WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL? book review telugu వై డోంట్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్..? పుస్తక సమరీ
మనం 25 ఏళ్లు వచ్చేదాకా స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్, యూనివర్శిటీ, పీహెచ్‌డీ ఇలా ఎన్నో డిగ్రీలు పూర్తిచేస్తాం. ఎంతో ఙానాన్ని ఆర్జిస్తాం.. కానీ జీవితానికి అవసరమయ్యే డబ్బు పాఠాలు మాత్రం మనం ఎక్కడా నేర్చుకోలేం. స్కూల్, కాలేజ్‌లో ఏ మాస్టారు కూడా ఈ విషయాలను వివరించరు. అయితే ఇలాంటి నేర్పని పాఠాల గురించి వివరించే పుస్తకం
WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL?..
డబ్బు గురించి మనకి తెలియని విషయాలను WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL? అనే ఈ పుస్తకంలో రచయిత CARY SIEGL తన జీవితంలో అనుభవాలతో తెలుసుకున్న 99 సూత్రాలను వివరించారు. ఈయన మనీ మేనేజ్ మెంట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ పుస్తకంలో రచయిత బడ్జెట్, ఖర్చులు, ఇన్వెస్టింగ్ గురించి చాలా క్లియర్ గా వివరించారు.
LIFE LESSONS..
జీవితంలో తెలుసుకోవలిసిన ముఖ్యమైన విషయాలను ఓ సారి చూద్దాం..
* ఫైనాన్షియల్ గా కరెక్ట్ గా ఉన్న వ్యక్తిని వివాహమాడాలి. ఫైనాన్షియల్లీ వ్యక్తి అంటే బాగా ఆస్తుల ఉన్న వ్యక్తి కాదు. ఆర్థికపరంగా మంచి విలువలను కలిగి ఉన్న వ్యక్తి. విచ్చలవిడిగా ఖర్చుపెట్టే వ్యక్తి అయితే ఎంత ఆస్తి ఉన్న తరిగిపోవాల్సిందే.
* పిల్లలను కనేముందు వారి చదువులకు, ఆరోగ్యానికి, వారిని పెంచి పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టాలి.
* అప్పు చేసి విలాసవంతమైన వస్తువులను కొనకూడదు.
* ఎప్పుడూ ఉన్నదానికంటే కాస్త తక్కువగా బతకాలి. అలాగని చిన్న,చిన్న సంతోషాలను వదులుకోకూడదు.
* మన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
* మన ఫ్రెండ్ సర్కిల్ ను పెంచుకోవాలి. ఎందుకంటే రకారకాల రంగాల్లో పనిచేస్తుండే వారు ఎవరు ఎప్పుడు మనకి అవసరమవుతారో ఎవరికీ తెలియదు… అందుకే వారి కోసం
* ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎంత సంపాదించిన ఆరోగ్యం సరిగా లేకపోతే అంత వృదా అయినట్టే.
what is BUDGETING…
మనం సంపాదించిన దానిలో ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని లెక్క కట్టడాన్ని బడ్జెటింగ్ అంటారు.
బడ్జెట్ ని మనం మూడు రకాలుగా విభజించాలి.
DOVELOPING 2. TRACKING 3. ANALYSING
* డెవలపింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్ లోకి ఎంత వస్తుంది, ఎంతపోతుందో మనం అంచనా వేయాలి. ఈ రెండింటినీ అంచనా వేసి బడ్జెట్ ను తయారుచేయాలి.
* ట్రాకింగ్ అంటే మనకి కరెక్ట్ గా ఎంత వస్తుందో, ఎంత పోతుందో తెలుసుకోవడాన్ని ట్రాకింగ్ అంటారు. అది తెలియాలంటే మన బ్యాంక్ స్టేట్ మెంట్, క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ ఉపయోగించాలి.
