
మనిషి ఆలోచనలను, జీవన విధానాన్ని మార్చేవి పుస్తకాలు అనడంలో సందేహం లేదు. గొప్ప గొప్ప వ్యక్తులు, విజేతలందరూ పుస్తకాలు విపరీతంగా చదివే వారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎంతో మందిని ప్రభావితం చేసి, ధనవంతులను చేసిన కొన్ని గొప్ప పుస్తకాలను ఇక్కడ ఒకసారి మనం పరిశీలిద్దాం. మనం త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ పది పుస్తకాలు చదవాల్సిందే…
* `SECRET OF THE MILLIONAIRE MIND` పుస్తకాన్ని HARV EKAR రచించారు. ఈ పుస్తకంలో ధనవంతులు ఆలోచనలకి, పేద – మధ్య తరగతి వ్యక్తుల ఆలోచనలకి 17 వ్యత్యాసాలను HARV EKAR వివరించారు. సక్సెస్ కు మంచి మార్గం తెలియాలంటే ఈ బుక్ మనం చదవాల్సిందే.
*`RICH DAD AND POOR DAD`. ఈ పుస్తకాన్ని ROBERT KIYOSAKI రచించారు. ధనవంతులు ఇంకా ధనవంతులుగా ఎలా మారుతున్నారు, పేదవారు ఇంకా పేదవారుగా ఎందుకు మిగిలిపోతున్నారు అని ఈ పుస్తకంలో రచయిత చెప్పారు. మనం ఎంత సంపాదించాం అనడం కాదు.. డబ్బు మనకు ఎంత సంపాదించిపెట్టింది అనేది ముఖ్యం. ఆర్థికంగా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నావాళ్ళు తప్పకుండా ఈ పుస్తకం చదివాలి.
* `THE INTELLIGENT INVESTOR` పుస్తకాన్ని BENJAMIN GRAHAM రచించారు. ప్రపంచ ధనవంతుల్లో 4వ స్థానంలో ఉన్న వారన్ బఫెట్ కి గురువు BENJAMIN GRAHAM . ఇతనికి ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే బిరుదు కూడా ఉంది.పెట్టుబడి గురించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవాళ్ళు తప్పక ఈ పుస్తకం చదవాలి.
* `THE MILLIONAIRE NEXT DOOR` పుస్తకంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎవరైతే తాను సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళ నెట్ వర్త్ ఎప్పుడూ పెరగదు. ప్రతి వ్యక్తి తన సక్సెస్ ను తమ పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటారు. కాబట్టి ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. డబ్బు సంపాదించేవారి అలవాట్లకి ఫ్యామిలీ బడ్జెట్ గురించి ఇంకా ఎన్నో విషయాలు ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. థామస్ జే స్టాన్లీ, విలియం డి డేన్కో ఈ పుస్తకాన్ని రచించారు.
* THE RICHEST MAN IN BABYLON పుస్తకాన్ని GEORGE S.CLASON రచించారు.
మనం ఎంత సంపాదిస్తే అందులో 10 శాతం తప్పనిసరిగాసేవ్ చేయాలి. అలాగే అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి. అంతేకాకుండా డబ్బుకి సంబంధించి, బంగారం కి సంబంధించి ఇందులో వివరించారు.
* `MONEY MASTER THE GAME` పుస్తకాన్ని TONY ROBBINS అనే అమెరికన్ రచించారు.
ఈ పుస్తకంలో ఆర్థికంగా మనం స్వతంత్రంగా ఉండాలంటే మనం అనుసరించవలిసిన కొన్ని విషయాలను ఇందులో వివరించారు. మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఈ బుక్ చదవాల్సిందే.
* `మనీపర్సు` ఈ పుస్తకాన్ని మన తెలుగువారైనా వంగా రాజేంద్రప్రసాద్ రచించారు.
ఈ పుస్తకం చదవడం వల్ల ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళకు ఫైనాన్షియల్ మీద బేసిక్ నాలెడ్జ్ ఏర్పడింది. ఈ పుస్తకంలో ఇన్సురెన్స్ గురించి, హౌసింగ్ లోన్ ప్రాముఖ్యత గురించి, పెన్సన్ ఫండ్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇలా ఎన్నో విషయాలను మనకు అర్థమయ్యేలా రాశారు.
