
elon musk with auto pilot
* డ్రైవర్ లేని కార్ల తయారీకి ఏర్పాట్లు
వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచంలో అత్యంత ప్రతిభాశీలిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ లాంటి అద్భుతాల తర్వాత ఈవీ వెహికల్స్‌తో సత్తాచాటి ప్రపంచ ధనవంతుడయ్యాడు ఈ మేధావి. ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ఇన్నోవేషన్‌తో ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నాడు.
అంతా పెట్రోల్, డీజిల్ వాహనాల మార్కెట్లపై దృష్టి పెట్టినపుడు మస్క్ మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టారు. అందరూ ఈవీల పేరు చెబుతుంటే తాను మరింత అడ్వాన్స్ గా ఆలోచించి డ్రైవర్ లేకుండా ఆటో పైలెట్ మోడ్ లో నడిచే కార్లను తెస్తానంటున్నారు. టెస్లా కంపెనీ తాజాగా తన ఆటో పైలెట్ కాన్సెప్ట్ కి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసింది.
డ్రోన్ వీడియోతో సంచలనం
- ఎలన్ మస్క్ ఎప్పటినుంచో డ్రైవర్ లేకుండా ఆటో పైలెట్ కార్లను అందుబాటులోకి తేవడం తన లక్ష్యం మని అంటున్నారు. అయితే దీనిపై కొన్ని దేశాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. మరోవైపు ఆటో పైలెట్ లో కొన్ని అడ్వాన్స్ మెంట్స్ చేయాల్సి ఉందంటూ ఎలన్ మస్క్ 6 నెలల కిందట ప్రకటించారు. గతవారం బెర్లిన్ లో తొలి గిగా ఫ్యాక్టరీని ఎలన్ మస్క్ ప్రారంభించారు. ఇక్కడ పెద్ద ఎత్తున 3 మోడల్ కార్లు తయారవుతున్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీ ఎంత పెద్దదో అక్కడ కార్లు ఎలా తయారవుతున్నాయో తెలియజేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో టెస్లా రిలీజ్ చేసింది. గిగా ఫ్యాక్టరీలో కార్ల తయారీలో భాగంగా మిషన్లు పనుల్లో నిమగ్నమై ఉండగా డ్రోన్ షూట్ చేసింది. పని జరిగినపుడు ఏదైనా మిషన్ అడ్డు వస్తే ఆగిపోవడం, పక్కకి తొలగగానే ముందుకు వెళ్ళడం, అవసరాన్ని బట్టి కుడి ఎడమ, పైనా కిందకు డైరెక్షన్ మార్చుకుంటూ గిగా ఫ్యాక్టరీని మొత్తం ఈ డ్రోన్ షూట్ చేయడంతో తన ఆటోపైలట్ మోడ్ పనితీరును మస్క్ ఈ డ్రోన్లో ఇన్‌బిల్ట్ చేసినట్టు తెలియజేశారు.