
ఇన్సూరెన్స్ అవసరం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరికీ ప్రతి ఒక్క విషయంలోనూ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. మన స్థాయి పెరిగే కొద్దీ బీమా అవసరం కూడా పెరుగుతోంది. బీమాలో చాలా రకాలు ఉంటాయి. ఏ అవసరానికి తగ్గట్టుగా, దేనికి దానికి వేరువేరుగా ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. అన్నింటిలో మనకు నప్పేది, అవసరమైనది ఏదో తెలుసుకుని సరైన పాలసీని ఎంచుకోవాలి. ఈ ఇన్సూరెన్స్‌లలో ప్రధానమైనది లైఫ్ ఇన్సూరెన్స్. ఆ తర్వాత ఆరోగ్య బీమా. అంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులోనూ చాలా రకాలు ఉన్నాయి. ఆ తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్. ఈ మూడు మనకు నిత్య జీవితంలో అత్యంత అవసరమైనవి. అందరికీ ఉండేవి. ఈ మూడింటిలో కూడా సదుపాయాలు, ప్రీమియంను బట్టి రకరకాల వర్గీకరణలు ఉంటాయి. ఆ తర్వాత పరిశీలిస్తే మరికొన్ని కొత్త రకాల ఇన్సూరెన్స్ లు ఇప్పడు వస్తున్నాయి. మనం వాడే ప్రతి వస్తువుకూ బీమా చేయించుకోవడం అనే సంస్కృతి ఇప్పుడు ప్రజల్లో పెరుగుతోంది. ఫోన్‌కు, సాంకేతిక పరికరాలకు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులకు, ఇంటికి, ఆఫీసు లేదా మనం చేసుకునే వ్యాపారానికి.. ఇలా ప్రతి దానికీ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారు. దీని వల్ల వస్తువుకు భద్రత పెరుగుతుంది. ఏం జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుందిలే అనే ధీమా ఇక్కడ ఉంటోంది. ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, కార్మికుల బీమా, షాప్ ఓనర్ ఇన్సూరెన్స్, ప్రయాణ బీమా, ట్రావెల్ ఇన్సూరెన్స్.. ఇలా రకరకాలు ఇప్పడు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో మనకు ఏది అవసరమో చూసుకుని రక్షణ కల్పించుకోవడం తప్పనిసరి.
WHAT IS LIFE INSURANCE
లైఫ్ ఇన్సురెన్స్
మన జీవితానికి అంటే మన ప్రాణానికి చేసుకునేదే లైఫ్ ఇన్సూరెన్స్. మనకు ఏదైనా అనుకోనిది జరిగి ప్రాణాలు కోల్పోతే అప్పడు మన కుటుంబానికి కవరేజీ కింద అధికమొత్తంలో అమౌంట్ లభిస్తుంది.
టర్మ్ ఇన్సురెన్స్ అనగా జీవిత బీమా పాలసీల ప్రాథమిక రకాలలో ఇది ఒకటి. టర్మ్ ప్లాన్ లో, పాలసీదారుడు నిర్ణీత కాల వ్యవధికి జీవిత బీమా పొందుతారు. పాలసీదారుడు అకాల మరణం సంభవించినట్లయితే, పాలసీదారుని కుటుంబం హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందుకుంటుంది. పాలసీదారుడు టర్మ్ ఇన్సురెన్స్ వ్యవధిలో జీవించి ఉంటే, పాలసీ నుంచి ఎలాంటి లాభాలు పొందలేరు. అంటే ఇక్కడ ఏదైనా జరిగితేనే డబ్బులు వస్తాయి. లేదంటే చెల్లించిన మొత్తం నుంచి ఏమీ వెనక్కు రాదు.
ఉదాహరణకు.. 25 ఏళ్ల రజనీష్ 70 ఏళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడనుకుందాం. దీనికి అతను ఎంచుకున్న కవరేజీ కోటి రూపాయలు. అంటే అతనికి 70 ఏళ్లు వచ్చే లోగా ఎప్పుడైనా మృతి చెందితే అతని కుటుంబానికి కోటి రూపాయలు వస్తాయి. దీనికి అతను ఎంచుకున్న చెల్లింపు కాలం 10 ఏళ్లు అనుకుందాం. అంటే పది సంవత్సరాల పాటు అతను ప్రీమియం చెల్లిస్తే 70 ఏళ్ల వరకూ కవరేజీ ఉంటుంది. అంటే 35 ఏళ్ల వరకూ అతను ప్రీమియం కడితే చాలు. ఇక్కడ చెల్లింపు కాలం పెరిగితే ప్రీమియం తగ్గుతుంది. ఒక వేళ 70 సంవ్సరాల వరకూ ఏమీ కాకపోతే రజనీష్‌కు ఎటువంటి కవరేజీ కానీ, ప్రీమియం అమౌంట్ కానీ వెనక్కు రాదు.
