Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation

Posted on 19/04/2026 By admin No Comments on అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation

అక్షయ తృతీయ ( Akshaya Tritiya Special) … భారతీయ సంస్కృతిలో అత్యంత శుభప్రదమైన పర్వదినాల్లో ఒకటి. “ఈ రోజున కొన్నది ఎన్నటికీ క్షీణించదు” అన్న నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుందని విశ్వాసం. అందుకే ఈ రోజున వీసమెత్తు బంగారం అయినా కొనాలని ప్రతి కుటుంబం భావిస్తుంది. ఈ ఏడాది కూడా అక్షయ తృతీయ వేళ నగల దుకాణాలు కొత్త డిజైన్లు, ప్రత్యేక ఆఫర్లతో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. గతంలోలా కేవలం ఆభరణాల కోసం కాకుండా, పెట్టుబడి సాధనంగా కూడా బంగారం, వెండి కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, యుద్ధ వాతావరణం, స్టాక్ మార్కెట్ల ఊగిసలాటల నేపథ్యంలో బంగారం–వెండి మళ్లీ ‘సురక్షిత పెట్టుబడి’గా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున ఈ రెండు విలువైన లోహాల్లో పెట్టుబడి ఎలా పెట్టాలి? ఎంత వరకు పెట్టాలి? ఎలాంటి వ్యూహం పాటించాలి? అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇదే…

సంప్రదాయం నుంచి పెట్టుబడిగా మారిన పసిడి.. From Tradition to Investment Asset
మన దేశంలో బంగారం ( Akshaya Tritiya Special)అనేది కేవలం లోహం కాదు… భావోద్వేగం. ప్రతి ఇంట్లోనూ ఇది సంపదకు, భద్రతకు ప్రతీక. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే అపారమైన అనుబంధం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలన్నింటిలోనూ బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కాలం మారుతోంది. ఇప్పటి తరం బంగారాన్ని ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’గా కాకుండా ‘వెల్త్ క్రియేషన్ టూల్’గా చూస్తోంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు ఇవ్వగల సాధనంగా గుర్తిస్తోంది. వెండీ కూడా ఇదే దారిలో నడుస్తోంది. ఒకప్పుడు కేవలం గృహ అవసరాలకే పరిమితమైన వెండి… ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ కారణంగా పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది.

ఎంత పెట్టుబడి చేయాలి? How Much Should You Allocate?
పెట్టుబడి నిపుణుల సూచన ప్రకారం… మొత్తం పోర్టుఫోలియోలో 8% నుంచి 15% వరకు బంగారం, వెండికి కేటాయించడం ఉత్తమం. కొందరు నిపుణులు ఈ పరిమితిని 20% వరకూ పెంచాలని సూచిస్తున్నారు. ఈ కేటాయింపులో కూడా సమతుల్యత ముఖ్యం. 75% నుంచి 80% వరకు బంగారంలో, 20% నుంచి 25% వరకు వెండిలో పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గి, రాబడులు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.

బంగారం vs వెండి… ఏది మెరుగైనది? Gold vs Silver: Which is Better?
బంగారం ఎప్పుడూ ‘సేఫ్ హెవెన్’గా పరిగణించబడుతుంది. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. మరోవైపు వెండి కూడా ఇప్పుడు వేగంగా ఎదుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో వెండి వినియోగం పెరుగుతోంది. దీని వల్ల దీని డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత ఏడాది గణాంకాలు చూస్తే.. బంగారం సుమారు 60% పైగా రాబడి ఇచ్చింది. వెండి అయితే 150% కంటే ఎక్కువ లాభం ఇచ్చింది. ఇది వెండిలో ఉన్న అవకాశాలను స్పష్టంగా చూపిస్తోంది.

ధరల ఊగిసలాట… అవకాశమా? ప్రమాదమా? Price Volatility: Risk or Opportunity?
ఇటీవల బంగారం, వెండి ( Akshaya Tritiya Special) ధరలు భారీగా పెరిగి… మళ్లీ కొంత తగ్గాయి. ఇది చాలామందికి సందేహం కలిగిస్తోంది. కానీ “ధరలు పడిపోతేనే కొనాలి” అని నిపుణులు చెబుతున్నారు. దీనినే ‘Buy on dips’ స్ట్రాటజీ అంటారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే… కొద్దికొద్దిగా కొనుగోలు చేస్తూ వెళితే రిస్క్ తగ్గుతుంది.

ఫిజికల్ గోల్డ్‌కు ప్రత్యామ్నాయాలు..  Alternatives to Physical Gold
పాత తరహాలో బంగారం( Akshaya Tritiya Special) కొనడం అంటే నగలు, నాణేలు, బిస్కెట్లు. కానీ ఇప్పుడు కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ గోల్డ్: చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు. భద్రత సమస్య ఉండదు. గోల్డ్ ETFలు: స్టాక్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పారదర్శకత ఎక్కువ. సావరిన్ గోల్డ్ బాండ్స్: వడ్డీతో పాటు ధర పెరుగుదల లాభం కూడా. ఈ మార్గాలు పెట్టుబడిదారులకు మరింత సౌకర్యవంతంగా మారాయి.

