
what are guaranteed income plans
మన దీర్ఘకాల లక్ష్యాలను సాధించుకునేందుకు సరైన ప్రణాళికలు, పథకాలు అవసరం. క్రమం తప్పకుండా మంచి వాటిని వెతకడం, ఉన్నవాటిని పరిశీలిస్తూ సమీక్షించుకోవడం తప్పనిసరి. ఉన్న ఆర్థిక ప్రణాళికలో మార్పులు చేయాల్సి వస్తే వెనుకాడకూడదు. కాలానుగుణంగా వచ్చే మార్పలు, పెరిగే ఖర్చులు కొత్త పథకాలను అవసరాన్ని గుర్తు చేస్తాయి. గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్స్‌లో ట్యాక్స్ బెనిఫిట్, ఇన్సూరెన్స్, స్థిర ఆదాయం.. అన్నీ ఉంటాయి.
how to get regular income by guaranteed income plans
అయితే జీవితంలో సురక్షితమైన రాబడి, బీమా, ఆర్థిక వృద్ధి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి. అలాంటి పథకాలను ఎంచుకోవాలి. ఇలాంటి వాటికి సరైన ఆప్షన్ `గ్యారంటీడ్ ఇన్కం స్కీం`. జీవిత బీమా రక్షణతో పాటు, వ్యవధి తీరాక ఎంత మొత్తం వస్తుంది అనే హామీ ఇక్కడ ఉంటుంది.
ఇవి రాబడికి హామీ ఇస్తాయి. అన్ని రకాల నష్టభయాలకూ ఇవి పరిష్కారం చూపిస్తాయి. నష్టభయం ఏ మాత్రం భరించలేని వారు.. పాలసీ కొనసాగుతున్నన్ని రోజులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పని చెల్లింపులు, వ్యవధి పూర్తయ్యాక ప్రీమియాలను వెనక్కి ఇచ్చే తరహా పాలసీలను ఎంచుకోవచ్చు. కాస్త నష్టభయం భరించేవారు.. పెట్టుబడుల జాబితాలో నష్టభయం ఉండే పథకాలతోపాటు, రాబడి హామీ పథకాలను కలిపి ఎంచుకోవాలి.
* పదవీ విరమణ తర్వాత ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి, ఉద్యోగంలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. మీ ప్రాథమిక ఆదాయానికి ఇవి తోడుగా ఉండి కుటుంబ అవసరాలను తీరుస్తాయని చెప్పొచ్చు. ఫలితంగా మీ పై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
how to choose regular income plans
* మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, మీ అవసరాలు తీర్చే విధంగా ఈ పాలసీలను తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి, చెల్లింపులు ఎలా చేస్తారు అనే దగ్గర్నుంచి, బీమా సంస్థలు తిరిగి చెల్లించేటప్పుడు ఏ విధంగా ఆదాయం అందుకోవాలి అనే వరకూ అన్నీ మీ ఇష్టానుసారమే ఎంచుకోవచ్చు.కొన్నాళ్ళ తర్వాతే ఆదాయం వచ్చేలా పాలసీలో మార్పు చేసుకోవచ్చు. దీనివల్ల అవసరాలు ఉన్నప్పుడే ఆదాయం అందుకోవచ్చు.
* రాబడి హామీ పథకాన్ని ఎంచుకున్నప్పుడు మీరు ముందుగా ఎన్నేళ్ళు ప్రీమియం చెల్లించగలరో చూసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటి నుంచి మీకు ఆదాయం రావాలి అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడు పాలసీదారుని వయసు ఆధారంగా ఎంత ఆదాయం, ఎప్పటి నుంచి కావాలి అనేది చూసి, పాలసీ విలువ ఎంత ఉందని అనేది లెక్కిస్తారు.
* ఇప్పడు మనకు వస్తున్న ఆదాయం సరిపోతుంది. కానీ వయసు పెరిగేకొద్దీ ఆదాయం సరిపోదు.. అవసరాలు పెరుగుతాయి. కానీ భవిష్యత్తులో వచ్చే అదనపు ఖర్చులు సంగతి ఏమిటి ? ఆరోగ్య అత్యవసరం ఏర్పడినపుడు వైద్య చికిత్సకు సంబంధించి ఇబ్బందులు ఉండకూడదు కదా.. ఇలాంటి పరిస్థితులు తలెత్తినపుడు రాబడి హామీ పథకాలు ఉపయోగపడతాయి. బీమా రక్షణ ఉండడంతో పాలసీదారుడికి అనుకోనిదేదైనా జరిగితే నామినీ/ కుటుంబ సభ్యులకు పరిహారం అంది, వారి జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు వీలవుతుంది.
* ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. రాబడి హామీ పథకాల విషయానికొస్తే మార్కెట్ తో అనుసంధానమైన హెచ్చు తగ్గులు ఉండవు. పాలసీ ప్రారంభంలోనే రాబడి గురించి హామీ ఉంటుంది. సుదీర్ఘకాలంలో పెట్టుబడులు సురక్షితంగా ఉండాలనుకున్నపుడు రాబడి హామీనిచ్చే బీమా పథకాలను ఎంచుకోవచ్చు. వ్యవధి తీరాక అందుకున్న ప్రయోజనాలకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10 (10డీ) ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.