ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్ సమరీ The science of getting rich book summery telugu
డబ్బు సంపాదించాలంటే ఏదో ఉద్యోగం, వ్యాపారం లేదా జాగ్రత్తగా డబ్బులు దాచుకుని ఎక్కడైనా లాభదాయకమైన చోట పెట్టుబడి పెట్టడం లాంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఇలా చేసిన వారంతా ధనవంతులవుతున్నారా అంటే సమాధానం దొరకదు. సంపద కోసం పనిచేయడమే కాకుండా ధనవంతులవడానికి మానసికంగా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామన్నదే ముఖ్యం. అందుకే ముందుగా మన మనసును, ఆలోచనలను సరిచేసుకుని, ధనవంతులవడానికి ప్రయత్నించాలని చెప్పే పుస్తకమే `దసైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్`
`ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్` పుస్తకాన్ని వాలస్.డి.వాటెల్స్ రచించారు.
1910 లో పబ్లిష్ అయిన ఈ పుస్తకం ధనం సంపాదించడానికి కావలిసిన మైండ్ సెట్ గురించి, విజువలైజేషన్ గురించి, మన బిలీఫ్ సిస్టమ్ గురించి వివరించింది. వందేళ్లు పైబడినా ఇందులోని విషయాలు నేటికీ సజీవంగా, ఉపయోగపడేలా ఉన్నాయి. మనం ఎంత పేదవారైన ధనవంతులు కావాలంటే ఉండాల్సిన అర్హత, మానసిక పరిపక్వత తదితర విషయాలను రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు.
ద రైట్ టు బి రిచ్
ఈ భూమీ మీద నివసించే ప్రతి వ్యక్తికి డబ్బు చాలా అవసరం. అలాగే ప్రతి వ్యక్తికీ ధనవంతులు కావాలనుకునే అర్హత ఉంది. అసలు మనం బతకాలంటే శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు ఉండాలి.
మన శరీరానికి భోజనం, ఇల్లు, విశ్రాంతి కావాలి. మనసుకి పుస్తకాలు, ఆలోచనలు, ధ్యానం కావాలి.
ఆత్మకు ప్రేమ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ధనవంతులవగలం. మనిషికి ఆనందం తన ఇష్టమైన వ్యక్తితో పంచుకున్నప్పుడే వస్తుంది. అలా పంచలేనపుడు ఎంతటి ధనవంతుడైనా పేదవారితో సమానం. ఇలాంటి ఎన్నో జీవిత సత్యాలను ఈ పుస్తకంలో మనం తెలుసుకోవచ్చు.
పద్దతి ప్రకారమే..
ప్రతి పని చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే ఆ పని విజయం సాధిస్తుంది.
ధనవంతులు అవ్వడానికి టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ టాలెంట్ ను సరైన పద్ధతిలో వాడాలి. అప్పుడు మనం ఎంత పేదరికంలో ఉన్న ధనవంతులు అవ్వగలం.
how to get opportunities for being rich
అవకాశాలు
అవకాశాలు ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి. కానీ వాటిని కొంతమంది మాత్రమే అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. రాని అవకాశం కోసం బాధపడకూడదు. ధనం సంపాదించే సిద్దాంతం అందరికీ ఒకే విధంగా పనిచేస్తుంది.
మొదటి సిద్ధాంతం…
మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్న సరే మనకు కావాల్సిన దాని గురించి మాత్రమే ఆలోచించాలి. మన చుట్టూ జరిగేదంతా అబద్దం. మనం కోరుకున్నదే నిజం అని బలంగా నమ్మాలి.
మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి మన ఆలోచనలు ఏర్పరుచుకోవడం చాలా సులభం. కాని మన లక్ష్యానికి అనుకూలంగా మన ఆలోచనలు కలగాలంటే చాలా సాధన అవసరం.
ఒక సూపర్ నేచురల్ పవర్ ఈ సృష్టిని నడిపిస్తుందని, మనం నమ్మిందే నిజమవుతుందని తెలుసుకోవడమే `ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్` మొదటి సిద్ధాంతం.
`ఎక్కువ`
పనికిరాదు..
