తక్షణ ఆర్థిక అవసరాల కోసం Personal Loan సౌకర్యంగా అందుతుంది. అయతే రుణం తీసుకోవడానికి సరైన సమయం, అవసరం, repayment సామర్థ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తప్పుగా రుణం తీసుకుంటే ఆర్థిక ఒత్తిడి, వడ్డీ భారం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో, EMI manageable, క్రెడిట్ స్కోరు సరి ఉంటే మాత్రమే Personal Loan తీసుకోవడం మేలు.
ఎప్పుడు Personal Loan తీసుకోవాలి
When Should You Take a Personal Loan
వైద్య ఖర్చులు, పెద్ద ఫ్యామిలీ ఇమెర్జెన్సీ, అత్యవసర ఇంటి మరమ్మత్తులు వంటి పరిస్థితుల్లో Personal Loan తీసుకోవచ్చు. సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి ఈ లోన్ తీసుకోకూడదు. రొజువారీ ఖర్చులు, చిన్న కొనుగోలు, లగ్జరీ ఐటెమ్స్ కోసం Personal Loan తీసుకోరాదు. ఇది unnecessary financial burden కలిగిస్తుంది. రుణం తీసుకునే ముందు మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు, ఇతర రుణాల EMI లను పరిశీలించాలి. EMI manageable గా ఉంటే మాత్రమే Personal Loan తీసుకోవాలి. తక్కువ వడ్డీ రేట్లలో Special Offers లేదా బ్యాంకుల Schemes లభించే సమయంలో Personal Loan తీసుకోవడం లాభదాయకం. CIBIL / Credit Score 750+ ఉంటే approvals, తక్కువ వడ్డీ, సులభ repayment లభిస్తాయి.
Tips for taking personal loan
– EMI మిస్ కాకుండా Auto-debit Facility ఉపయోగించండి. అవసరమైతే, Prepayment లేదా Loan Restructuring Facility గురించి బ్యాంక్‌తో సంప్రదించండి. స్తోమతకు మించిన రుణం తీసుకోవద్దు. EMI సమయానికి చెల్లించకపోతే, బ్యాంకులు అదనపు లేటు ఫీజులు వసూలు చేస్తాయి. ఫలితంగా రుణ మొత్తం పెరుగుతుంది. CIBIL / క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. EMI ఆలస్యమైతే, క్రెడిట్ స్కోరు నష్టపోతుంది.
రుణం తిరిగి పొందడం, క్రెడిట్ కార్డు పొందడం కష్టం అవుతుంది. ఫ్లోటింగ్ రేట్ లో EMI ఆలస్యమైతే, మొత్తం వడ్డీ పెరుగుతుంది. EMI మిస్ అవడం వల్ల Salary Deduction, Asset Seizure, Legal Notices వచ్చే అవకాశం ఉంది.
– పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు , NBFCsపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 10%–24% మధ్య వడ్డీరేట్లు ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్ల పై లోన్ ఎంచుకోవడం మేలు. ఎందుకంటే EMI తగ్గుతుంది. EMI ని ప్రతినెలా లేదా మూడునెలలు, ఆరునెలల వ్యవధిలో చెల్లించొచ్చు. రుణ వ్యవధి ఎక్కువగా ఉంటే EMI తక్కువ అవుతుంది . కానీ మొత్తం వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు installments ముందే చెల్లించే అవకాశం ఉందా అని పరిశీలించాలి. Prepayment Facility ఉంటే, వడ్డీ ఖర్చు తగ్గుతుంది.
రుణాలిచ్చే బ్యాంకులు..Banks That Provide Loans
– SBI (State Bank of India), PNB, Canara Bank, Union Bank of India, HDFC Bank, ICICI Bank, Axis Bank లు సౌకర్యంగా , వేగవంతంగా తక్కువ వడ్డీరేట్లకే పర్సనల్ లోన్స్ ఇస్తాయి. Online Application, Flexible EMI Options, Prepayment Facility కూడా ఉన్నాయి.
– Bajaj Finance, Mahindra Finance, Fullerton India వంటివి కూడా Personal Loans, Business Loans అందిస్తున్నాయి. వాటిల్లో వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ approvals తక్షణమే వస్తాయి.
– స్థానిక రుణ అవసరాలకు Co-operative Banks, Small Finance Banks ఉపయోగపడతాయి. చిన్న మొత్తాల Personal Loan, Quick Loan Options అందిస్తాయి. రుణం తీసుకునే ముందు రుణదాతను సరిగా ఎంచుకోవడం ముఖ్యం. వడ్డీ రేట్లు, Processing Charges, Repayment Options, Customer Support వంటి అంశాలు పరిశీలించాలి. సరైన రుణదాతను ఎంచుకోవడం వల్ల EMI manageable, repayment సులభం అవుతుంది.
ప్రాసెసింగ్ ఫీజు (Processing Fee)
రుణం పొందే సమయంలో బ్యాంకులు లేదా NBFCలు Collection చేసే ఫీజును Processing Fee అంటారు. మొత్తం Loan Amountపై సాధారణంగా 0.5% – 2% వరకూ Processing Fee ఉంటుంది.
హిడెన్ ఛార్జీలు (Hidden Charges)
EMI సకాలంలో చెల్లించకపోతే Hidden Charges వర్తిస్తాయి. రుణాన్ని ముందే చెల్లిస్తే కొంత చార్జ్ (Foreclosure / Prepayment Charges) వసూలు చేస్తారు. ఇక Documentation / Administrative Fees అనేవి రుణ Processing సమయంలో అదనంగా ఉంటాయి. ఇవన్నీ Loan Agreement fine print లో ఉంటాయి. Floating Rate – RBI / Market మార్పులకు అనుగుణంగా EMI మారుతుంది. వడ్డీ రేట్లలో తేడా 8%–24% వరకు ఉంటుంది. రుణదాత, రుణ రకం ఆధారంగా ఇవి మారుతాయి.
స్తోమతకు మించి రుణం తీసుకోవద్దు
Do Not Borrow Beyond Your Means
పర్సనల్ లోన్లు తీసుకోవడం సులభం అయినప్పటికీ, అవగాహన లేకపోతే ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా లోన్ మొత్తాన్ని స్తోమత (మూలధనం)కు మించి తీసుకోవడం లేదా EMIని సకాలంలో చెల్లించకపోవడం ప్రమాదకరంగా మారుతుంది. స్థోమతకు మించి రుణం తీసుకోవడం, సకాలంలో తిరిగి చెల్లించకపోవడం రెండు రకాల ప్రమాదాలకు దారితీస్తాయి . ఆర్థిక భారం పెరగడం, క్రెడిట్ స్కోరు దెబ్బతినడం. అందుకే, సావధానంగా రుణాన్ని ప్లాన్ చేసి, సకాలంలో repayment నిర్వహించడం అత్యవసరం. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు స్తోమతను బాగా అంచనా వేయాలి.EMI మీ ఆదాయానికి అనుగుణంగా ఉండేలా ప్లాన్ చేయాలి. సకాలంలో repayment కోసం auto-debit facility ఉపయోగించాలి. Payment delay పరిస్థితిలో బ్యాంక్‌తో సంప్రదించి restructuring, part-payment options తీసుకోవచ్చు
Personal Loan కోసం అర్హతలు
Eligibility for Personal Loan
Personal Loan పొందడానికి వయసు, ఆదాయం, క్రెడిట్ స్కోరు, ఉద్యోగ స్థిరత్వం వంటి అర్హతలు ఉండాలి. Aadhaar, PAN, Salary slips, Bank statements, Address proofs , Passport, Voter ID, Driving License వంటి ధృవపత్రాలు పూర్తిగా సిద్ధం చేయడం అవసరం. ఇవి లేకపోతే Loan approval ఆలస్యం అవుతుంది లేదా రద్దు కావచ్చు.
వయసు పరిమితి..Age Limit
సాధారణంగా 21–60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు Personal Loan కోసం అర్హులు. కొన్ని బ్యాంకులు వయసు 65 వరకు అనుమతిస్తాయి.
ఆదాయ స్థాయి..Income Level
నెలవారీ స్థిర ఆదాయం ఉన్నవారే Personal Loan కోసం అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, Self-employed వ్యక్తులు Loan పొందవచ్చు. CIBIL / Credit Score 750+ ఉంటే Personal Loan approval కోసం అవకాశం ఎక్కువ. క్రెడిట్ రికార్డ్ గడచిన రుణాల History చెక్ అవుతుంది. Loan మొత్తం మీ ఆదాయానికి అనుగుణంగా నిర్ణయించబడుతుంది. సాధారణంగా Salary 3–4 times EMI coverable amount తీసుకోగలరు.
ఆదాయ ఆధారాలు.. Proof of Income
Salary slips (తక్కువలో మూడు నెలల)
Bank Statements (తక్కువలో 6 నెలలు)
Income Tax Returns (Self-employed లేదా Freelancers కోసం)
ఇతర డాక్యుమెంట్స్..Other Documents
Photograph, Signature proof, Employer Certificate (ఉద్యోగుల కోసం)
Self-employed కోసం Business Registration, Balance Sheet, Profit & Loss Statement.
