
జీవితంలో విజయం సాధించడానికి ఒక ఫార్ములా తయారుచేసి అందరికీ సహకరించాలనే ఉద్దేశంతో మొదలై, ప్రచురితమైన పుస్తకం `దింక్ అండ్ గ్రో రిచ్`. ఇందుకోసం ఎంతో మంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని కలిసి వారందరిలో ఉన్న కామన్ పాయింట్స్‌తో రచయిత నెపోలియన్ హిల్ ఆవిష్కరించిన ఒక అద్భుతం ఈ పుస్తకం. జర్నలిస్టు అండ్ రచయిత అయిన నెపోలియన్ హిల్ ఈ పుస్తకంతో ఎంతోమందిని ప్రభావితం చేశారనడంలో సందేహం లేదు. ఎన్నో ఉదాహరణలు, ప్రాక్టికల్ విషయాలతో ఈ పుస్తకం విజయ కాంక్ష రగిలిస్తుంది. ఈ పుస్తకంలో కొన్ని సిద్ధాంతాలను ప్రచురించారు. వీటితో విజయం తథ్యం అని రచయిత చెబుతున్నారు.
ఈ పుస్తకంలో ఒక ఉదహరణను చూద్దాం..
డార్పీ అనే సేల్స్ మేన్ కథ
డార్పీ అంకుల్ గోల్డ్ మైన్ తవ్వడానికి ఒక డ్రిల్లింగ్ మిషన్ కొన్నాడు. మైన్ చేయగా కొంత గోల్డ్ మాత్రమే బయటకు వచ్చింది. తర్వాత ఎంత డ్రిల్ చేసినా ఫలితం రాలేదు. గోల్డ్ ఇంకా లేదనుకొని ఆ ప్రయత్నం ఆపేశారు. దానితో డ్రిల్లింగ్ మిషన్ ని పాత సామానులవాడికి అమ్మేశారు. ఆ పాత సామానులవాడు తెలివిగా ఇంజినీర్ ని తీసుకొని ఆ డ్రిల్లింగ్ మిషన్ తో పాటు ఆ మైన్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ ఇంజినీర్ ఇప్పుడు తవ్విన దగ్గర నుంచి మరో 3 అడుగుల దూరంలో బంగారు నిక్షేపాలున్నాయని చెప్పాడు. అప్పుడు ఆ పాతసామానులవాడు వాటితో కోటీశ్వరుడయ్యాడు. ఇక్కడ డార్ఫీ అంకుల్ చేసిన తప్పు ఏమిటంటే చేసిన పనిని మధ్యలో వదిలివేయడం. ఈ కథ సారాంశం ఏమిటంటే మన ఓటమికి ప్రధాన కారణం చేసిన పనిని మధ్యలో వదిలేయడమే.
strong desire only make you winner
* బలమైన కోరిక..
దహించే కోరిక, నిద్ర పట్టనివ్వని కలలే మనల్ని విజయం వైపు నడిపిస్తాయి. మన కలలను సాధించడంకోసం మన వంతు కనీస కృషి ఉండాలి. దీనికి కొన్ని విధానాలను రచయిత మనకు తెలియజేశారు.
– ముందు మన డ్రీమ్ ను సాధించడానికి ఎంత డబ్బు కావాలో ఫిక్స్ అవ్వాలి.
– ఆ డబ్బును సాధించడానికి ఒకప్రణాళికను సిధ్ధం చేసుకోవాలి.
– మన అనుకున్న డబ్బును సాధించడానికి ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అలాగే ఆ తేదీలోపు మనం అనుకున్న డబ్బును సంపాదించగలగాలి.
– ఇప్పుడు ఒక ప్లాన్ ను తయారుచేసి దాని మీద పనిచేయడం మొదలుపెట్టాలి.
– ఒక పుస్తకంలో ఖచ్చితంగా ఈ నాలుగింటికి జవాబు రాయండి. ఎందుకంటే మన పనికి మార్గం చూపిస్తుంది.
– మన ఏదైతే రాస్తామో దానిని రోజుకు రెండుసార్లు గట్టిగా చదవాలి. ఇలా చేయడం వల్ల మన డ్రీమ్ ను చేరుకోగలుగుతాం.
what is faith
* ఫెయిత్..
మనం చేసే పనిమీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం లేకుండా ఏది సాధించలేమని నెపోలియన్ అంటారు. మనమీద మనకి నమ్మకం కలగాలంటే అది ఒకేసారి కుదరదు. అలాగని అసాధ్యం కాదు. దానిని ఆటో సజిషన్ టెక్నిక్ ద్వారా నెమ్మదిగా పెంపొందించుకోవచ్చని నెపోలియన్ అంటారు.
ఇందుకోసం రచయిత 3 విధానాలను ప్రతిపాదించారు.
– ముందు మనకి కావాల్సిన డబ్బు మన చేతిలో ఉన్నట్లు ఊహించుకోవాలి.
– ఇలా రోజుకు రెండు సార్లు చెయ్యాలి. ఇది సబ్ కాన్సియస్ మైండ్ కి నిజమని అనిపించేవరకు చెయ్యాలి.
– మనకు కావాల్సిన దానిని ఒక కాగితం మీద రాసుకుని మనకి కనిపించే ప్రదేశంలో అతికించాలి. దానిని చూస్తూ మోటివేట్ అవ్వాలి.
* నాలెడ్జ్
డ్రీమ్ ను సాధించడానికి నాలెడ్జ్ చాలా అవసరం.
