
ధనం మూలం ఇదం జగత్.. ఇది మనందరికీ తెలిసిన ప్రపంచ సత్యం. డబ్బులోనే, డబ్బు చుట్టూనే, డబ్బుతోనే ఈ లోకం నడుస్తోంది. సర్వమానవాళి మనుగడకు, నిత్యం బతకడానికి మనీ చాలా అవసరం. ఎవరెన్ని చెప్పినా, ఎంత వేదాంతం వల్లబోసినా డబ్బు లేకుండా బతుకు దారుణమే.. కానీ ఈ రోజుల్లో అందరికీ సరిపడినంత డబ్బు సమకూరడం లేదు. చేసే ఒక ఉద్యోగంతో వచ్చే ఆదాయం ఖర్చులకే పోతోంది. మరి భవిష్యత్తు కోసం దాచుకుందామంటే అంతా శూన్యమే. మరి ఎలా …? తప్పకుండా రెండో ఆదాయమార్గానికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఈ టెక్నాలజీ యుగంలో ప్రపంచమంతా మన చేతిలోకే వచ్చేసింది. ఎక్కడినుంచైనా మనం ఏ పనైనా చేసుకోవచ్చు. అవకాశాలు విస్తృతం అయ్యాయి. సమాచారం అంతా క్షణాల్లో మనకు అందిపోతోంది. మరి ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జీవితంలో చాలా కోల్పోయినట్టే. మరి అలాంటి అవకాశాలను కొన్నింటిని మనం తెలుసుకుందాం.
what are the most credible second income sources
మనం చేసే ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు మనం ఇంటిలోనుంచే ఆదాయం సంపాదించగలిగే ఒకట్రెండు మార్గాలను తప్పకుండా పెట్టుకోవాలి. అప్పుడే ఎంతో కొంత డబ్బు సమకూరుతుంది. ఇప్పడు మొబైల్ ఫోన్ అందరిచేతిలోనూ ఉంటుంది కనుక దీనిని ఉపయోగించుకునే చేయాల్సిన పనులను ఇక్కడ చర్చిద్దాం.
what is network marketing
నెట్‌వర్క్ మార్కెటింగ్
ఇది మనందరికీ సుపరిచితమే. మన ఊర్లలో ఎవరో ఒకరు ఇలాంటివి చేసి ఉన్నవారే. ఈ టెక్నాలజీ యుగంలో మనం పూర్తి సమాచారం తెలుసుకుని మనకు ఉన్న ఫ్రెండ్స్, బంధువులు, కొలీగ్స్.. ఇలా తెలిసిన వారందికీ చెప్తూ ప్రొడక్ట్‌ను విక్రయించాల్సి ఉంటుంది. ఇది ఒక్కరోజులో జరిగేది కాకపోయినా కొద్ది రోజులు పనిచేశాక తప్పకుండా మనం ఆదాయాన్ని ఆర్జించగలుగుతాం. ఉదా: ఏమ్వే, విస్టీజ్, హెర్బాలైఫ్, ఫరెవర్….
* హోం మేడ్ ఫుడ్ సెల్లింగ్ ఇంట్లో ఉండి మన సరదాగా చేసుకునే చిరుతిళ్లను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్లు తాము బాగా చేయగలిగే వంట పదార్థాలను తయారు చేసి ఇంటికి దగ్గర్లో ఉన్న దుకాణాలలో ఇచ్చి అమ్ముకోవచ్చు. లేదా తెలిసిన వారికి ఆర్డర్ల ద్వారా ఇవ్వవచ్చు. వినడానికి సిల్లీగా ఉన్నా చాలా సులభంగా ఆదాయం సంపాదించే మార్గం ఇది. అందరికీ సాధ్యమవుతుంది. పెట్టుబడి ఉండదు.
* స్టాక్ మార్కెట్ కొంచెం కష్టమే అయినా దీర్ఘకాలానికి లాభాలను పొందే రిస్కీ మార్గమిది. ఇంట్లో ఉంటూ రోజుకు కొంత సమయం కేటాయిస్తూ బాగా నేర్చుకుని, ప్రాక్టీస్ చేస్తే మరీ ఆశ, కక్కుర్తి పడకుండా ఉంటే సంపాదన సాధ్యమే. చదువుకున్న గృహిణులు, ఇంటి పట్టునే పనిచేసే వారు దీనిని సెకండ్ ఇన్‌కంగా అభివృద్ధి చేసుకోవచ్చు.