అక్షయ తృతీయ… భావోద్వేగం + వ్యూహం .. Emotion Meets Strategy
అక్షయ తృతీయ ( Akshaya Tritiya Special) రోజున బంగారం కొనడం కేవలం విశ్వాసం కాదు… ఇప్పుడు ఇది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ భాగంగా మారుతోంది. ఈ రోజున పెట్టుబడి ప్రారంభించడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది. దీర్ఘకాల పెట్టుబడి అలవాటు ఏర్పడుతుంది. సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది.

భవిష్యత్ అంచనాలు .. Future Outlook
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం… వచ్చే ఏడాదిలో10 గ్రాముల బంగారం రూ.2 లక్షల మార్క్ దాటే అవకాశం ఉంది. కిలో వెండి రూ.3 లక్షలకు పైగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది దీర్ఘకాల పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.

గిరాకీ తగ్గినా కొనుగోళ్లు కొనసాగుతూనే… Demand Slows, But Buying Continues
ధరలు పెరగడంతో ఆభరణాల( Akshaya Tritiya Special) కొనుగోలు కొంత తగ్గినప్పటికీ…పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనడం మాత్రం ఆగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని జ్యువెలరీ షాపులు మేకింగ్ ఛార్జీలు తగ్గిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి

వెండి… మర్చిపోవద్దు.. Don’t Ignore Silver
బంగారంతో ( Akshaya Tritiya Special) పోలిస్తే వెండి తక్కువ ధరలో లభిస్తుంది. అందుకే చిన్న పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశం. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతున్నందున… వెండి ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది.

నిపుణుల సూచనలు.. Expert Advice
మొత్తం పెట్టుబడిలో 10–20% వరకు మాత్రమే కేటాయించాలి. ఒకేసారి కాకుండా విడతలవారీగా కొనాలి. కనీసం 2–5 సంవత్సరాల దృష్టితో పెట్టుబడి పెట్టాలి. ఫిజికల్ కంటే ఫైనాన్షియల్ గోల్డ్‌ను పరిగణలోకి తీసుకోవాలి. మొత్తంగా అక్షయ తృతీయ…( Akshaya Tritiya Special) సంప్రదాయం, విశ్వాసం, ఆర్థిక ప్రణాళిక అన్నీ కలిసే అరుదైన రోజు. ఈ రోజున బంగారం లేదా వెండి కొనడం కేవలం ఆనవాయితీ కాదు… భవిష్యత్ ఆర్థిక భద్రతకు ఒక బలమైన అడుగు. ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న అస్థిరత మధ్య… ఈ రెండు లోహాలు పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే..అతిగా పెట్టుబడి కాదు… సరైన వ్యూహంతో పెట్టుబడి. అయితే ఈ అక్షయ తృతీయ నుంచి చిన్న మొత్తంతో అయినా ప్రారంభించండి. అది భవిష్యత్తులో పెద్ద సంపదగా మారే అవకాశం ఉంది.

67
FEATURE NEWS, INVESTMENTS Tags:Alternatives to Physical Gold, But Buying Continues, Demand Slows, Don’t Ignore Silver, Emotion Meets Strategy, Expert Advice, From Tradition to Investment Asset, Future Outlook, Gold vs Silver: Which is Better?, How Much Should You Allocate?, Price Volatility: Risk or Opportunity?

Post navigation

Previous Post: SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
Next Post: నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth?

Related Posts

  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి.. FEATURE NEWS
  • ప్ర‌పంచంలోని అగ్రగామి కేంద్ర బ్యాంకులను మించి.. ఇళ్లలో బంగారం! Gold in Households Surpasses Top Central Banks Worldwide! FEATURE NEWS
  • గత బడ్జెట్ నుంచి ఇప్పటివరకు 363% పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ Multi-Bagger Stock Surges 363% Since Last Budget FEATURE NEWS
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు..! బ్యాంకింగ్ సేవ‌ల‌పై ప్ర‌భావం! Consecutive Bank Holidays in April..! Impact on Banking Services FEATURE NEWS
  • ఈ లావాదేవీలు చేస్తే ఐటీ కళ్లలో పడినట్టే..! These Transactions Put You Directly Under the Income Tax Radar! FINICAL PLANNING
  • సెన్సెక్స్, నిఫ్టీ అంటే..? FEATURE NEWS
  • మోటారు బీమా పాలసీ తీసుకున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి! Have You Taken a Motor Insurance Policy? Then Know These Important Points! INSURANCE
  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఉద్యోగులకు ప్ర‌యోజ‌నాలెన్నో..! New Income Tax Act: Major Benefits for Salaried Employees FEATURE NEWS
  • FDలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులివే.. Planning to Invest in an FD..? Here Are the Banks Offering the Highest Interest Rates.. FINICAL PLANNING
  • జనవరి 2026 లోపు ఇలా చేయండి ..! బీమా, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్‌, సిల్వ‌ర్‌, స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డి వ్యూహాలు..! Investment Strategies, Insurance, Mutual Funds, and Stock Market Tips Until January 2026 FEATURE NEWS
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme