how much interest on corporate FDs
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లకు వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. బ్యాంకులో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెద్ద ప్రయోజనం లేకపోవడంతో క్రమంగా ఆసక్తి తగ్గి పోయింది. ఈ సమయంలో మదుపరులు ఎక్కవ వడ్డీ రేట్లను ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలవైపు చూస్తున్నారు. ఎన్బీఎఫ్సీలు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రభుత్వ బ్యాంకులు అయితే వంద శాతం సురక్షితం. కానీ ప్రైవేటుగా నడిచే ఎన్బీఎఫ్సీలను ఎంతవరకు నమ్మవచ్చు అనే సందేహం అందరికీ ఉంటుంది. ఇలాంటి కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ కంపెనీలో అయినా డిపాజిట్ చేయాలనుకున్నపుడు కంపెనీ క్రెడిట్ రేటింగ్ లను తెలుసుకోవాలి. కొన్ని ఏజెన్సీల నుంచి ఏఏఏ, ఏఏ రేటింగ్ లను కలిగి ఉన్న కంపెనీలలో డిపాజిట్ చేస్తే మంచిది. ఈ సంస్థలు ఇన్వెస్టర్స్ కి సరైన సమయానికి డిపాజిట్లను తిరిగి చెల్లించే సామర్థ్యం కలిగి ఉంటాయి. మనం డిపాజిట్ చేయాలనుకున్న సంస్థ ఇచ్చే వడ్డీని వివిధ సంస్థల వడ్డీ రేట్లతో పోల్చుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. డిపాజిట్ చేసేటపుడు పూర్తి వివరాలను తెలుసుకోవాలి.
how much income tax on corporate FDs
ఆదాయపు పన్ను తప్పదు..
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులకే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా మనం సంపాదించే వడ్డీపై శ్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను ఉంటుంది. ఎక్కువ రేటింగ్ ఉన్న ఎన్ బీఎఫ్సీలో ఫిక్స్ డిపాజిట్ చేయాలి. అప్పుడు మన పెట్టుబడిపై రిస్క్ తక్కువ ఉంటుంది. సకాలంలో చెల్లింపునకు సంబంధించిన భద్రత బలంగా ఉందని ఏఏ రేటింగ్ తెలుపుతుంది. ఏఏ కన్నా ఎక్కువ రేటు ఉన్న కా ర్పొరేట్ ఎఫ్డీలు కూడా ఉన్నాయి.
వడ్డీ రేటు ఇలా..
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సంస్థ, హెచ్డీఎఫ్సీ సంస్థ, ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్ సంస్థ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 6 శాతం కంటే అధికంగా వడ్డీ శాతాన్ని అందిస్తున్నాయి. ఇందులో సంవత్సరం నుంచి పదేళ్ల వరకు ఎఫ్డీ చేసుకోవచ్చు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ కార్పొరేట్ సంస్థ మాత్రం సుమారు ఏడు శాతం కంటే అధికంగా వడ్డీని ఇస్తుంది.