Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold?

Posted on 07/10/2025 By admin No Comments on డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold?

బంగారం అంటే ఎప్పటికీ భద్రమైన పెట్టుబడి అని భావించే భారతీయులు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే డిజిట‌ల్ గోల్డ్‌. డిజిట‌ల్ యుగంలో డిజిట‌ల్ బంగారం అనే కొత్త పెట్టుబడి పద్ధతి రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతోంది. గ్రాములు కాకుండా “రూ. 100”తోనూ బంగారం కొనుగోలు చేసే సౌకర్యం ఉండటమే ప్రధాన ఆకర్షణగా మారింది. బంగారం ధరలు ఎగబాకుతుండటంతో పెట్టుబడిదారులు ఇప్పుడు డిజిటల్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. Paytm, PhonePe, Google Pay వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు, అమ్మకం సులభమైంది. భౌతిక బంగారం మాదిరిగానే ఇది కూడా 24 క్యారెట్ల బంగారమే . దీర్ఘకాలిక పెట్టుబడికి డిజిటల్ గోల్డ్ మంచి ప్రత్యామ్నాయం. కానీ పూర్తి భద్రతా ప్రమాణాలు ఉన్న సంస్థల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. అని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న మొత్తాలతో పెట్టుబడి.. Investment with Small Amounts

డిజిటల్ గోల్డ్‌ ద్వారా రూ.100 నుంచే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సౌకర్యం యువతరాన్ని ఆకర్షిస్తోంది. Paytm, PhonePe, Google Pay వంటి యాప్స్‌ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం అని కంపెనీలు చెబుతున్నాయి. చిన్న మొత్తాలతో పెట్టుబడి చేసే అవకాశం
ఉండ‌గా.. ఇది భద్రతతో కూడిన నిల్వ. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలుంది.

ఎందుకింత ఆకర్షణ..?..Why Is It So Attractive?

బంగారం ధరలు పెరుగుతుండటంతో, భౌతిక బంగారం భద్రతా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఇప్పుడు డిజిటల్ మార్గం వైపు మొగ్గుతున్నారు. భౌతిక నిల్వ అవసరం లేకుండా, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం ఉండటం ప్రధాన ఆకర్షణగా మారింది. డిజిటల్ గోల్డ్ పెట్టుబడులకు మంచి ఆప్షన్‌. కానీ రిజిస్టర్డ్‌ కంపెనీలు, నమ్మకమైన యాప్స్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు ముందు ఛార్జీలు, లాక్‌-ఇన్‌ పీరియడ్‌, భౌతిక మార్పిడి సదుపాయాలు తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద యాప్స్‌, తెలియని లింకులు ద్వారా కొనుగోలు చేయవద్దని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. RBI నియంత్రణలో లేని ప్లాట్‌ఫార్మ్‌లను దూరంగా ఉండ‌డం మంచిది.

నష్టాలు / ప్రమాదాలు Losses / Risks

వడ్డీ లాభాలు లేవు: డిజిటల్ గోల్డ్‌ వడ్డీ లేదా డివిడెండ్‌ ఇవ్వదు. నిల్వ ఉన్నంత కాలం ఆదాయం ఉండదు.

అదనపు ఛార్జీలు: కొన్ని ప్లాట్‌ఫార్మ్‌లు నిల్వ, మార్పిడి, డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తాయి.

RBI నియంత్రణలో లేదు: ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌పై నేరుగా RBI పర్యవేక్షణ లేదు. కాబట్టి నమ్మకమైన కంపెనీలను మాత్రమే ఎంచుకోవాలి.

మోసాల ప్రమాదం: అధికారిక లైసెన్స్‌ లేని యాప్స్‌ ద్వారా కొనుగోలు చేస్తే మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

పన్నులు: విక్రయించినప్పుడు క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వర్తించే అవకాశం ఉంది.

మ్యూచువ‌ల్‌ ఫండ్లు అందించే గోల్డ్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లు
Gold Funds and ETFs Offered by Mutual Funds

– మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నడిపే ఈ స్కీములు ప్రధానంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిదారు నేరుగా ఈటీఎఫ్‌ కొనకపోయినా, గోల్డ్‌ ఫండ్‌ ద్వారా పరోక్షంగా బంగారంలో పెట్టుబడి పెట్టినట్టే. చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు, SIP రూపంలోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

– గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అంటే స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన బంగారం ఆధారిత ఫండ్లు. ఇవి ఒక గ్రాము లేదా పది గ్రాముల బంగారం విలువ ఆధారంగా ఉంటాయి. పెట్టుబడిదారు డీమాట్‌ ఖాతా ద్వారా వీటిని కొనుగోలు, విక్రయాలు చేయవచ్చు. స్టాక్‌ల మాదిరిగానే వీటికి మార్కెట్‌ ధరలు మారుతుంటాయి.

