Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!

Posted on 16/04/2026 By admin No Comments on ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!

జీవితంలో అనుకోని సంఘటనలు ఎప్పుడు, ఎలా ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరు. ఈ అనిశ్చితిలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడానికి తీసుకునే అత్యంత కీలక నిర్ణయం ‘టర్మ్ ఇన్సూరెన్స్’ (Term Insurance) . అయితే, ఈ నిర్ణయం ఎంత ముఖ్యమో తెలుసుకున్నప్పటికీ, దాన్ని అమలు చేసే సమయంలో చాలా మంది చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రీమియం చెల్లిస్తున్నామన్న భావనతో బాధ్యత పూర్తయ్యిందనుకోవడం చాలా పెద్ద అపోహ. నిజానికి, సరైన అవగాహన లేకుండా తీసుకున్న పాలసీ, అవసరమైన సమయంలో పనికిరాకపోవచ్చు. ఈ నేపథ్యంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు, ఎక్కువగా చేసే పొరపాట్లు, వాటి వల్ల కలిగే పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కవరేజీ సరిపోకపోతే… రక్షణ ఎలా? Inadequate Coverage… A False Sense of Security
చాలామంది పాలసీ (Term Insurance)తీసుకునేటప్పుడు ప్రధానంగా ప్రీమియం మొత్తాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటారు. “ఎక్కువ కవరేజీ అంటే ఎక్కువ ప్రీమియం” అనే భయంతో తక్కువ ‘సమ్ అష్యూర్డ్’ ఎంచుకుంటారు. కానీ ఇది కుటుంబ భద్రతను ప్రమాదంలో పడేసే నిర్ణయం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కనీసం వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు కవరేజీ ఉండాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.5 లక్షలు సంపాదిస్తే, కనీసం రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కవరేజీ ఉండాలి. దీనికి తోడు ఉన్న హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటి అప్పులు కూడా జోడించాలి. అప్పుడే కుటుంబం అదే జీవన ప్రమాణాలను కొనసాగించగలదు. లేదంటే పాలసీ ఉన్నా, అది ఉపయోగం లేకుండా పోతుంది.

వయస్సు పెరిగే కొద్దీ… ఖర్చు కూడా పెరుగుతుంది.. Delay Today… Pay More Tomorrow
“ఇంకా టైమ్ ఉంది” (Term Insurance)అనే ఆలోచనతో చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్‌ను వాయిదా వేస్తుంటారు. కానీ ఇది చాలా ఖరీదైన పొరపాటు. 20లలో లేదా 30ల ప్రారంభంలో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మెడికల్ టెస్టులు కూడా సులభంగా పూర్తవుతాయి. వయస్సు పెరిగే కొద్దీ బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు రావడం సాధారణం. ఈ పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంను పెంచడం మాత్రమే కాదు, కొన్నిసార్లు పాలసీ ఇవ్వడానికి కూడా నిరాకరించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా సరైన సమయంలో పాలసీ తీసుకోవడం ఉత్తమ నిర్ణయం.

చౌకే కాబట్టి తీసుకుంటే… ప్రమాదం తప్పదు.. Cheap Isn’t Always Safe
ప్రీమియం (Term Insurance)తక్కువగా ఉందని చూసి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీని ఎంచుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో (CSR). ఇది కంపెనీ ఎంతమంది క్లెయిమ్‌లను పరిష్కరించిందో తెలియజేస్తుంది. 95% కంటే ఎక్కువ CSR ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, అవసరమైన సమయంలో కంపెనీ స్పందన ఎంత వేగంగా ఉంటుందో ఇదే సూచిస్తుంది. తక్కువ ప్రీమియం కోసం నమ్మకంలేని కంపెనీని ఎంచుకుంటే, క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు తప్పవు.

నామినీ వివరాలు… నిర్లక్ష్యం చేయొద్దు.. Nominee Details… Small Mistake, Big Trouble
పాలసీ (Term Insurance)తీసుకునేటప్పుడు నామినీ వివరాలు నమోదు చేయడం ఒక ఫార్మాలిటీ మాత్రమే అనుకునే వారు చాలా మంది. కానీ ఇదే క్లెయిమ్ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెళ్లి ముందు తల్లిదండ్రులను నామినీగా పెట్టి, పెళ్లయ్యాక భార్య లేదా పిల్లల పేర్లు అప్‌డేట్ చేయకపోతే చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి. అలాగే నామినీ మరణించిన సందర్భంలో వెంటనే కొత్త నామినీని చేర్చాలి. ఈ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే, కుటుంబానికి రావాల్సిన డబ్బు ఆలస్యమవుతుంది.

రైడర్లు లేకపోతే… పూర్తి రక్షణ కాదు.. Without Riders… Protection Is Incomplete
కేవలం బేసిక్ టర్మ్ ప్లాన్‌తో (Term Insurance)సరిపెట్టుకోవడం సరైన నిర్ణయం కాదు. క్రిటికల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ వంటి రైడర్లు పాలసీకి అదనపు రక్షణను అందిస్తాయి. ఉదాహరణకు, ఒకవేళ పాలసీదారుడు ప్రమాదంలో అంగవైకల్యం చెందితే, ‘వైవర్ ఆఫ్ ప్రీమియం’ రైడర్ వల్ల భవిష్యత్తులో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ రైడర్లు తక్కువ ఖర్చుతో పెద్ద ప్రయోజనం అందిస్తాయి.

