
మన నిత్య జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం. ప్రతి సందర్భంలోనూ, ప్రతి పనికీ ముందు చాలా ఆలోచించి, ఎంతో మందితో చర్చించి ఫైనల్‌గా ఒక డెసిషన్ కి వస్తాం. అలా తీసుకున్న నిర్ణయాలవల్ల కొన్ని సార్లు లాభపడతాం. కొన్ని సార్లు నష్టపోతాం. కానీ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీస అవగాహన లేకుండా ముందుకు వెళ్తాం. అలాంటి సందర్భాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువ. మరి అలాంటప్పడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఓ సారి చర్చిద్దాం.
జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఆర్థికం ప్రధానమైనది. ఈ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చు. మనం ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులభమైనది కాదు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు డబ్బు కూడా ఎక్కువ కేటాయించవలిసి ఉంటుంది. నిర్ణయం తప్పయితే అంతే మొత్తంలో డబ్బు కోల్పోవలసి వస్తుంది.
పూర్తిగా సిద్ధమవ్వాలి
* చాలామంది ఇతరులు చెప్పిన మాటలతో ఆలోచించకుండా , అవగాహనలేని మార్గాల్లో పెట్టుబడి పెట్టి మోసపోతారు. కాబట్టి ముందుగానే మన నిర్ణయాల వల్ల కలిగే పర్యవసనాలను గుర్తించి వాటికి సిధ్ధంగా ఉండాలి.
* ఏదైనా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మన లక్ష్యాన్ని చిన్న, చిన్న భాగాలుగా విభజించాలి. మనం ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నపుడు, దానిలో చిన్న అంశాన్ని తీసుకొని దానిపై పూర్తిగా అధ్యయనం చెయ్యాలి. ఇలా అధ్యయనం చెయ్యడం వల్ల మనకి ఆ రంగం పై పూర్తి అవగాహన వస్తుంది.
* మనం ఉన్న పరిస్థితిని బట్టి భిన్న కోణంలో చూడగలగాలి. మనకి మంచి ఆలోచనలు వస్తాయి. మనం భిన్న కోణంలో ఆలోచిస్తే, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
how to take a financial decision
ఆశావాదంతో ముందుకు సాగడం చాలా అవసరం. మనం ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటే, అవి సఫలం కాకపోతే వచ్చే పరిణామాలను ముందే ఊహించాలి. దాన్ని ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉండాలి.
* మనమంతా తప్పులు చేస్తాం. కానీ మనలో చాలామంది చేసిన తప్పుల్ని మర్చిపోయి వాటినే మళ్లీ చేస్తుంటారు. అలా జరగకుండా ఉండాలంటే మన తప్పులను మనం గుర్తించి వెంటనే ఒక దగ్గర రాసిపెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడూ చదువుతూ ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవలిసి వచ్చినపుడు వాటిని ఒకసారి చదవాలి. అప్పుడు అది మన మైండ్ లో ఫిక్సయి తిరిగి ఆ తప్పును రిపీట్ చేయకపోవడానికి అవకాశం ఉంటుంది.
what have to include in a financial decision
లెక్క తప్పకూడదు..
* మన గత అనుభవాలను ఎప్పటికప్పడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. లెక్కల విషయంలో పూర్తి అవగాహనతో ఉండాలి. మనకు తెలిసిన చోటే పెట్టుబడి పెట్టాలి.
* ఎక్స్ పర్ట్ తో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వేత్తల సలహాలు మనకు చాలా ఉపయోగపడతాయి.
* మనం ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేటపుడు లెక్క కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం ప్రాక్టికల్ గా ఆలోచించగలిగి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ లో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ సంవత్సరంలో 300 శాతం, 500 శాతం రాబడి వచ్చిందని అంటారు.
అలాగని మనం వెంటనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని అంచనా వేస్తాం. కానీ నిజానికి అలాంటి మల్టీ బ్యాగర్స్ చాలా తక్కువ. వేల కంపెనీలు స్టాక్స్ మార్కెట్లో లిస్టయి ఉండగా, కేవలం రెండు లేదా మూడు కంపెనీలు మాత్రమే అలాంటి రిటర్న్స్ ఇచ్చాయని మనం గుర్తించాలి. కాబట్టి అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని తెలుసుకోవచ్చు.
* మనం మదుపు చేసే స్టాక్స్ లో ఏదైనా 10 శాతం కుంగితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు అలా జరిగిందో మనం తెలుసుకోవాలి. రాజకీయ, అధిక విలువ, ఊహాగానాలు, ఇలాంటి కారణాలు కూడా ఉండవచ్చు. అలా కారణాన్ని గుర్తించగలిగితే మన పెట్టుబడిని కొనసాగించాలా లేదా ఉపసంహరించుకోవాలా తెలిసిపోతుంది.