
ఇటీవల కాలంలో ప్రజల్లో స్టాక్ మార్కెట్లపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇంకా చెప్పాలంటే యువతలో ఈ ట్రెండ్ మరీ పెరిగింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు జనం జాతరలా ముందుకు వచ్చారంటే అతిశయోక్తి కాదు.. ఈ క్రమంలోనే స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు పోటీ పడ్డాయి. రకరకాల ఆఫర్లు ఇచ్చాయి. దీంతో డీమ్యాట్ అకౌంట్లు కుప్పలు తెప్పలుగా ఓపెన్ అయ్యాయి. ఇంటిలో కూర్చుని త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఒకే ఒక్క పాయింట్ ఇక్కడ ఇంత వ్యాపారానికి కారణమైంది.
services of stock broking agencies
ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. మరి డీ మ్యాట్ అకౌంట్లు తెరిచేందుకు ఏది సరైన సంస్థ అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది. తెలిసీ తెలియక, మిడిమిడి సమాచారంతో చాలా మంది ఏదో ఒక బ్రోకింగ్ ఏజన్సీలో అకౌంట్ ఓపెన్ చేసి ఇబ్బందులు పడుతున్నారు. చార్జీల విషయంలో చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు. బ్రోకింగ్ సంస్థ ఏ తరహా సేవలందిస్తుందో కూడా తెలియదు. ఇలాంటి విషయంలో వినియోగదారులు నష్టపోయే ప్రమాదముంది.
types of broking agencies
ప్రధానంగా బ్రోకింగ్ ఏజెన్సీలు రెండు రకాలు
1. ఫుల్ టైం బ్రోకర్స్
2. డిస్కౌంట్ బ్రోకర్స్
త్రీ ఇన్ ఒన్ పేరుతో బ్యాంకులన్నీ ఫుల్ టైం బ్రోకర్స్‌గా సేవలందిస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్ + డీ మ్యాట్ అకౌంట్ + ట్రేడింగ్ అకౌంట్ ను కలిపి అందిస్తాయి. ఇటువంటి సేలందించే సంస్థలు ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. ఫుల్ టైం బ్రోకర్స్‌గా చలామణిలో ఉన్న సంస్థలు ఇంట్రాడే, డెలివరీ, లాంట్‌టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం రకరకాలుగా చార్జీలు వేస్తాయి. ఇంకా యాన్సువల్ చార్జీలు సరేసరి. వీటితో పాటు హైడ్ చార్జీలు కూడా ఉంటాయి. ఈ సంస్థలు వినియోగదారులకు సలహాలు, సూచనలు ఈ మెయిల్స్ రూపంలో అందిస్తాయి. కాల్స్ ఇవ్వడంతో పాటు ట్రేడర్లను గైడ్ చేస్తూ వాటికి కూడా మరన్ని చార్జీలు వసూలు చేస్తాయి. వీటన్నిటి గురించి ముందుగా మనకు తెలికపోవడం వల్ల చాలా మంది ట్రేడింగ్‌లో తమకు వచ్చే లాభాల కన్నా చార్జీల రూపంలోనే ఎక్కువ చెల్లిస్తారు. దీంతో తిరిగి నష్టపోవడం వారి వంతవుతుంది. ఇవి సంప్రదాయ బద్దంగా సేవలందిస్తూ చాలా కాలంగా మార్కెట్లో పాతుకుపోయాయి.
benefits of discount brokers
కానీ ఇప్పడు డిస్కౌంట్ బ్రోకర్ల హవా నడుస్తోంది. తక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తూ చాలా మోడ్రన్‌గా, కష్టమర్లకు సులువుగా అర్థమయ్యేలా సేవలందిస్తూ ట్రేడింగ్ స్టైల్‌నే మార్చివేశాయి డిస్కౌంట్ బ్రోకింగ్ ఏజన్సీలు. డిమ్యాట్+ ట్రేడింగ్ అకౌంట్ మాత్రమే అందస్తూ వేరే ప్రత్యేక సేవలు ఏవీ లేకుండా, అధనపు చార్జీలు కూడా వేయకుండా ట్రేడర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ బ్రోకరేజీ తీసుకుంటూ డెలివరీ ట్రేడ్లకైతే ఫ్రీగానే సేవలందిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇక్కడ ఎటువంటి కాల్స్ ఇవ్వరు.
ఈ రకమైన తేడాలేవీ తెలుసుకోకుండా మనలో కొందరు తొందర పడి డీ మ్యాట్ అకౌంట్లు తెరుస్తూ నష్టపోతున్నారు. అయితే రెగ్యలర్ ట్రేడింగ్ చేసేవళ్లు డిస్కౌంట్ బ్రోకర్లను ఆశ్రయించడం మేలు. లాంగ్ టర్స్ ఇన్వెస్టర్లు, లేదా అధికమొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారు ఫుల్ టైం బ్రోకర్ల వద్ద డీమ్యాట్ అకౌంట్ తెరవండి.