* `THE TOTAL MONEY MAKEOVER` పుస్తకాన్ని DAVE RAMSEY రచించారు. ఒక మనిషి అప్పుల నుంచి ఎలాబయటపడాలో, రాబోయే ఆర్థిక ప్రమాదాలు ఎలా గుర్తించాలి, బడ్జెట్ ఎలా సిద్ధం చేసుకోవాలి ఇలాంటి సమస్యలకు ఈ పుస్తకంలో కొన్ని పరిష్కారాలను రచయిత సూచించారు.
* THE MILLIONAIRE FASTLANE పుస్తకాన్ని M.J. DEMARCO రచించారు. ఈ పుస్తకంలో డెమార్కో విజయ రహస్యాలను, త్వరగా ఎలా ధనవంతులు అవ్వగలం అన్న విషయాలను వివరించారు.
* THE 4- HOUR WORK WEEK పుస్తకాన్ని TIMOTHY FERRISS రచించారు. ఈ పుస్తకంలో రచయిత సంవత్సరానికి 40,000 డాలర్లు సంపాదించి, తర్వాత వారానికి 4 గంటలు పనిచేసి నెలకు 40,000 డాలర్లు సంపాదించాడు. అది ఎలా సంపాదించాడో తెలియాలంటే మనం ఈ పుస్తకం చదవాలి.
స్టాక్ మార్కెట్లో బిగనర్స్ కి ఉపయోగపడే పుస్తకాలు
Useful books for beginners in stock market
స్టాక్ మార్కెట్లు, పర్సనల్ ఫైనాన్, మనీ రిలేటడ్ గా ఎటువంటి అవగాహన లేనటువంటి వారి కచ్చితంగా కొన్ని పుస్తకాలు చదవాలి. మార్కెట్లో మనం ఎక్స్‌పర్ట్ కావాలంటే ఈ పుస్తకాలు చదవకుండా ముందడుగు వేయలేం. ఫినాన్సియల్ నాలె డ్జ్ కోసం కొన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ కోసం మాత్రం ఈ పుస్తకాలు తప్పనిసరి.
OPTIONS as a STRATEGIC INVESTMENT
LAWRENCE G. MCMILLAN రచించిన ఈ పుస్తకం రేటు దాదాపు రూ. 2వేలు పైమాటే. ఈ పుస్తకంలో ఆప్షన్ రిలేటెడ్ గా తెలుసుకోవలిసిన కంటెంట్ అంతా ఉంటుంది. ఇందులో ఆప్షన్ స్ట్రాటజీస్, కాల్ బయింగ్ స్ట్రాటజీస్, సెల్లింగ్ రిలేటెడ్ గా టోటల్ సిగ్మెంట్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్స్ స్ట్రాటజీస్ అన్నీ కవర్ చేశారు రచయిత. ఈ పుస్తకంలో 1070 పేజీలు ఉంటాయి. బిగినర్స్, కేవలం ఆప్షన్ సెల్లింగ్ చేద్దామనుకున్నావాళ్ళ కు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకంలో ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఆప్షన్ సెల్లింగ్ ని, ఆప్షన్ స్ట్రాటజీస్ ని కవర్ చేస్తున్న పుస్తకం ఇది.
STOCK MARKET WIZARDS
మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ ట్రేడర్ల ఇంటర్వ్యూ లను ఈ పుస్తకంలో ఉంచారు రచయిత JACK D. SCHWAGER. ఇందులో స్ట్రాటజీస్ ఉండవు. ఎక్కడ బై చెయ్యాలో, ఎక్కడ సెల్ చెయ్యాలో ఉండదు. స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో చేసిన ఇంటర్ వ్యూస్ అన్నీ ఇందులో ఉంటాయి. స్ట్రాటజీస్ ఎక్కడ నుంచైనా తెలుసుకోవచ్చు గాని, ఒకరి ఎక్స్ పీరియన్స్ ని తెలుసుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం. ట్రేడర్స్ స్టాక్ మార్కెట్ ని ఏ వ్యూలో చూస్తున్నారో అది ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్ గురించి చదవవలిసిన పుస్తకాల్లో ఈ బుక్ టాప్ లో ఉంటుంది. ఈ పుస్తకంను చదవడం స్టార్ట్ చేస్తే ముందుగానే స్టాక్ మార్కెట్లో ఉన్నవారు మైండ్ సెట్ మనకి అర్థమవుతుంది. అప్పుడు మనకి మనం నేర్చుకోవలిసినది ఎంత ఉంది అని మనకి తెలుస్తుంది. ఈ పుస్తకం మనం స్టాక్ మార్కెట్లో స్టేబుల్ గా ఉండడానికి సహాయపడుతుంది.