* ఎనలైజింగ్ అంటే స్టేట్ మెంట్ లో ఆదాయాన్ని, ఖర్చులను పరిశీలించి, మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నామో ఎంత ఆదా చేయవచ్చు… ఇలాంటి విషయాలపై ఎనలైజ్ చేయాలి.
మనం ఈ మూడు పద్దతులను అనుసరిస్తే కొన్ని నెలలో మన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
THINK BEFORE SPENDING…
ఖర్చు పెట్టేముందు కొన్ని విషయాలను తెలుసుకుందాం…
* ఎదుటివారు వస్తువులు కొన్నారని మనం కొనకూడదు. మనకి అవసరమైన వస్తువులు మాత్రమే కొనాలి.
మన అవసరాలు తీరాకే విలాసాలకు వెళ్లాలి.
* రోజు వాడే వస్తువులకోసం కొంచె ఎక్కువ ఖర్చు చేసినా తప్పులేదు. కానీ తక్కువగా వాడే వస్తువులకోసం సెకెండ్ హ్యాండిల్ అయినా నష్టం లేదు.
* ఏదైనా పెద్ద వస్తువు కొనేటపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కాస్త ఆలస్యమైనా నష్టంలేదు.
* స్మోకింగ్, ఆల్కాహాలు వంటి పై ఎక్కువ డబ్బును ఖర్చు చేయకూడదు.
* చెడు అలవాట్లు అన్నింటిపై ఒక నెలలో ఎంత ఖర్చు చేస్తున్నారో ఆ డబ్బులను రికరింగ్ డిపాజిట్ చేయాలి. కొన్ని నెలలకి మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ పై అవగాహన కలిగి చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు.
* ఒకనెల ముందే ఈఎమ్ఐ చెల్లించాలి. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ పై ఇప్పుడే ఖర్చు చేయాలి. అవి ఇచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ.
INVESTMENT AND DEBT
మనీ మేనేజ్ మెంట్ లో ఇన్వెస్ట్ మెంట్, డెబిట్ చాలా ముఖ్యమైనవి.
పెట్టుబడులు పెట్టడంతో పాటు అప్పు చేయడం కూడా మనీ మేనేజ్ మెంట్ లో ఒక భాగం.
మనకి చాలా అప్పులు ఉంటే, వాటి నుంచి బయటపడేందుకు కొన్ని పద్ధతులు ఫాలో కావాలి.
* మనకి ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం ఆపాలి.
* క్రెడిట్ కార్డు వాడకం తగ్గించాలి. మన చెల్లింపులకోసం డెబిట్ కార్డు, క్యాష్ వాడాలి.
* మన అప్పులన్నీ వరుస క్రమంలో రాయాలి. చిన్న,చిన్న అప్పులను ముందుగా తీర్చేయాలి. తర్వాత ఎక్కువ వడ్డీ ఇచ్చే అప్పులను తీర్చేయాలి.
* ఒక్క క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు మన దగ్గర ఉంచుకోవద్దు.
* క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి కట్టేయాలి.
* ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకుంటే గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కి దూరంగా ఉండాలి.
* కేవలం రెండు, మూడు స్టాక్స్ లోనే మొత్తం డబ్బులు పెట్టకూడదు.
* త్వరగా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కువకాలం హోల్డ్ చేయాలి.
QUICK TIPS…
* మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ లో మన సమయాన్ని, డబ్బును వృథా చేయకూడదు.
* మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను తరచూ మార్చకూడదు.
* మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువులను వెంటనే కొనకూడదు. కొత్త వస్తువులకి రేటు ఎక్కువగా ఉంటుంది.
* మన ఫైనాన్షియల్ కి సంబంధించిన రికార్డు లను జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకోవాలి.
* ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేసేముందు దానిని క్షుణ్ణంగా చదవాలి. నిబంధనలు తెలుసుకోవాలి.
* మనం ఎవరికైనా ఎక్కువ డబ్బులు ఇచ్చినపుడు రాతపూర్వకంగా చూసుకోవాలి.
Leave a Reply