
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎల్.ఐ.సీ)లో మనలో చాలా మంది బీమా పాలసీలు తీసుకునే ఉంటారు. అందరికీ తెలిసిన అతి నమ్మకమైన సంస్థ కావడంతో అందరం పాలసీలు కలిగి ఉంటాం. కానీ ఆ పాలసీని క్లెయిం తీసుకునేటప్పుడు మాత్రం మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం. సరైన సమాచారం, సహకారం లేకపోవడంతో ఆ ప్రయోజనం పొందలేము. ఒక వేళ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ డెత్ క్లెయిం తీసుకునే విధానం ఏమిటో ఓ సారి చూద్దాం.
process for death claim application
ఇలా చేయాలి..
పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బంధువులుగాని, స్నేహితులు గాని ముందు LIC ఆఫీసుకి వెళ్ళి డెత్ ఇంటిమేషన్ ఇవ్వాలి.
* LIC పాలసీ నెంబర్ ను చూపించనట్లయితే ఇది ఎర్లీ క్లెయిమ్ లేదా నాన్ ఎర్లీ క్లెయిమ్ అని చూస్తారు.
* ఎర్లీ క్లెయిమ్ అంటే 3సంవత్సరాలు ప్రీమియం కట్టి 3 సంవత్సరాలలోపు ఆ వ్యక్తి చనిపోతే దానిని ఎర్లీ క్లెయిమ్ అంటారు. 3 సంవత్సరాలు ప్రీమియం కట్టీసిన తర్వాత చనిపోతే నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటారు.
* 3 సంవత్సరాలు ప్రీమియం పూర్తిగా పే చేస్తే దానికి ఎటువంటి ఎంక్వైరీ ఉండదు.
నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి ఒరిజనల్ డెత్ సర్టిఫికేట్, చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు, కేవలం ఈ ఆధారాలతో మనకు తెలిసిన ఏజెంట్ ద్వారా ఆఫీసుకి ఈ ఆధారాలు సబ్ మిట్ చేస్తే 1 రోజు నుంచి నెలలోపు మనకు క్లెయిమ్ సెటిల్ చేసేస్తారు.
ఈ వివరాలు తప్పనిసరి
* ఎర్లీ క్లెయిమ్ అయితే ఆ వ్యక్తి సహజంగా చనిపోయారా లేదా యాక్సిడెంటలా అని ముందు తెలియజేయాలి.
* ఆ వ్యక్తికి సంబందించినవారు కాకుండా సన్నిహితులు మరెవరైనా సరి `చనిపోయినప్పటినుంచి దహన సంస్కారాలు పూర్తయ్యినంతవరకు ఉన్నాను` అని వివరాలను నింపి సాక్షి సంతకం పెట్టి, నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు అందజేయాలి.
* ఒక వేళ ఆసుపత్రిలో చనిపోతే హాస్పిటలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
* ఇవన్నీఏజెంట్ ద్వారా సబ్ మిట్ చేస్తే ఒక LIC ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తారు. ఇది నిజమా కాదా పరిశీలించాక, నిజమని తేలితే క్లెయిమ్ అడ్మిట్ వస్తుంది. క్లెయిమ్ అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఫామ్ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ ఫామ్ ని ఆఫీసులో సబ్ మిట్ చేస్తే వెంటనే డబ్బులు అకౌంట్ లో జమ అవుతాయి.
* నామినీగా ఉన్న వ్యక్తి రాలేక పోతే కుటుంబ సభ్యులెవరైనా ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకువచ్చి అందించాల్సి ఉంటుంది.
మంచి ఇన్ఫో.. అందరూ తెలుసుకోవాల్సిన విషయం