
why indian steel get demand
విపత్తులు వినాశనంతో పాటు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆ దేశాలపై ముడిసరుకుల కోసం ఆధారపడిన ప్రపంచం ఇప్పడు ప్రత్యామ్నయం వైపు చూస్తోంది. ఇందులో ప్రధానంగా ఉక్కు కు డిమాండ్ ఏర్పడింది. ఐరోపా దేశాలకు ప్రధాన ఉక్కు సరఫరా దారు రష్యా-ఉక్రెయిన్ దేశాలే. ఇప్పడు యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ఉక్కుకు ప్రత్యామ్నయంగా ఇండియా వైపు చూస్తోంది ఐరోపా. భారతదేశం ప్రపంచంలోనే ఉక్కు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఇండియా ఉక్కుకు డిమాండ్ ఏర్పడింది.
what are the highest steel export countries
ఎగుమతి పరంగా మాత్రం మన దేశ వాటా చాలా తక్కువ. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఎక్కువగా ఉక్కును ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటంతో ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జేఎస్ పీఎల్) తెలిపిన వివరాల ప్రకారం.. సరఫరా అంతరాయం వల్ల గత నెలలో ఉక్కు ధరలు 20 శాతానికి పెరగడంతో ఐరోపా, మధ్యప్రాచ్య, ఆఫ్రికా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉక్కు కొరత ఉంది. ఆ సరఫరాను భారతదేశం, పాక్షికంగా చైనా పూడ్చుతుంది.
రష్యా- ఉక్రెయిన్ కలిపి ఏడాదికి 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తాయని బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా ఒక్కటే యూరప్ కు 14-15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తోంది. బెంచ్ మార్క్ ధర మార్కెట్ లో ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ టన్నుకు 947 డాలర్లు ఉండేది. కానీ, మార్చిలో ఆ ధర టన్నుకు 1205 డాలర్లకు చేరుకుంది…
యూరప్ లోని చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది.
steel exports from india
ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ టన్నుకు దాదాపు 1000 డాలర్ల రేటుతో ఉక్కును ఎగుమతి చేస్తోంది. గత సంవత్సరం ఉక్కు, ఇనుప ఖనిజం ఎగుమతుల్లో మన దేశం దాదాపు మూడో వంతు ఐరోపా దేశాలకు ఎగుమతి చేసింది. ప్రధానంగా ఇటలీ, బెల్జియం, నేపాల్ వియంత్నాంలకు భారతదేశం 2021 లో 20.63 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. ఉక్కు సరఫరా కొరతను తీర్చడానికి భారతీయ ఉక్కు తయారీదారులు ఐరోపాకు రవాణాను పెంచాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన సరఫరా కొరతతో ప్రస్తుతం దేశీయ అమ్మకాలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.