* ఇటీవల కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం వెనక్కు ఇచ్చే పాలసీలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే పాలసీ టర్మ్ ముగిసాక రజనీష్‌కు 70 ఏళ్లు నిండిన తరువాత కట్టిన ప్రమీయం మొత్తం వెనక్కు ఇస్తాయి. అయితే ఈ ప్రత్యేక పాలసీలను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
హెల్త్ ఇన్సురెన్స్
హెల్త్ ఇన్సురెన్స్ అనేది మరో ప్రధానమైన, అత్యంత అవసరమైన బీమా. ఇది వివిధ వైద్య, శస్త్రచికిత్స ఖర్చులకు మనకి పరిహారం ఇస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చులను భరించాలంటే సాధారణ, మధ్య తరగతి వారికి సాధ్యమయ్యేది కాదు. ఏ చిన్న చికిత్స కోసం మనం ఆసుపత్రికి వెళ్లినా బిల్లులు అధికంగా విధిస్తున్నారు. పొరపాటున ఆసుపత్రిలో అడ్మిట్ కావలసి వస్తే అందుకయ్యే ఖర్చుకు ఆస్తులమ్ముకోవాల్సిందే. ఆస్తులున్నవాళ్లయితే పర్వాలేదు.. మరి ఏ ఆధారం లేని వారు అప్పులు చేసుకోవాలి. ట్రీట్‌మెంట్ ఖర్చు, రూం చార్జిలు, కన్సల్టేషన్ ఫీజు, మందులు, రవాణా చార్జీలు, శస్రచికిత్స కు.. ఇలా అనేక రకాల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితికి ఉన్న ఒకే ఒక్క పరిష్కారం ఆరోగ్య బీమా. అందుకే ప్రతి సంవత్సరం కొంత ప్రీమియం చెల్లించి అత్యధిక కవరేజీ పొందే ప్లాన్ ను ఎంచుకోవడం చాలా అవసరం.
హెల్త్ ఇన్సురెన్స్ రెండు రకాలు
There are two types of health insurance
1. వ్యక్తిగత బీమా పాలసీ 2. కుటుంబ బీమా పాలసీ
కేవలం మన ఒక్కరికే ఇన్సూరెన్స్ చేయించుకుంటే అది వ్యక్తిగత బీమా. మనతో పాటు కుటుంబ సభ్యులందరికీ బీమా చేయించుకుంటే అది కుటుంబ బీమా పాలసీ అవుతుంది.
* మన క్లెయిమ్ రెండు రకాలు 1.క్యాష్ లెస్ 2. రీయంబర్స్ మెంట్.
క్యాష్ లెస్ అంటే మనకి నచ్చిన హాస్పిటల్ కి వెళితే మన వైద్యానికి అయ్యే ఖర్చు మనం పే చేయనవసరం లేదు. ఆ సంస్థ వాళ్ళు హాస్పిటల్ కి పే చేస్తారు.
రియంబర్స్ మెంట్ అంటే మనం హాస్పిటల్ కి అయ్యే ఖర్చు మనమే పే చేసిన తర్వాత ఆ బిల్స్ ని హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు.
types of motor insurance
మోటారు ఇన్సురెన్స్
కార్లు, టూ-వీలర్లు వాహనాలను కవర్ చేసేదే మోటర్ ఇన్సూరెన్ పాలసీ. మన వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాల నుంచి ఈ పాలసీ ఆర్థికంగా మనల్ని రక్షిస్తుంది.
ఈ పాలసీలో కూడా రెండు రకాలు పాలసీలు ఉన్నాయి.
1. కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సురెన్స్ 2. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్
కాంప్రిహెన్సివ్ ఇన్సురెన్స్ అంటే ఇరువైపులా వాహనాలకి, ఒక వేళ వ్యక్తికి ప్రమాదం సంభవిస్తే రెండింటికీ ఇన్సురెన్స్ వర్తిస్తుంది. దీనినే కాంప్రిహెన్సివ్ ఇన్సురెన్స్ అంటారు.
థర్డ్ పార్టీ అంటే మనకి ఉపయోగాలు ఉండవు. అవతల వాహనానికి ఏదైనా డ్యామేజ్ అయితే వాటికి ఇన్సురెన్స్ వర్తిస్తుంది. కొంతమంది సెలబ్రెటీస్ వాళ్ళ శరీర భాగాలకు కూడా ఇన్సురెన్స్ చేసుకుంటున్నారు.
ఆస్తి బీమా
ఆస్తి బీమా అంటే మన ఇళ్లకు కూడా ఇన్సురెన్స్ చేసుకోవచ్చు. ఏ కారణంగానైనా మన ఇళ్ళు డ్యామేజ్ అయినా లేదా మన ఇంట్లో వస్తువులు పోయినా ఈ ఇన్సురెన్స్ లభిస్తుంది. ఇంకా ఫ్యాక్టరీలు తీసుకుంటే పెద్ద,పెద్ద ఫ్యాక్టరీలలో పెద్ద,పెద్ద మిషనరీస్ ఉంటాయి. వాటికి కూడా ఇన్సురెన్స్ చేసుకోవచ్చు.
* మనం బ్యాంకు లోన్ తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామనుకుందాం. అదే టైంలో మనం ఇన్సూరెన్స్ కూడా తీసుకుని ఉంటే రుణం తిరిగి తీర్చుతున్న క్రమంలో మనకేదైనా జరిగి చనిపోతే అక్కడి నుంచి ఆ రుణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించుకుంటుంది.