
how to reduce unnecessary expenses
`నీకు అవసరం లేనివి కొనుక్కుంటూ పోతే తరువాత నీకు అవసరం అయినవాటిని అమ్ముకోవాల్సి వస్తుంది.`
– వారెన్ బఫెట్
చదవాడినికి సింపుల్ గా ఉన్నా ఆచరించడానికి చాలా కష్టమైన పని ఇది. కంటికి నచ్చిన వాటిని, ఇష్టమైన వాటిని ఎప్పటికప్పుడు కొనేస్తుంటాం. ఆ సమయానికి డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే నచ్చింది తీసుకుంటాం. కొద్ది కాలం అయ్యాక ఆ వస్తువు చూసి అనవసరంగా కొనేశాం. దీనికోసం ఇంత డబ్బును దండగ చేశాం అని అనుకుంటుంటాం. ఇది అందిరికీ అనుభవమే. ఇలా అనుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ వస్తువు మనకు అంత అవసరం లేదనే అర్థం. ఇలా ప్రతి సారి మనసును అదుపులో పెట్టుకోలేకపోవడం వల్లే కలిగే అనర్థం ఇది. నేటి ప్రపంచంలో, ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని ఖర్చులు తప్పనిసరి. మన స్థాయికి మంచి ఖర్చు పెట్టడంలో వెనుకాడడంలేదు. దీనికి అప్పులు చేయడం కూడా సర్వసాధారణం అయిపోయింది. తరువాత ఈ అప్పులు తీర్చడానికి చాలా కష్టపడాలి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ చిన్న జాగ్రత్తలు తసుకుంటే చాలు.
what to think before buy any thing
ప్రతి వస్తువును కొనేట్టప్పుడు మనం ఈ విషయాలను ఆలోచించాలి
— ఎందుకు
— ఎప్పుడు
— ఎంతకు
— ఎలాంటిది..?* ఒక వస్తువు మనకు ఎందుకు కావాలి. నిజంగా అవసరమా లేదా..? దానితో మనకు ఉపమోగం ఏమిటి..? ఈ ప్రశ్నలన్నింటికీ మనకు సంతృప్తి కరమైన సమాధానం దొరికితేనే ఆ వస్తువును కొనుక్కోవాలి. లేదంటే ఆ ఆలోచన విరమించుకోవాలి.
* ఒక వస్తువును తీసుకునేటప్పుడు అది ఎప్పటికి అవసరం.. తరువాత ఎప్పుడైనా తీసుకోవచ్చా..? కొద్ది కాలం వాయిదా వేసే అవకాశం ఉందా లేదా అని ఆలోచించాలి.how to find the real value of a thing
* వస్తువు కొనే ముందు దాని ఖరీదు ఎంతో చూడాలి. ఆ వస్తువును ఎంత పెట్టి కొనవచ్చు.. ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది అని తెలుసుకోవాలి. ఆ వస్తువును అంత ధరకు పెట్టి కొనడం అవసరమా.. తక్కువ ధర వస్తువుతోనైనా సరిపెట్టుకోవచ్చా..? మనకు దాంతో అంత ఉపయోగం ఉంటుందా..? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
* తీసుకునే వస్తువు నాణ్యమైనదా కాదా తెలుసుకోవాలి. దాని నాణ్యతపై బాగా అధ్యయం చేయాలి. తెలిసిన వాళ్లు, నిపుణులతో మాట్లాడి మంచి వస్తువు ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకునే ప్రయత్నం చేయాలి.ఇవన్నీ ఆలోచిస్తే ఏ పని చేయలేం అనే వాళ్ల గురించి వదిలేద్దాం. ఏ పనైనా పక్కాగా, పద్ధతిగా, ప్లానింగ్ తో చేయాలనుకునేవారు తప్పనిసరిగా పై విషయాలను పరిశీలించి అప్పుడే ఏ వస్తువునైనా కొనేందుకు ముందుకు రావాలి. ఇది పిసినారితనమో.. మరేదో కాదు.. కేవలం జాగ్రత్త పడడమే. ఖర్చులను మన అదుపులో ఉంచుకోవడానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే సరి.
నిజమే.. నేను బయట షాపింగ్బీ కి వెళితే ఇష్టం వున్నవి కొనేస్తా.. అలా బీరువా నిండా బట్టలు పోగు పడ్డాయి.. వాటిలో కొన్నే వేస్కుంటా
ఈ సారి ఇలా చేయండి.. ఆదా అవుతుంది.