
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పటికీ చాలా మందిలో అనేక అపోహలు, భయాలు ఉన్నాయి.పెట్టిన డబ్బులు పోతాయేమోనని ఆందోళన చెందుతుంటారు. అయితే అటువంటి అనవసర భయాలు వద్దనే నిపుణులు చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ చరిత్రను తెలుసుకుని ఆ కంపెనీకి ఆర్డర్స్ వస్తున్నాయా లేదా కంపెనీ యాజమాన్యం ఎలాంటిది? కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఇవన్నీ తెలుసుకుని తర్వాత ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీ లాభనష్టాలను, మేనేజ్‌మెంట్ నిర్ణయాలను, భవిష్యత్తు మీద అంచనాలతో తమ పెట్టుబడులను నిర్వహిస్తుంటాయి. మన తరఫును ఉన్న నిపుణులైన ఫండ్ మేనేజర్లు ఈ విషయాల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ మనకు లాభాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
నష్టభయం తక్కువ
Less risk of loss
మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కంపెనీలు స్టాక్స్ కొంటాం. మనం పెట్టే డబ్బులతో అన్నీ స్టాక్స్ రావు కనుక కొంతమంది వ్యక్తులు ఎక్కువ మొత్తంతో ఇన్వెస్ట్ చేస్తారు. అందరి డబ్బులతో కలిపి పర్సంటేజ్ వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డివిడెండ్ లను స్కీమ్ కి యాడ్ చేస్తారు. ఇలా యాడ్ అవ్వడం వలన నెట్ అసెట్ వాల్యూ ఇన్‌క్రీజ్ అవుతుంది. నెట్ అసెట్ వాల్యూ కొన్నప్పుడల్లా యూనిట్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తీసుకునేవి కేవలం ఎక్స్ పెన్సివ్ రేషియో మాత్రమే. ఆ ఎక్స్ పెన్సివ్ రేషియోలోనే శాలరీస్ ఇచ్చుకోవాలి. ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కి ఫండ్ మేనేజర్ కి సలహాలు ఇవ్వడానికి టెక్నికల్ రీసెర్చీ టీమ్ ఉంటుంది. ఎక్స్ పెన్సస్ రేషియో ఎంత ఉంటే అంతే కంటే ఎక్స్ ట్రా పైసా తీసుకోవడానికి కూడా వీలు లేదు. లాభం వచ్చినప్పుడు సంస్థలు తినేయవు. నష్టం వచ్చినప్పుడు హైడ్ చెయ్యవు. మ్యూచువల్ ఫండ్స్‌లో అంతా పారదర్శకంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ మరెక్కడ ఉండదు. ప్రతి విషయం ఇన్వెస్టర్ కి తెలియజేస్తారు. కానీ ఇందులో దీర్ఘకాల పెట్టుబడులు మాత్రమే పూర్తి స్థాయి లాభాలను తీసుకువస్తాయి. స్వల్పకాలం అంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టి తీసేస్తే అవి లాభాలను ఇవ్వడం కొంచెం కష్టమే. మ్యూచువల్ ఫండ్ కంపెనీలన్నీ సెబీ గైడ్‌లైన్స్ మేరకు పనిచేస్తాయి. వీటిపై సెబీ పర్యవేక్షణ ఉంటుంది. ఎటువంటి తప్పులు లేదా పొరపాట్లు జరిగినా తగిన చర్యలు ఉంటాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనేవి వందశాతం సురక్షితమైనవిగా మనం పరిగణించవచ్చు.
TYPES OF MUTUAL FUNDS
మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి మనం ఫండ్స్ రకాలను ఎంచుకోవాలి.
ఇక్కడ ముఖ్యంగా మూడు రకాలైన ఫండ్స్ ఉంటాయి.
1.ఈక్విటీ ఫండ్ 2. బ్యాలెన్స్ ఫండ్ 3. డెట్ ఫండ్.
EQUITY FUNDS
ఈక్విటీ ఫండ్ అంటే ఒక కంపెనీలో ఫండ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు ఫండ్స్ ను రిలీజ్ చేస్తారు. ఈ ఫండ్లో మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్స్ కి కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అంతా మళ్లీ స్టాక్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఓ ఫండ్ ఎప్పుడు తగ్గుతుంది లేదా ఎప్పుడూ పెరుగుతుందో తెలుసుకుని ఆ ఫండ్స్ ని మేనేజ్ చేసి మనకు రిటర్న్స్ ఇస్తారు.
BALENCED FUNDS
బ్యాలెన్స్ ఫండ్ అంటే ఈ క్విటీ + డెట్ కలిపిన ఫండ్స్.