మనిషికి ఎక్కువ దానగుణం, ఎక్కువ స్వార్థం రెండు మంచివి కావు. ఇతరుల కోసం త్యాగం చెయ్యవసరం లేదు. ముందు మన గురించి ఆలోచించాలి. మన కన్నా ఇతరుల దగ్గర ఎక్కువ డబ్బు ఉందని అసూయ చెందకూడదు. ఎందుకంటే ఆ సృష్టిలో అనంత సంపద ఉంది. అది పొందాలంటే మన ఆలోచనలు మార్చుకోవాలి.
* మనకు ఏదైనా కావాలనుకుంటే దానిని మన డ్రీమ్ గా ఉహించుకుని దానిని మనం పొందగలం ఇని గట్టి నమ్మకం కలిగిఉండాలి.
* ముందు మన కంటికి కనబడని శక్తి ఒకటి ఉందని తెలుసుకోవాలి. ఆ శక్తి మనం కోరుకున్న పనులన్నీ జరిపిస్తుందని నమ్మాలి. మనకు లభించే ప్రతిదానికి కృతజ్ఞత భావం జోడించాలి. మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే మనకి కావాల్సిన వస్తువులను ఎట్రాక్ట్ చెయ్యవచ్చు.
* మనం కోరుకున్న వాటిపై మనం దృష్టి పెట్టలేకపోతే మనకి అది నిజంగా అవసరం లేదని అర్థం.
కోరికలు నిజం అవ్వాలంటే మనం అనుక్షణం వాటి గురించే ఆలోచించాలి. ముందే అవి సాధించినందుకు కృతజ్ఞతలు తెలపాలి.
* విల్ పవర్ అంటే సంకల్పబలం. మన సంకల్పబలాన్ని మన గురించే ఉపయోగించాలి. కాని ఇతరులను మార్చడానికి కాదు. మన సంకల్పం బలంగా ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు.
మనం ధనవంతులు అవ్వాలంటే మనకి కావాల్సినది. క్రియేటివ్ మెథడ్. కానీ కాంపిటేటివ్ మెథడ్ కాదు.
విల్ పవర్ వాడటంతో పాటు సరైన పద్ధతిలో పనిచేయాలి.
* మనం కోరుకున్నది దక్కాలంటే ఆలోచిస్తే సరిపోదు. దానికి తగ్గ పని కూడా చెయ్యాలి. మన విజన్ నమ్మకం మనం కోరుకున్నది జరగడానికి దారులు వెతికిపెడితే మన యాక్షన్ మనం కోరుకున్న వస్తువు దగ్గరికి తీసుకెళ్తుంది.
* ధనవంతులు అవ్వాలంటే ముందు క్లియర్ విజన్ సెట్ చేసుకుని అది సాధిస్తామన్న బలమైన విశ్వాసంతో ఏ రోజు పని ఆ రోజు చేస్తే విజయం మనదే.
ఎఫీషియెంట్ యాక్షన్…
ప్రతి పనిని కూడా ఎఫీషియంట్ గా చెయ్యాలి. ఎందుకంటే చిన్న, చిన్న తప్పులు కూడా ఎంతో ప్రమాదకరంగా మారుతాయి. ఫెయిల్యూర్స్ కి ప్రధాన కారణం చేయవలిసిన పనులు సమర్థంగా చేయకపోవడం, చేసిన పనుల్లో తప్పులు ఉండడం.
what is right business to getting rich
రైట్ బిజినెస్…
* మనం త్వరగా ధనవంతులు అవ్వాలంటే మనం ఎంచుకున్న రంగంలో మనకి టాలెంట్ ఉండాలి. మనం సరైన మార్గం కాదు అనిపించినపుడు వెంటనే ఆ రంగంలో నుంచి తప్పుకోవాలి.
* సరైన అవకాశం కోసం వేచి ఉండాలి. అవకాశం వచ్చిన వెంటనే దానిని అందిపుచ్చుకోవాలి.
* మనం ఎక్కువ తొందరపడితే క్రియేటివ్ మెథడ్ కాకుండా కాంపిటేటివ్ మెథడ్ లో ఉన్నట్టే.
అపుడు మనకి ఏమి కావాలో దాని పై మన మైండ్ లో ఫోకస్ ఉంచాలి.
* ఎప్పుడైనా మనం తీసుకునే దాని కన్నా ఎక్కువ ఇచ్చినపుడే మన సంపద పెరుగుతుంది.
Nice article…
thank you