ఈ కామర్స్ డెలివరీలపై ఫిర్యాదు చేయండి
how to compliant against e com deliveries
ఇటీవల ఆన్‌లైన్‌లో వస్తువులు కొనే సంస్కృతి బాగా పెరిగిపోయింది. ప్రతి చిన్న వస్తువును ఈ కామర్స్ సైట్‌లో కొనుగోలు చేయడం అందరికీ అలవాటై పోయింది. అందులో ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండడంతో మరింతగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.
కొవిడ్ తరువాత ఇది మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఆన్ లైన్ లో ఫోన్ బుక్ చేస్తే వేరే వస్తువులు, చెత్త రావడం మనం గమనిస్తుంటాం. ఇలాంటి సమయంలో మీరు మోసపోయారని గుర్తిస్తే ఫిర్యాదు చేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
* వివిధ రకాల సంస్థలు తమ వస్తువులను అమ్ముకునేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తుంటారు. కోట్లాది మంది వినియోగదారులు, విక్రయదారులు ఇక్కడ కలుసుకుని తమకు కావాల్సిన వాటిని అమ్ముకుంటారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్‌డీల్, మిత్రా తదితర ఈ కామర్స్ సైట్లు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను అందిపుచ్చుకునే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
what precations take before order a product in online
* ఇక్కడ అమ్మే వస్తువులకు, ఈ కామర్స్ సైట్‌లకు ఎటువంటి సంబంధం లేదు.
* ఈ-కామర్స్ సంస్థలకు చెందిన వస్తువులైతే ప్రొడక్ట్ పక్కన అమెజాన్ పుల్ ఫిల్, ఫ్లిప్ కార్ట్ ఎస్యూర్డ్ పేర్లు ఉంటాయి.
* ప్రొడక్ట్ కొనేముందు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి.
* మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ ను ఓపెన్ చేసే ముందు వీడియో తీసి పెట్టుకుంటే మీకు ఒక ఆధారంగా ఉంటుంది.
* డెలీవరీలో వచ్చిన వస్తువు పనిచేయకపోయినా, బాగోలేకపోయినా వెంటనే దానిని రిటర్న్ చేస్తే, సంబంధిత సెల్లర్ దానిని రీప్లేస్ చేస్తారు. లేదంటే మనీ రిటర్న్ చేస్తారు.
* ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
* సంస్థ నుంచి ఎటువంటి స్పందన సరిగా లేదంటే కోర్టును ఆశ్రయించవచ్చు.
sections in consumer protection act
* కన్జ్యూమర్ ప్రొటక్ట్ యాక్ట్-2019 కింద సెక్షన్ లు ఉంటాయి. ఆ సెక్షన్ లలో మీరు ఏ సెక్షన్ బాధితులో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, బ్యాంక్ ట్రాన్సక్షన్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఇలాంటి వాటిలో మీరు మోసపోతే ఫిర్యాదు చేసుకోవచ్చు.
phone number to complain against ecom frauds
https:///consumerhelpline.gov.in/.//లో లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-4000,14404 కి ఫోన్ చేయవచ్చు.
* 8130009809 నంబర్‌కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. ఎన్ సీహెచ్, యూఎంఏఎన్ జీ యాప్ లో ఫిర్యాదు చేయోచ్చు.
* https;//icrpc.org/, http:// voxya.com/, https://www.onlinelegalindia.com/ కి ఫిర్యాదు చేయోచ్చు. వీళ్ళు మాత్రం ఫిర్యాదును బట్టి కంప్లెయింట్ తీసుకుంటారు.
Leave a Reply