* యూట్యూబ్, వెబ్‌సైట్ నేటి యూత్‌లో క్రేజీఎస్ట్ ప్రొఫెషన్ ఇది. యూట్యూబర్‌గా రాణించాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇందులోనూ చాలా మంచి ఆదాయం వస్తుంది. ఖర్చు, పెట్టుబడి లేకుండా, మొబైల్ ఫోన్ ఉన్నవారెవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయవచ్చు. హాబీలు, సరదాలు, వంటలు, చిట్కాలు.. ఇలా మనకు నచ్చిన, వచ్చిన విషయాలపై వీడియోలు చేస్తూ సంతృప్తి పొందవచ్చు. మీ మొఖం కనిపించడం ఇష్టం లేకపోతే పాడ్‌కేస్ట్ లాంటి (కేవలం వాయిస్ వినిపిస్తుంది) వీడియోలు చేస్తూ నడిపించవచ్చు. మీకు రాయడం అలవాటు ఉంటే కొన్ని సబ్జెక్ట్ విషయాలపై ఆర్టికల్స్ రాస్తూ వెబ్‌సైట్ లేదా బ్లాగ్ లో పెట్టవచ్చు. మీ సైట్‌లో యాడ్స్ వస్తే మీకు ఆదాయం వస్తుంది.
what is affiliate marketing
ఎఫిలియేట్ మార్కెటింగ్
వివిధ బ్రాండ్‌లకు చెందిన ఏవైనా వస్తువులను మన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై అమ్మడం. ఇలా అమ్మే వస్తువులను ఎవరైనా మన సైట్‌నుంచి కొంటే మనకు కొంత కమీషన్ వస్తుంది. టెక్నాలజీపై కొంచెం అవగాహన ఉన్నవారు దీనిని పరిశీలించవచ్చు. ఉదా: ఆమేజాన్ ఎఫిలియేట్ ప్రోగ్రాం
* రిఫరల్ లింక్స్ ఏదైనా మొబైల్ యాప్, బిజినెస్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన సైట్ లింక్‌లను మన ఫ్రెండ్స్, లేదా బంధువులకు పంపించి వారు కూడా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చేస్తే రిఫరల్ కమిషన్ మన అకౌంట్‌లో జమ అవుతుంది. ఇది వరకూ మనకు బాగా తెలిసిన వాటిలో గూగుల్ పే, ఫోన్‌పే ఇలా రిఫరల్స్ ద్వారానే ప్రాచుర్యం పొందాయి. ఇప్పడు ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. డీ మ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తే ఆ కంపెనీలు ప్రతి రిఫరల్‌కు కొంత మొత్తం కమిషన్ ఇస్తాయి. ఉదా: అప్‌స్టాక్స్, ఐసీఐసీఐ డైరెక్ట్, జిరోదా వంటి బ్రోకరేజీ సంస్థలు, మీషో యాప్…
* రియల్ఎస్టేట్ ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన వెంచర్లు, ఫ్లాట్‌ల వివరాలను, ఫొటోలను మన మొబైల్లో ఉన్న గ్రూప్‌లకు పంపించడం ద్వారా కమిషన్ వస్తుంది. వాట్సాప్ స్టేటస్‌లు, బ్రాడ్‌కాస్ట్ వంటి సదుపాయాలను ఉపయోగించి వివరాలను అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్, బంధువులు ఎవరైనా ఆసక్తి ఉండి మిమ్మల్ని సంప్రదించి మీ ద్వారా ఫ్లాట్లను కొనుగోలు చేస్తే మీకు మంచి కమిషన్ వస్తుంది. ఇది కొంచెం కష్టమే అయినప్పటికీ ఎక్కువ మొత్తంలో కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క ఫ్లాట్ అమ్మినా మీరు టార్గెట్ రీచ్ అవ్వవచ్చు. ఇవన్నీ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. పైన చెప్పిన ఆదాయ మార్గాలన్నీ ఓపిక సహనం ఉన్నవారు, ఆదాయం కోసం వేచి చూడగలిగేవారు మాత్రమే ప్రయత్నిస్తే మంచిది. క్షణాల్లో కోట్లు సంపాదించాలనుకునే వారెవరూ ఇలాంటి వాటిని ఎంచుకోవద్దు.