TRADING in the ZONE
స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ ముఖ్యం అంటారు కాని దీనిలో సైకాలజీతో పాటు కన్సిస్టెన్స్ కూడా చాలా ముఖ్యం అని అంటాడు MARK DOUGLAS. ఈ రోజు మనం నేర్చుకున్న స్ట్రాటజీ తర్వాత రోజూ మార్కెట్లో అప్లై చెయ్యడానికి, అదే స్ట్రాటజీని రిపీటెడ్ గా పేపర్ ట్రేడ్ చేసి, స్టాక్ మార్కెట్లో కొన్ని సంవత్సరాల తర్వాత అప్లై చెయ్యడానికి తేడా ఉంటుంది. మార్కెట్ కండిషన్ ఏ టైమ్ లో ఎలా వర్కౌట్ అవుతుందో అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఎక్కువ లాస్ అవుతున్నామో, ఎప్పుడు ఎక్కువ లాభాలు వస్తాయో అర్థమవుతుంది. ఎక్కువ లాస్ అయినపుడు మన మైండ్ సెట్ ఎలా ఉంది స్టాప్ లాస్ ని రిమూవ్ చేస్తున్నానా లేదా అనేది అర్థమవుతుంది. మనం స్టాక్ మార్కెట్లో తప్పు చేసినపుడు ఏం జరిగింది ఇవ్ననీ కూడా స్ట్రాటజీని ఫాలో అయితే అర్థమవుతుంది.
THE DISCIPLINED TRADER
ఈ పుస్తకం మనల్ని స్టాక్ మార్కెట్లో మంచి ట్రేడర్ గా చేస్తుంది. MARK DOUGLAS చెప్పిన ఎన్నో సత్యాలు మనల్ని ట్రేడింగ్‌లో నిపుణుడిగా మారుస్తాయి. ముందుగానే స్టాక్ మార్కెట్లోకి వచ్చినవాళ్ళు, ఎదుగుతున్న వారు ఇది చదివి చక్కగా అర్థం చేసుకోగలిగితే మనం చేస్తున్న తప్పులు తెలుస్తాయి. స్టాక్ మార్కెట్ ని ఎలా చూడాలి అనేది ఈ పుస్తకం నేర్పిస్తుంది. ఈ పుస్తకం ట్రేడర్ సైకాలజీని స్టేబుల్ చెయ్యడానికి, మనల్ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.
How I Made $2,000,000 in the STOCK MARKET
స్వింగ్ ట్రేడింగ్ చెయ్యాలనుకున్నవాళ్ళకి స్ట్రాటజీ పరంగా, సైకాలజీ పరంగానూ ఉపయోగపడే పుస్తకం ఇది. NICOLAS DARVAS తన నిజ జీవితంలో స్టాక్ మార్కెట్‌లో పొందిన లాభాలు, నేర్చుకున్న అనుభవాలను ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఇందులో ముఖ్యంగా చెప్పవలిసినది స్టాక్ మార్కెట్ లో ఎవరి దగ్గర టిప్స్ తీసుకోవద్దని, ఏ స్టాక్ ని పెట్ లా ఉంచుకోవద్దని, ఎటాచ్ అవ్వకూడదని.
స్టాక్‌తో ఎటాచ్ అయితే మనం భావోద్వేగాలకు గురవుతామని, అది మనల్ని ట్రేడింగ్ లో మిస్టెక్ చేయడానికి అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క ట్రేడర్ తెలుసుకుంటూ ఎప్పుడూ ఒక స్టాక్ ని సెల్ చెయ్యాలి మళ్ళీ ఎప్పుడు స్టాక్ లోకి ఎంట్రీ తీసుకుని కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ ని ఎలా సంపాదించుకోవాలో ఈ పుస్తకంలో వివరించారు. మనం టెక్నికల్ ఎనాల్సిస్ రిలేటెడ్ గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ డ్ మొత్తం కూడా ఒక పుస్తకంలో పొందవచ్చు.