how to protect from cyber attacks
ఇప్పడు ఆన్‌లైన్ లావాదేవీలు చాలా సాధారణమైపోయాయి. అంతే వేగంతో ఆన్‌లైన్ మోసాలు సర్వసాధారణమైపోయాయి. రోజుకూ సైబర్ నేరగాళ్లు తమ ప్రతాపం చూపుతునే ఉన్నారు. అయితే ఇలాంటి మోసాలకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే అవకాశం ఇస్తాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సురక్షితమైన డిజిటల్ లావాదేవీల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం..
వీటిని మరిచిపోవద్దు..
* మన బ్యాంకింగ్ వెబ్ సైట్ లాగిన్‌లకు ప్రత్యేకమైన, క్లిష్టమైన పాస్ వర్డ్ పెట్టుకోవాలి. ఈ పాస్ వర్డ్ లను తరుచూ మారుస్తూ ఉండాలి.
* ఐడీ, పాస్ వర్డ్, పిన్ వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదు. ఎక్కడా సేవ్ చేయకూడదు.
* బ్యాంక్ మనల్ని ఎప్పుడూ యూజర్ ఐడీ లేదా పాస్ వర్డ్ లేదా కార్డ్ నెంబర్ లేదా పిన్ లేదా సీవీవీ లేదా ఓటీపీ వంటి వివరాలను అడగదని మనం గుర్తించుకోవాలి.
* మన ఫోన్ లేదా కంప్యూటర్ లో పాస్ వర్డ్ ల వంటి కీలక వివరాలను సేవ్ చేసుకునే` ఆటో సేవ్’, `రిమెంబర్’ వంటి ఆప్షన్లను తొలగించాలి.
* ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు చేసేటప్పడు చుట్టుపక్కల పరిశీలించాలి. పిన్ ఎంటర్ చేసేటపుడు కీప్యాడ్ ను కవర్ చేయాలి.
* లావాదేవీ పూర్తయిన తర్వాత మొబైల్ కు వచ్చే మెసేజ్‌ను పరిశీలించుకోవాలి.
* ముందుగా మనం లాగిన్ అయిన వెబ్‌సైట్ అసలైనదో కాదో చెక్ చేసుకోండి.
* మొబైల్ డేటాను నిత్యం ఆన్‌లో ఉంచడం ప్రమాదకరం. వైఫై షేర్ చేసేటప్పుడు పని ముగిసిన వెంటనే డేటా ఆఫ్ చేసేయాలి. లేదంటే సైబర్ నేరగాళ్లు వల వేసే అవకాశం ఉంటుంది.
* సైబర్ నేరగాళ్లు నిత్యం ఏదోలా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. రోజుకో కొత్తమార్గాన్నిఎన్నుకుంటారు. ఫోన్లు చెయ్యడం, మెసేజ్లు చెయ్యడం తో పాటు ఆర్థిక సేవలందిస్తామని మాటలు కలుపుతారు. వ్యక్తిగత వివరాలు, ఓ టీ పి లు అడిగి మన అకౌంట్లోకి చొరబడతారు. ఇలా మన బ్యాంకు ఖాతాలను ఖాలీ చేస్తారు.
be careful with UPI transactions
యూపీఐ సేవల్లో అప్రమత్తం..
మనం వాడే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ లాంటి మనీట్రాన్స్‌ఫర్ యాప్స్ వాడకంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందులో యూపీఐ ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి. వీటికి పెట్టే పిన్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
* అపరిచిత యూపీఐ రిక్వెస్ట్ లకు స్పందించొద్దు.
* నకిలీ రిక్వెస్ట్ లను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాలి.
* నగదు బదిలీకి మాత్రమే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిసీవ్ చేసుకోవడానికి అవసరం లేదు.
Konni short case studies pettalsindhi..
sure
tq