అందులో జనరల్ నాలెడ్జ్, స్పెసలైజ్డ్ నాలెడ్జ్ ఉంటాయి. మనం విజయం సాధించాలంటే అనవసరమైన విషయాలతో మన మైండ్ ను నింపుకోనక్కర్లేదు. మనం సక్సెస్ అవ్వడానికి ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ ను పెంచుకుంటే చాలు.
* ఇమాజినేషన్
ప్రతి విజయానికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఇమాజినేషన్ ద్వారా పుడుతుంది. ఇమాజినేషన్ మన కలల్ని ఐడియాస్ గా మారుస్తుంది. అదే వాస్తవంగా మారుతుంది.
– సింథటిక్ ఇమేజినేషన్ అంటే పాత ఆలోచనలను మెరుగుపర్చి కొత్త ఆలోచనలుగా మార్చడం.
– క్రియేటివ్ ఇమేజినేషన్ అంటే కొత్త ఆలోచనలతో కొత్త వస్తువులను రూపొందించడం. ఈ క్రియేటివ్ ఇమేజినేషన్ ని మ్యూజిక్ కంపోజర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ వాడుతారు.
– మన మైండ్ కి పదునుపెట్టి మన ఇమేజినేషన్ కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మనకు కొత్త ఆలోచనలు వస్తాయని రచయిత చెబుతున్నారు.
what is organised planing in business
* ఆర్గనైజ్డ్ ప్లానింగ్…
ముందు మన ఆలోచనలతో ఏకీభవించేవారితో, మనల్ని ముందుకు ప్రోత్సహించేవారితో ఒక ప్రణాళికను సిద్దం చేయాలి.
– వాళ్ళు ఇచ్చిన సలహాలతో పోజిటివా లేదా నెగిటివా అని అంచనా వేయాలి.
– మన ప్రణాళిక పూర్తయ్యేవరకు వారితో మనం టచ్ లో ఉండాలి.
– మన గ్రూప్ లో ప్రతి మెంబర్ తో రిలేషన్ మెంటైన్ చేయాలి.
– ప్రతి విజయవంతమైన వ్యక్తికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది.
* మనం చేసే పనులు విఫలం అవ్వడానికి ముఖ్య కారణం మనలో పట్టుదల లేకపోవడం, మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం. మన పర్ఫస్ ఏంటో ఎవ్వరికీ చెప్పకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలని నెపోలియన్ అంటారు.
* మనం ఒక కొత్త పని మొదలుపెట్టినపుడు మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవ్వవచ్చు. అలాంటి సమయంలో మన వల్ల కాదని వదిలేయకుండా ఓర్పు, సహనంతో ముందుకు వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాం.
* మనం మనల్ని ప్రోత్సహించే వ్యక్తులతో ఎక్కువగా ఉండడం వల్ల మన లక్ష్యానికి దగ్గరవుతామని నెపోలియన్ చెబుతున్నారు. మనం ఒంటరిగా సాధించడం కంటే కలిసికట్టుగా పనిచేస్తే రెండింతలు ఎక్కువగా మనం అనుకున్నది సాధించవచ్చు.
* విజయవంతమైన వ్యక్తులలో 40 ఏళ్ళ లోపు వయసుగల వాళ్ళు తక్కువ. వీళ్ళు వాళ్ళలో ఉన్న లవ్ డిజైర్ ని ప్రొడిక్టివ్ ఎనర్జీగా మార్చితే చాలా మంచి ఫలితం పొందగలరు. ఈ ప్రేమ, వ్యామోహం దానిని మనం కంట్రోల్ చేయడం కష్టం. ఆ ఎనర్జీని మన లక్ష్యం వైపు మళ్ళించడానికి సరైన మార్గం మెడిటేషన్.
* మన ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ సబ్ కాన్సియస్ మైండ్‌లో స్టోర్ అవుతాయి. మంచి లేదా చెడుతో సంబంధం లేకుండా ప్రతిఅనుభవం అందులో స్టోర్ అవుతుంది.
* మనలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్స్ మన ప్రమేయం లేకుండా సబ్ కాన్సియస్ లోకి వెళ్ళిపోతాయి. కానీ పాజిటివ్ ఎమోషన్స్ ని సబ్ కాన్సియస్ మైండ్ లోకి పంపాలంటే ముందు తెలుసుకున్న ఆటో సజిషన్ ని ఫాలో అవ్వాలి. మన సబ్ కాన్సియస్ మైండ్ లో ఏదైనా ఒకటే ఉంటుంది. అంతేగానీ రెండు ఒకేదానిలో ఉండవు. మనం ఎప్పుడూ పొజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి.
* మన మెదడుని గ్రహంబెల్ ఒక రేడియో స్టేషన్ తో పోల్చారు. క్రియేటివ్ మైండ్ ఒక రిసీవర్ లా పనిచేస్తుంది. మనకు ఎవరైనా ఏ ఐడియాస్ ఇచ్చినా ఇది రిసీవ్ చేసుకుంటుంది. సబ్ కాన్సియస్ మైండ్ సెండింగ్ స్టేషన్ లా పనిచేస్తుంది.
పైన చెప్పిన ఈ 12 సూత్రాలు ఎవరు పాటిస్తారో వారికే సిక్త్ సెన్స్ అర్థం అవుతుంది. దీనిని మెడిటేషన్ ద్వారా మాత్రమే మనం మాస్టర్ చేయగలం. మనం చేసే పనులో రాబోయే అడ్డంకులను, ఇబ్బందులను ముందుగానే ఊహించి వాటికి సరైన ప్లాన్ సిద్ధం చేసుకోవడమే సిక్త్ సెన్స్అని నెపోలియన్ వివరించారు.