నిజాలు దాచిపెడితే… క్లెయిమ్ ఆగిపోతుంది.. Hide the Truth… Lose the Claim
పాలసీ(Term Insurance) తీసుకునేటప్పుడు ఆరోగ్య వివరాలు, అలవాట్లు పూర్తిగా వెల్లడించడం చాలా ముఖ్యమైన విషయం. కానీ చాలామంది ప్రీమియం తగ్గించుకోవాలని ఆరోగ్య సమస్యలను దాచిపెడుతుంటారు. ఇది క్లెయిమ్ సమయంలో పెద్ద సమస్యగా మారుతుంది. కంపెనీలు మీ మెడికల్ హిస్టరీని వెరిఫై చేసి, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. అప్పుడు కుటుంబానికి అందాల్సిన ఆర్థిక భరోసా ఒక్కసారిగా కూలిపోతుంది.

ఇన్సూరెన్స్ కాదు… భరోసా.. Insurance Is Not an Expense… It’s Assurance
టర్మ్ ఇన్సూరెన్స్‌ను(Term Insurance) చాలా మంది ఖర్చుగా భావిస్తారు. కానీ ఇది నిజానికి కుటుంబ భవిష్యత్తుకు మీరు ఇచ్చే భరోసా. మీరు లేని సమయంలో కూడా మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఇది ఒక రక్షణ కవచం. సరైన అవగాహన, సమయానికి నిర్ణయం, పూర్తి నిజాయితీతో తీసుకున్న పాలసీ మాత్రమే మీ కుటుంబానికి నిజమైన భద్రతను అందిస్తుంది.

ఒక క్లిక్ ముందే ఆలోచించండి.. Before You Click ‘Buy Now’… Think Twice
టెక్నాలజీ(Term Insurance) అభివృద్ధి వల్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా సులభమైంది. ఒక క్లిక్‌తో పాలసీ తీసుకోవచ్చు. కానీ అదే వేగంతో నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. పాలసీ తీసుకునే ముందు మీ అవసరాలు, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు లక్ష్యాలు అన్నింటినీ విశ్లేషించాలి. చిన్న తప్పులు కూడా పెద్ద నష్టాలకు దారితీస్తాయని గుర్తుంచుకోవాలి. చివరగా… మీరు తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక డాక్యుమెంట్ మాత్రమే కాదు… అది మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు ఇచ్చే మాట. ఆ మాట నిలబెట్టుకోవాలంటే… నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి కాదు… పదిసార్లు ఆలోచించాలి.

7
INSURANCE Tags:Before You Click ‘Buy Now’… Think Twice, Big Trouble, Cheap Isn’t Always Safe, Delay Today… Pay More Tomorrow, Hide the Truth… Lose the Claim, Inadequate Coverage… A False Sense of Security, Insurance Is Not an Expense… It’s Assurance, Nominee Details… Small Mistake, Without Riders… Protection Is Incomplete

Post navigation

Previous Post: అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
Next Post: గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?

Related Posts

  • పెళ్లి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్‌లో భాగస్వామి చేర్చుకోవ‌డం వీల‌వుతుందా? Can You Add Your Spouse to Health Insurance After Marriage? INSURANCE
  • గృహ బీమా అవ‌స‌ర‌మా? Is Home Insurance Necessary? INSURANCE
  • పెన్షన్ టెన్షన్ వద్దు.. LIC ‘మ్యాజిక్’ పాలసీలతో జీవితాంతం ఆదాయం! No Pension Worries.. Lifetime Income with LIC ‘Magic’ Policies! INSURANCE
  • WHAT ARE THE BENIFITS OF HEALTH INSURANCE TELUGU హెల్త్ ఇన్సూరెన్స్ లాభాలేంటి INSURANCE
  • ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాల‌సీలు.. అవేమిటో తెలుసుకుందాం! Two New LIC Policies — Let’s Find Out What They Are! INSURANCE
  • ఇన్సూరెన్స్ కంపెనీలు సాంకేతిక కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించడం త‌గ‌దు..! హైకోర్టు సంచలన తీర్పు! Insurance Companies Cannot Reject Claims on Technical Grounds..! High Court’s Sensational Verdict! INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks FEATURE NEWS
  • విద్యా రుణం తీసుకోవాలనుకుంటున్నారా Want to Take an Education Loan FEATURE NEWS
  • కార్పొరేట్ ఎఫ్‌డీల్లో వ‌డ్డీలు ఎంత‌..? FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS
  • పెర‌గ‌నున్న విమాన రంగ ఆదాయం.. NEWS
  • టోల్ ప్లాజా దాటుతున్నారా? ఈ పత్రాలు లేకపోతే క‌ష్ట‌మే! No Valid Documents? Digital System Issues eChallan Instantly FEATURE NEWS
  • స్టాక్ ట్రేడింగ్ లో చార్జీలు ఎంతో తెలుసా..? FEATURE NEWS
  • గృహ రుణం ఎప్పుడు మార్చుకోవాలి When to change home loan FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme