మ్యూచువల్ ఫండ్స్ లో ఈ తప్పలు చేయొద్దు
never make mistakes with mutual funds
మీరు స్థిరమైన ఆదాయాన్ని పొందాలని చూస్తున్నారా..? అందుకు సరైన వేదిక కోసం వెతుకున్నారా..? చిన్న చిన్న మొత్తాలను క్రమంగా పొదుపు చేస్తూ దీర్ఘకాలంలో అమితమైన రాబడి, స్థిరమైన ఆస్తిని కూడబెట్టుకునేందుకు ఆలోచిస్తున్నారా..? అయితే ఆలస్యం చేయకండి. మ్యూచువల్ ఫండ్స్ ఇందుకు సరైన సాధనం. ఈక్విటీపై ఇటీవల భారతీయ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అధిక రాబడి పొందేందుకు ఇదే మంచి మార్గంగా గుర్తిస్తున్నారు. అందుకే ఆలస్యం చేయకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ సిప్( సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఇప్పుడే మొదలు పెట్టండి.
మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళు తప్పు చేస్తున్నట్టే.
మనం ఎంత త్వరగా ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేస్తే దీర్ఘకాలంలో అంత వెల్త్ క్రియేట్ అవుతుంది.
* మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి కన్నా, పెట్టుబడి పెడుతున్న కాలమే ముఖ్యం. ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి కొనసాగిస్తే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల అంత రిటర్న్ వస్తుంది.
don`t apply for every NFO
కొత్తగా వచ్చే NFO(new fund offer) లకు ఎక్కువగా అప్లై చేయకండి. ఒకే రకమైన ఫండ్లు మీకు పెద్ద లాభాలను తీసుకురావు. ఒక కొత్త ఫండ్‌ను ఎంచుకునే ముందు కొంత మీరు అధ్యయనం చేయాలి. ఆ తరహా ఫండ్ మీ పోర్టుఫోలియోలో ఇది వరకే ఉందో లేదో చూడాలి. అదే రకమైన మ్యూచువల్ ఫండ్‌లో మీరు పెట్టుబడి పెడితే మీకు వచ్చే ప్రతిఫలంలో తేడా ఉండదు. ఒక వేళ మార్కెట్లో ఆ ట్రెండ్‌లో నష్టం వస్తే మీ పోర్టుఫోలియోలోని అన్ని మ్యూచువల్ ఫండ్లు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకు వస్తున్నాయని కొత్తగా వచ్చే ఎన్ఎఫ్ఓలలో చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. కొత్తగా వచ్చే ఫండ్స్ కి ఎటువంటి హిస్టారికల్ డేటా ఉండదు. ఏమీ తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం పొరపాటే అవుతుంది.
ULIPs are not mutual funds
* చాలామంది యూలిప్స్, మ్యూచువల్ ఫండ్ ఒకటే అనుకుంటారు. యూలిప్ అంటే యూనిట్ కి లింక్ అయ్యే ఇన్సురెన్స్. అంటే ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ కలిపి ఉండేవే యూలిప్స్.
మనం ఇన్వెస్ట్ మెంట్ ని ఇన్సురెన్స్ తో పోల్చకూడదు. ఇన్సురెన్స్ అంటే ఇన్ కమ్ ప్రొటక్షన్. ఇన్సురెన్స్ ఇన్వెస్ట్ మెంట్ కాదు.
* మార్కెట్ పడిపోతున్న సమయంలో స్టాక్స్ ను అమ్మేయడానికి సిద్ధమవుతారు. కానీ ఆ సమయంలో ఎక్కువ మనీ పెట్టాలి. ఎందుకంటే తక్కవ ధరకే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి.
* సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కు ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతే మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. మనకి మంత్లీ జీతం రాగానే కొంత డబ్బును సిప్ లో ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం సిప్ ని ఆపకూడదు. కొనసాగిస్తూ ఉండాలి.
మ్యూచువల్ ఫండ్ల సంఖ్యకూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫండ్ల సంఖ్య పెరిగితే మీ పోర్టుఫోలియోలో గందరగోళం వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ఫాలో చేయడం కూడా మీకు కష్టం కావచ్చు. మీరు పెట్టుబడి మొత్తం పెంచుకోవాలనుకుంటే ఇది వరకూ మీ దగ్గర ఉన్న ఫండ్లలోనే ఆ మొత్తాన్ని జత చేస్తూ పోండి. ఒక వేళ మీ దగ్గర ఉన్న ఫండ్ల పనితీరు బాగోలేదనుకుంటే, దానినుంచి వేరే మంచి ఫండ్‌కు మీ నగదును స్విచ్ చేస్తూ మార్చుకోండి.
వీటన్నింటినీ తెలుసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం తప్పకుండా మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
Leave a Reply