
why financial planning is important
మనకి రాబోయే అవసరాలను గుర్తించి, వాటిని తీర్చుకునేందుకు ముందస్తుగా మనం తయారు చేసుకునే ఒక ప్రణాళికే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఏదైనా అనుకోని విపత్తు వచ్చినా మనం తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల వస్తుంది. ఏ ఏ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాం, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంతెంత ఖర్చు చేస్తున్నాం.. ఇలా వీటన్నింటినీ సమీక్షించుకుంటూ ఆర్థికంగా అప్రమత్తంగా ఉండడం అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో జరుగుతుంది.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మన ప్యూచర్ కి సెక్యూరిటీ వంటిది. రాబోయే అవసరాలు ఏమున్నాయి? అది ఏ సంవత్సరంలో వస్తుంది? దానికి కావలిసిన కార్పస్ ఎంత..? కార్పస్ ను సెటిల్ చేయడానికి మనకున్న ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ ఏంటి..? మనం దేనిలో ఇన్వెస్ట్ చేయాలి తెలుసుకోవాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కలవాలి.
why should be financial planning will be unique
అందరికీ ఒకేలా ఉండదు..
ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికి ఒకేలా ఉండదు. వారి ఆదాయ మార్గాలు, బాధ్యతలు, అవసరాలు, కుటుంబం, ఆశలను బట్టి ప్లానింగ్ మారిపోతుంది. అంటే అందరికీ ఒకేలా ఉండకపోయానా, అందరికీ సాధ్యమవుతుంది. ప్లానింగ్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరి స్థాయిని బట్టి వారికి ప్లానింగ్ వర్క్ అవుతుంది.. ఇది నిజం!
వీటిపై దృష్టి పెట్టండి
* వచ్చిన డబ్బులను ఎవరూ వృథా చేయరు. దేనిలోనైనా ఇన్వెస్ట్ చేస్తారు. కాని ఎందులో మనండబ్బును సేవ్ చేస్తే మంచి ప్రోఫిట్ వస్తుందో తెలుసుకోవాలి.
* ఇప్పుడు హెల్త్ ఇన్సురెన్స్ ఎందుకు తీసుకుంటున్నాం..? మనకి అంతా బాగుంటే హెల్త్ ఇన్సురెన్స్ అవసరం లేదు. కానీ మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఎటువంటి కష్టం రాకుండా భరోసా నిచ్చేందుకే బీమా తీసుకుంటాం. ఇదీ చాలా అవసరం.
* పిల్లల పై చదువుల కోసం ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. దానికోసం మనం ఎంత డబ్బును ఆదా చేసుకోవాలి, దానిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి వంటివి ఆలోచించాలి.
* పెట్టుబడులు పెట్టడానికి అనేక సాధనాలు ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి . లాభాలను అందించే పథకాలు, రిస్క్ ఉన్నవి, పూర్తి సురక్షితమైనవి ఉన్నాయి. అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే మన అవసరానికి డబ్బులు అందిస్తాయా లేదా తెలుసుకుని ప్రారంభించాలి. మనం ఎంత డబ్బులు పెట్టినా ఎందుకు పెట్టామో ఎంత వస్తుందో తెలియకపోతే మనకి ప్రశాంతత ఉండదు. మనం చేసింది సరైనదో కాదో అర్థంకాదు. అందుకే ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహనతో వ్యవహరించడం చాలా అవసరం. అందుకే తప్పదు..ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాల్సిందే.