
మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణలోకి తీసుకుంటాం. అలాంటి వాటిలో స్టాక్ ప్లెడ్జ్ ఒకటి. అయితే ఏదైనా కంపెనీ తన షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకున్నప్పుడు అది మంచికా లేదా చెడ్డదా అనేది ఇక్కడ విశ్లేషించుకోవాలి. ఆ తనఖా కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడేలా ఉంటే పర్వాలేదు కానీ కంపెనీకి ఆ రుణం గుదిబండలా మారితే ఆ విషయాన్ని మనం ముందుగానే పసిగట్టగలగాలి.
ప్లెడ్జింగ్ అంటే తాకట్టు పెట్టడం అని అర్థం. కంపెనీల ప్రమోటర్లు తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, కొనుగోళ్ళకు నిధులు సమకూర్చుకునే క్రమంలో రుణాలను పొందేందుకు ఉపయోగించే ఎంపికల్లో షేర్ల తాకట్టు ఒకటి. కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పై రుణాన్ని పొందేందుకు ప్లెడ్జింగ్ ఉపయోగపడుతుంది.
how do a promoter pledge shares
ప్రమోటర్ కి ఏదైతే విజన్ ఉంటుందో ఆ విజన్ బట్టి కంపెనీ గ్రో అవుతుంది. కంపెనీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది.. కంపెనీ ఫర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రమోటర్స్ కి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం షేర్స్ ని ప్లెడ్జ్ చేస్తున్నామో ఆ టైమ్ లో షేర్ ఫ్రైస్ ఎంత ఉంటుందో లెక్కవేసుకుంటారు. అది ఇంత ఉందని లెక్కవేసిన తర్వాత దానిలోనుంచి కొంత శాతం డబ్బును ప్రమోటర్స్ కి ఇస్తారు. ప్లెడ్జ్ చేసిన డబ్బును ప్రమోటర్ రెండు విధాలుగా వాడుకోవచ్చు.
పోజిటివ్ వే….
ప్రమోటర్స్ కి డబ్బులు వస్తే ఆ డబ్బులను మళ్ళీ గ్రోత్ ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం. ఏదైతే ప్లెడ్జ్ చేసిన షేర్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ కంపెనీ గ్రోత్ కి ఉపయోగించడం.
నెగిటివ్ వే…
ఎప్పుడైతే మన కంపెనీ పెర్ఫార్మెన్సు ఆశాజనకంగా ఉండదో.. కంపెనీ పెద్దగా గ్రో అవ్వదని అనిపిస్తుందో
ప్రమోటర్ అనేవారు కంపెనీనుంచి వైదొలగాలని చూస్తారు. ఇక్కడున్న షేర్ ప్రైస్ ఎక్కువ పెరగదు అని తెలిసినప్పుడు ప్రమోటర్ దానిని తీసుకువెళ్ళి ప్లెడ్జ్ చేస్తే ఆ షేర్ ఏ ప్రైస్ లో ఉందో దానికి సంబంధించిన కొంత మనీని బ్యాంకర్స్ గానీ ఆపరేటర్స్ గానీ రుణంగా ఇస్తారు. ఇదే క్రమంలో వాళ్ళకి ఎప్పుడైతే కంపెనీ గ్రో అవ్వడం లేదని ఆలోచన వస్తుందో వాళ్ళు క్లియర్ గా షేర్ ను తగ్గించుకుంటూ, షేర్ ను అమ్ముకుంటూ వస్తారు.
what banks will do with pledged shares
ప్లెడ్జ్ చేసిన షేర్లకి లోన్ ఇచ్చిన బ్యాంక్లర్లు, లేదా ఆపరేటర్లు ఈ షేర్ ప్రైస్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం తీసుకున్న లోన్, పడిపోతున్న షేర్ ప్రైస్ కు మ్యాచ్ అవ్వవో అప్పుడు బ్యాంకర్లు ప్రమోటర్లకి రెండు ఆప్షన్ లు ఇస్తారు.
1. ఇంకా ప్రమోటర్ దగ్గరున్న షేర్లని ప్లెడ్జ్ చేయడం అంటే మిగిలిన షేర్లను మాదగ్గర తాకట్టు పెట్టండి అని అడగడం.
2. మీకు ఏదైతే డబ్బులు రుణంగా ఇచ్చామో వాటిని రీ పేమెంట్ చెయ్యండి అని కోరడం.
ఈ రెండు ఆప్షన్లకి ప్రమోటర్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వకపోతే షేర్స్ అన్నింటినీ మార్కెట్లో ఓపెన్ గా అమ్మేస్తారు. ఎప్పుడైతే సప్లై ఆఫ్ షేర్స్ ఎక్కువై డిమాండ్ ఆఫ్ షేర్స్ తక్కువౌవుతుందో అప్పుడు షేర్ ప్రైస్ పడిపోతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసినవారు వాళ్ళు షేర్ ను అమ్మేస్తారు. అప్పుడు నష్టపోయేది రిటైల్ ఇన్వెస్టర్ మాత్రమే.
ఏ కంపెనీ ప్రమోటర్లు ఎక్కువ మొత్తంలో షేర్లను ప్లెడ్జి చేస్తారో దాన్ని ఆ కంపెనీ విషయంలో నెగటివ్ గా చూడాల్సి ఉంటుంది. అంటే ఆ కంపెనీకి నష్ట భయం ఉంది అని అర్థం.
అయితే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మన స్టాక్స్‌లను ప్లెడ్జ్ చేయవచ్చు. అయితే ఆ సొమ్మును మళ్లీ మనం తిరిగి స్టాక్స్‌లోనే పెట్టగలం. మన వ్యక్తిగత అవసరాలను ఉపయోగించుకోలేం. అయితే ప్లెడ్జింగ్ అనేది ఒక్కో బ్రోకింగ్ కంపెనీలో ఒక్కోలా ఉంటుంది.