనీ స్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉంటే అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.
కంపెనీ బేసిక్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి.
1.OWNER SHIP: ఎవరు కంపెనీలో పెట్టుబడి పెడతారో వారే.
2.POSSESSION: ఎవరు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటారో వారే.
3.CONTROL కంపెనీ అసెట్స్ ను చూసుకున్నవాళ్ళు.
Ceo అనే వ్యక్తి కూడా రోల్ మోడల్ లా ఉండాలి. తక్కువ జీతం తీసుకుని కంపెనీ అబివృద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
THE MECHANICS OF MAFIA
ఒకప్పుడు పేపాల్ గ్రూప్ లో పనిచేసే ఎంప్లాయీస్ ను పేపాల్ మాఫియా అనే వాళ్ళు. వాళ్లు పేపాల్నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రపంచంలో బిగ్గెస్ట్ ఐటీ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయి ది బెస్ట్ కంపెనీలను తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. అంత కమిట్ మెంట్ ఉన్న ఎఫిషియంట్ వర్కర్స్ వాళ్లంతా. ఒక స్టార్ట్ అప్ లో ఎంప్లాయీస్ ను తీసుకునేముందు వారి విజన్ ఏంటో కనుక్కోవాలి. వారు ఆ స్టార్ట్ అప్ ని డెవలప్ మెంట్ కోసం డెడికోషన్ తో పనిచేయాలి.
అమ్మకపోతే ఎలా..
మనం ఎంత మంచి ప్రొడక్ట్ ను తయారు చేసినా వాటిని అమ్మకపోతే ఏమి ప్రయోజనం ఉండదు. అందుకే ఇక్కడ మనం రెండు మెట్రిక్స్ మీద దృష్టిపెట్టాలి.
* కాస్ట్ ఆఫ్ ఎక్వైరింగ్ కస్టమర్
* కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ.
ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్ ను కొనడానికి మనకయ్యే ఖర్చును కాస్ట్ ఆఫ్ ఎక్వైరింగ్ కస్టమర్ అంటారు.
కస్టమర్ ప్రొడక్ట్ కు చెల్లించే ధరను కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ అంటారు. కస్టమర్ కి అయ్యే ఖర్చు కంటే మన ఖర్చు తక్కువ అవ్వాలి.
వీటికి సమాధానం చెప్పుకోండి..
ఒక స్టార్ట్ అప్ కంపెనీ సక్సెస్ అవుతుందా లేదా అని ముందే తెలియాలంటే ఈ ప్రశ్నలకు మన వద్ద జవాబులు ఉండాలి.
* మన దగ్గర ముందే ఉన్న టెక్నాలజీని ఇంప్రూవ్ చేయకుండా క్రియేట్ చేయగలరా
* మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి సమయం అనుకూలంగా ఉందా.. లేదా ?
* కొత్త మార్కెట్లో అతి పెద్ద షేర్ తో మన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా?
* మన వద్ద సరైన టీమ్ ఉందా వారు మన ఆలోచనలతో ఏకీభవిస్తారా?
* మన ప్రొడక్ట్ ని డెలివరీ చేయడానికి మన వద్ద సరైన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందా?
* మన బిజినెస్ 10-20 సంవత్సరాలు నిలబడగలుగుతుందా ?
* ఇతరులు కనిపెట్టలేని సీక్రెట్స్ ను మనం కనిపెట్టగలమా?
THE FOUNDER ‘S CHARACTER
ఒక కంపెనీకి పౌండర్ క్యారెక్టర్ ప్లస్ అవ్వవచ్చు లేదా మైనస్ అవ్వవచ్చు. అయినా ఆ కంపెనీ ప్రొడక్ట్ మీద నమ్మకం ఏర్పడితే ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది. ఇతరులు ఏమనుకున్నా మనం అనుకున్నదే చెయ్యాలి. మన లక్ష్యం ప్రతి ఒక్కరి నుంచి మంచి అవుట్ పుట్ తీసుకురావడం, కష్టమర్లని సంతృప్తి పరచడం. ఇలా చేయగలిగే నాడే బిజినెస్ సక్సెస్ షురూ..