
do link pan with aadhar
మార్చి 31 వరకు పాన్ కార్డు ఆధార్ కార్డ్ అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగిసిన తర్వాత ఎవరైనా లింక్ చేయాలనుకుంటే తప్పనిసరిగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని ఆర్థిక లావాదేవీలు పాన్‌కార్డు ఆధారంగానే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానం కాకుంటే ఏ లావాదేవీలు చేయడానికి వీలుండదు.
వచ్చే ఏడాది వరకు గడువు..
అయితే ఇలాంటి సందర్భంలో పాన్ కార్డు చెల్లుబాటు అయ్యే గడువు 2023 మార్చి 31 వరకు పొడిగించింది.
మనం ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 1 2022 నుంచి జరిమానా మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2022 మార్చి 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల్లోగా పాన్ – ఆధార్ అనుసంధానికి రూ.500 జరిమానా పడుతుంది. మూడు నెలలు దాటితే రూ.1000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. మనం మార్చి 31,2023 లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే అప్పుడు మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాంటి సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేరు. ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.