– భౌతిక బంగారం కంటే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్లు ఎక్కువ పారదర్శకత కలిగినవి. SIP రూపంలో చిన్న మొత్తాలతో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి అనువైనవి.

ప్రయోజనాలు…Benefits

భద్రత: భౌతిక బంగారం లేనందున దొంగతనం, నిల్వ సమస్యలు ఉండవు.
పారదర్శకత: మార్కెట్‌ ధరల ఆధారంగా విలువ నిర్ణయమవుతుంది.
లిక్విడిటీ: మార్కెట్‌లో ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు: దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తే ట్యాక్స్‌ బెనిఫిట్లు లభిస్తాయి.
SIP సౌకర్యం: గోల్డ్‌ ఫండ్లలో నెలనెలా పెట్టుబడి చేసే అవకాశం.

లోపాలు…Drawbacks

ఈటీఎఫ్‌ల కోసం డీమాట్‌ ఖాతా తప్పనిసరి.
మార్కెట్‌ ధరలు మారుతుండటంతో లాభనష్టాలు ఉంటాయి.
ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజులు, ఎక్స్పెన్స్‌ రేషియో ఉంటాయి.
భౌతిక బంగారం పొందాలంటే విక్రయం తప్పదని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..Precautions to Take

ఇప్పటి కాలంలో బంగారం కొనాలంటే బంగారు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో క్లిక్‌ చేస్తే బంగారం మీ ఖాతాలోకి వ‌స్తుంది. కానీ ఈ డిజిటల్ గోల్డ్ పెట్టుబడి నిజంగా ఎంతవరకు పెట్టుబడిదారులకు శ్రేయస్కరమో తెలుసుకోవడం ఇప్పుడు అవసరం.ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో నమ్మకమైన ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రమే డిజిట‌ల్ బంగారం కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ గోల్డ్‌ను భౌతిక రూపంలో మార్చుకునే అవకాశాలు, నిల్వ గడువు, ఛార్జీలు వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో అనేక యాప్‌లు ఉన్నా, అన్ని విశ్వసనీయమవు. రిజిస్టర్డ్‌ కంపెనీలు, గుర్తింపు పొందిన ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారానే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన బంగారం ఎక్కడ నిల్వవుంటుందో, ఎవరే కస్టోడియన్లో తెలుసుకోవాలి. సాధారణంగా MMTC-PAMP, Augmont వంటి సంస్థలు ఉంటాయి. డిజిటల్ గోల్డ్‌ను భౌతిక బంగారంగా మార్చుకుంటే అదనపు ఛార్జీలు ఉండొచ్చు. వాటిని ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు నిర్దిష్ట కాలానికే నిల్వ సదుపాయం ఇస్తాయి. ఆ గడువు ముగిసేలోపు అమ్మకాలు లేదా మార్పిడి చేయాలి. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌పై RBI నేరుగా పర్యవేక్షణ చేయడం లేదు. కాబట్టి పెట్టుబడి చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

 

497
FEATURE NEWS Tags:.Precautions to Take, .Why Is It So Attractive?, Benefits, Drawbacks, Gold Funds and ETFs Offered by Mutual Funds, Investment with Small Amounts, Losses / Risks

Post navigation

Previous Post: మళ్లీ పెరిగిన‌ బంగారం ధర …Gold Prices Rise Again
Next Post: సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score

Related Posts

  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేయక్కర్లేదు.. కెమెరా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. No Need to Scan QR: Easy UPI Payments Without Camera FEATURE NEWS
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources? FEATURE NEWS
  • పశ్చిమాసియాలో మంట‌లు.. ప్రపంచమంతటా ప్రకంపనలు.. Blazing West Asia, Tremors Across the World FEATURE NEWS
  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS
  • భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఒక్క రోజులో రూ.6 వేలు త‌గ్గింపు.. Gold Prices Plunge Sharply ..Price Drops ₹6,000 in a Single Day FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్స్ vs స్టాక్స్… ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్? ETF vs Index Funds vs Stocks… Which is the Best Investment? INVESTMENTS
  • Say No to bank deposits బ్యాంకు డిపాజిట్లు వ‌ద్దు FINICAL PLANNING
  • బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips! FINICAL PLANNING
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • ఎలాంటి మ్యూచువ‌ల్ ఫండ్స్ లాభ‌దాయ‌కం..? MUTUAL FUNDS
  • సెన్సెక్స్, నిఫ్టీ అంటే..? FEATURE NEWS
  • అన్‌క్లెయిమ్డ్ విలువ‌ రూ.73,000 కోట్లు .. మ‌రిచిపోయిన ఆ సొమ్మును తిరిగి ఎలా పొందాలోతెలుసా? Unclaimed Amount ₹73,000 Crore… Do You Know How to Recover Your Forgotten Money? FEATURE NEWS
  • మోటారు బీమా పాలసీ తీసుకున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి! Have You Taken a Motor Insurance Policy? Then Know These Important Points! INSURANCE

Copyright © 2026.

Powered by PressBook News Dark theme