మధ్య వయసులో ఉన్నవాళ్లకు రిస్క్ లేకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే పెద్ద వారు, రిస్క్ తీసుకోలేని వారు బ్యాలెన్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు.
DEBT FUNDS
డెట్ ఫండ్స్ అంటే పెట్టిన పెట్టుబడికి ఢోకా లేకుండా, తక్కువ రిస్క్ తో కొంత రాబడులను అందించే ఫండ్. సాధారణంగా ఫిక్స్డ్ ఇన్ కమ్ ఇచ్చే బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లోనే ఈ డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇందులో ఇన్ కమ్ తక్కువగా ఉంటుంది. క్యాపిటల్ సేఫ్ గా ఉంటుంది. ఇన్వెస్టర్స్ రిస్క్ ఎంత తీసుకోగలరో ఆ వయసును బట్టి నిర్వహణ ఉంటుంది. సంవత్సరానికి మ్యూచువల్ ఫండ్స్ నుంచి 14 లేదా 15 శాతం రిటర్న్స్ వస్తాయి. ఒక్కొక్కసారి 30 శాతం వరకు రిటర్న్స్ వస్తాయి.
స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్.. ఎందులో ఎక్కువ లాభాలు వస్తాయి
Stocks or Mutual Funds.. Which one gives more profit
* స్టాక్స్ లో ఇన్వెస్టర్ నాలెడ్జ్ బట్టి రిటర్న్స్ వస్తాయి. అతను మంచి కంపెనీ స్టాక్స్ ను పిక్ చేసుకుంటే అదృష్టం బాగుంటే ఎక్కువ లాభాలు రావచ్చు లేదంటే మంచి స్టాక్స్ ని పిక్ చేసుకోకపోతే నష్టం కూడా రావచ్చు. స్టాక్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ అనేది మధ్యస్తంగా ఉంటుంది.
* స్టాక్ కొనాలంటే సామాన్య మానవుడు అంత ధర పెట్టి కొనలేరు. అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మనం తక్కువ డబ్బులతో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. అంటే సామాన్య వ్యక్తి నెలకి రూ.500 తో కూడా 30 నుంచి 40 కంపెనీల స్టాక్స్ నికొనవచ్చు.
* డైరక్ట్ గా స్టాక్స్ కొంటే వ్యక్తికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ మ్యూచువల్ ఫండ్‌కి డీ మ్యాట్ అవసరం లేదు.
* మ్యూచువల్ ఫండ్‌లో 30 నుంచి 40 కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు. ఇక్కడ ఏమిటంటే రిస్క్ డైవర్సిఫై అవుతుంది. కానీ స్టాక్స్ లో డబ్బులు పెడితే జీరో అయిపోయే అవకాశం కూడా ఉంది.
* స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి నాలెడ్జ్ అవసరం. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో మంచి డిస్టి బ్యూటర్ ని వెతుక్కుని మంచి ఫండ్స్ కంపెనీలో మంచి స్కీమ్ ని ఆశ్రయిస్తే సరిపోతుంది.
* ప్రతి ఫండ్‌కి ఒక ప్రొఫెషినల్ ఫండ్ మేనేజర్ ఉంటారు. అతను ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ అయి ఉండి చక్కని వ్యూహాలతో లాభాలను పొందేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ రిస్క్ తగ్గిపోతుంది.
మ్యూచువల్ ఫండ్స్ దివాలా తీస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి
Who should be approached in case of mutual fund insolvency
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దివాలా తీసే అవకాశం ఉండదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లాభం వచ్చిన మనకే. నష్టం వచ్చిన మనకే. ఒక వేళ మ్యూచువల్ ఫండ్స్ దివాలా తీసే పరిస్థితి ఏర్పడితే సెబీ దగ్గర అనుమతి తీసుకుని వేరే సంస్థను తెచ్చి ఆ సంస్థకి మేనేజ్ మెంట్ అప్పగించి ఇన్వెస్టర్స్ కూడా తెలియజెప్పి మేనేజ్ మెంట్ మారుతుంది. అందుకే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్ అయ్యింది. అందువలన మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బులు తీసుకుని పారిపోవడం,వెళ్ళిపోవడం గాని జరగదు. ఎక్కువ సేఫ్టీ మన డబ్బులకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ దిశగా ఉంటుంది. మార్కెట్ అనుగుణంగా మన యొక్క రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. అయితే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి. 15నుండి 20 శాతం వరకు కాంపౌండ్ రిటర్న్స్ వస్తాయి.