
which type of mutual funds are profitable
ప్రస్తుతం ఉన్న పొదుపు, పెట్టుబడి సాధనాలకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి అధిక లాభదాయకమైనవని మనం నిత్యం వింటూనే ఉన్నాం. కానీ వీటిలోనూ చాలా రకాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు ఏ రకమైన మ్యూచువల్ ఫండ్ అనేది ఎక్కువ లాభమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
what to know before invest in mutual funds
వీటిని పరిశీలించాలి..
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినపుడు కొన్ని టెక్నికల్ థింగ్స్ ను గుర్తించుకోవాలి.
* మార్కెట్ అస్థిరతను బట్టి ఎంత మూవ్ అవుతుందో అన్నది పరిశీలించాలి. ఎంత తక్కువ మూవ్ అయితే అంత మంచిది.
* స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువ ఉంటే అది అంత మంచి మ్యూచువల్ ఫండ్‌గా పరిగణించవచ్చు.
అంటే అంచనా వేసిన ఆదాయానికి, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి ఎంత తేడా ఉందనేది స్టాండర్డ్ డీవియేషన్ తెలియజేస్తుంది. ఈ తేడా తక్కువగా ఉన్న వాటిని చూసుకోవాలి.
* బెంచ్ మార్క్ ఇండెక్స్ దాటి ఎంత ఎక్కువ రిటర్న్స్ తీసుకొస్తే అంత మంచిది. ఈ విషయాన్ని మనం పెట్టుబడి పెట్టే ముందు పరిశీలించాలి.
* దీనితో పాటు ఖర్చుల నిష్పత్తి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. ఫండ్ నిర్వహణ తదితరాలకు ఈ ఖర్చు ఉంటుంది. ఇది కూడా ఎంత తక్కువ ఉంటే వాటినే ఎంచుకోవాలి.
* ఫండ్ సైజు ఎంత పెద్దగా ఉంటే మనం సేఫ్ గా ఉంటాం. ఫండ్స్ కి CAGR ఎక్కువ ఉండాలి.
how many mutual funds in india
బెస్ట్ ఫండ్స్ ఇవి..
మొత్తం ఇండియాలో 50 ఏఎంసీల నుంచి 19,500 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ప్రతి ఏఎంసీలోనూ అన్నిరకాల ఫండ్స్ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే బాగా పెర్ఫార్మ్ చేస్తాయి.
SBI స్మాల్ క్యాప్ లో 6 వెరైటీస్ ఉంటాయి. గ్రోత్ ఫండ్స్ మూడు, రెగ్యులర్ ఫండ్స్ మూడు.
టాక్స్ సేవర్ ఫండ్ నుంచి Mirae asset ట్యాక్స్ సేవర్ ఉండ్ బాగుంటుంది. అలాగే మిడ్ క్యాప్ నుంచి యాక్సిస్ బాగుంటుంది. ఫోకస్ ఫండ్ నుంచి IIFL Focused fund తీసుకోవచ్చు. ప్లెక్సీ క్యాప్ ఫండ్ నుంచి Parag Parikh తీసుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్ నుంచి SBI OR AXIS చూసుకోవచ్చు. మల్టీ క్యాప్ లో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి వేరు వేరు కేటగిరిల నుంచి వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు.