ఆకలి కేకలు @ శ్రీలంక
why srilanka people striving for food
శ్రీలంకను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్థిక ఇబ్బందులు, ఆహార ఇబ్బందులు. ఎక్కడ చూసినా నిత్యావసరాల కోసం కిలోమీటర్ల లైన్లు కనిపిస్తున్నాయి. రోజురోజుకి అక్కడ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. శ్రీలంకలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఏమిటి ?
ఇక్కడ నిత్యవసర ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. ఏం..? ఓ సారి చూద్దాం..
కరోనా శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎక్కడచూసిన ఆకలికేకలు వినిపిస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఆ దేశ అధ్యక్షుడు ఆహార అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయినా పరిస్థితి మారలేదు. నిత్యవసర సరుకుల ధరలు రెండింతలు ఎక్కువయ్యాయి. ఇక్కడ పంచదార ధర ఏకంగా రూ. 200 అయింది. రానున్న రోజుల్లో దీని ధరలు పెరిగిన నిత్యవసర సరుకులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. నిత్యవసర సరుకులు నిల్వచేస్తే వారిపై కఠినంగా జరిమానాలు విధించారు. అయిన కొందరు నిత్యవసర సరుకులు బయటకు రాకుండా చేశారు. దిగుమతి పన్ను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం, పంచదార సహా నిత్యవసర సరుకులు అమ్మాలని ఆదేశించిన ధరలు మాత్రం సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి.
కరోనాతో మరింత కష్టం..
కరోనా నియంత్రణకు కొనసాగిస్తున్న కర్ప్యూ ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. కరోనా కారణంగా వడ్డీ రేట్లను పెంచిన ఏకైక ఆసియా దేశంగా శ్రీలంక నిలిచింది. గత నెల 29 బిలియన్ల శ్రీలంక రూపాయలను ప్రభుత్వం ప్రింట్ చేసింది. ఈ ప్రభావంతో భవిష్యత్తులో ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా అక్కడ పర్యాటక రంగాన్ని దెబ్బతీసింది. శ్రీలంకకు విదేశీ మారక ద్రవ్య నిల్వల పరంగా అత్యంత ప్రధానమైనది పర్యాటకరంగం. ఆ దేశం జీడీపీలో 5 శాతం వాటా ఈ రంగానిదే. అయితే 2019 జరిగిన ఆత్మాహుతి దాడిలో 250 మంది మృతి చెందారు. అప్పటి నుంచి విదేశీ రాకపోకలు తగ్గాయి. కరోనా మరోసారి శ్రీలంకను దెబ్బతీసింది. దీనితో విదేశీ మారక ద్రవ్యాలపై ప్రభావం పడింది. 2019లో 7.5 బిలియన్ల డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ ఏడాది జూలై నాటికి 2.8 బిలియన్ల డాలర్లు పడిపోయింది. ప్రపంచ బ్యాంకుల లెక్కల ప్రకారం శ్రీలంక ఒక్కటే దక్షిణాసియా నుంచి అప్పర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ లో చోటుచేసుకుంది. ఒక్క ఏడాదిలో శ్రీలంక కరోనా ప్రభావంతో పూర్తిగా చితికిపోయింది. కరోనా మొదటి వేవ్ ను బాగానే నియంత్రించింది. కానీ రెండు, మూడో వేవ్ లను నియంత్రించలేకపోయింది. అప్పటి నుంచి శ్రీలంక కష్టాలు మరిన్ని ఎక్కువయ్యాయి.
what is government mistake in srilanka
ప్రభుత్వ స్వయంకృతాపరాధమే..
ఏడాదికి 400 డాలర్లు మిలియన్లు డాలర్లు పొదుపు చేయాలనే ఉద్దేశంతో గత ఏప్రిల్ నుంచి పంటల సాగులో రసాయనాలను వాడడం పూర్తిగా నిషేధించింది. వీటి స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని రైతులను ప్రోత్సహించింది. అప్పుడు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా శ్రీలంక ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళింది. చివరకు అదే ఆహార సంక్షోభానికి దారితీసింది.
ఏటా 300 మిలియన్ల కేజీల తేయాకు ఉత్పత్తి జరిగితే అది కాస్త సగానికి పడిపోయింది. ఎగుమతుల పరంగా శ్రీలంక వార్షిక ఆదాయంలో టీ ఉత్పత్తి 10 శాతం. దీనికి తోడు ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిల్వలన్ని మాయమయ్యాయి. ఇది ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యింది. ఈ ఏడాది అమెరిక డాలర్లతో పోల్చితే శ్రీలంక కరెన్సీ 7.5 శాతానికి పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సరుకులు అమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే డిమాండ్ కు సరిపడా సరఫరా లేదు. ఇక్కడ వ్యాపారులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బియ్యం, చక్కెర ఇతర నిత్యవసర సరుకుల సరఫరాను సమీక్షించేందుకు ఒక ఆర్మీ ఆఫీసర్ ను కమిషనర్ గా అక్కడ ప్రభుత్వం నియమించింది. గతంలో పామాయిల్ ఉత్పత్తిని నిషేధించి వాటి స్థానంలో రబ్బరు, ఇతర పర్యావరణ మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పామాయిల్ కి మంచి ధర ఉంది. కానీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితి ప్రపంచ దేశాలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఒక గుణపాఠమే.
Leave a Reply