
how to become rich slowly
డబ్బు సంపాదించడానికి ఓపిక, సహనం ఎంత అవసరమో వారన్ బఫెట్‌ను చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతని ప్రస్తుత సంపాదనలో 20 శాతం సంపాదించడానికి 50 సంవత్సరాలు పట్టింది. బఫెట్ నమ్మే ఒక సిద్ధాంతం `నెమ్మదిగా, స్థిరంగా మాత్రమే ధనవంతులం కాగలం`.
patience make you rich
ప్రపంచ ధనవంతుల్లో వారెన్ బఫెట్ ఒకరు. 1930 ఆగష్టు 30న యునైటెడ్ స్టేట్స్‌లోని ఒమాహాలో పుట్టిన బఫెట్‌కి చిన్నప్పటి నుంచి వ్యాపారాలు చేయాలని, అప్పులు చేయకుండానే కంపెనీలు పెట్టాలని ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ చేతిలో పెద్దగా డబ్బు ఉండేది కాదు. కానీ తనకు తెలిసిన స్నేహితులతో 100 డాలర్లతో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు.
how warren buffet make money
కొంచెం తెలివి ఉంటే అప్పు లేకుండా లాభాలు సంపాదించవచ్చు అనేది వారన్ బఫెట్ మాట. అతనికి 17 ఏళ్ళు వచ్చే నాటికి 50,000 డాలర్ల సంపాదించాడు. తన దగ్గరున్న డాలర్లతో పాటు ఇంటిదగ్గర ఉన్న కొంత డబ్బుతో దివాలా స్థితిలో ఉన్న బెర్క్ షైర్ హాత్వే కంపెనీకి చెందిన షేర్లు కొన్నాడు. ఏడాదిలోపే మేనేజ్మెంట్ ను మార్చి మొత్తం కంపెనీని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. భూమ్ ఎక్కడ ఉంది?, విజయవంతమైన కంపెనీలు ఎలా ఉన్నాయి ? అని కొంచెం ఆలోచించి ఉంటే బాగుంటుందని ప్రతి ఇంటర్వ్యూలో అంటారాయన. ఆ క్రమంలోనే జీకో ఇన్సురెన్స్ కంపెనీ స్థాపించారు. పనికిరాని కంపెనీలు షేర్లు కొని వాటిని బంగారంగా మార్చడం ఈయన కంపెనీ తర్వాతే ఎవరైనా… అందుకే షేర్లు ధర తక్కువగా ఉన్నప్పుడే తొందరపడాలి, లాంగ్ టెర్మ్ ప్లాన్ చేసుకోవాలి అని అంటారాయన.
భవిష్యత్తులో ఏ కంపెనీ ఎలా ఉండబోతుంది? జనాలకు ఏది ముఖ్యం అనే చిన్న ఆలోచన ఉంటే చాలు. రూపాయితో కొన్ని కోట్లు సంపాదించవచ్చు అనేది ఆయన మాస్టర్ ప్లాన్. అందుకే ఈయన ఇంట్లో కూర్చుంటే చాలు, ఈయన వాటా కింద సంవత్సరానికి 5 లక్షల కోట్లు వస్తుంది. ఆయన పెట్టుబడి పెట్టిన ముఖ్యమైన కంపెనీలు IBM, CITI GROUP, GENERAL MOTORS, COCA-COLA, GRAHAM HOLDINGS, GILLETTE. ఇంత సంపాదించినా వారెన్ బఫెట్ ఏమి చదువుకున్నాడంటే.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పీజి చేశారు. డబ్బును ఎప్పుడూ గౌరవించాలనేది అతని మొదటి సూక్తి. డబ్బును ఎప్పుడూ కోల్పోయే స్థితికి రాకూడదని ఆయన మొదటి సిద్ధాంతం. నిజాయితీ అనేది చాలా ఖరీదైనది, అది చిన్న తరహా వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకోకూడదనేది ఆయన మాట. ఇంత సంపాదించినా ఆయన తన యాబై ఏళ్ళగా ఒకే ఇంటిలోనే నివసిస్తారు. ప్రతిరోజూ తను ఒక పుస్తకమైనా చదవకుండా నిద్రపోరు.
Nice article
tq sir