మ్యూచువల్ ఫండ్స్ మనకు బాగా లాభాలను ఇస్తాయని తెలుసు. కానీ ఈటీఎఫ్‌లు కూడా దానికి ధీటుగా లాభాలను ఇస్తున్నాయన్న విషయం గుర్తించాలి. ETF (EXCHANGE TRADER FUND) ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రెండింటికీ ఉన్న తేడా, ప్రయోజనాలు ఓ సారి తెలుసుకుందాం.
difference between mutual funds and ETFs
మ్యూచువల్ ఫండ్స్ v/s ఈటీఎఫ్:
* మ్యూచువల్ ఫండ్ అంటే పెట్టుబడిదారుల నుంచి సేకరించిన, ప్రకటించిన పెట్టుబడి మొత్తాన్ని స్టాక్స్ లో గాని, బాండ్లు, ఇతర సెక్యూరిటీలలో సామూహిక పెట్టుబడి పెట్టడమే.
* మ్యూచువల్ ఫండ్స్ కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. నికర లాభం లేదా నష్టం పెట్టుబడిదారులకు ఒకేలాగా ఇస్తారు. మ్యూచువల్ ఫండ్లో ఫీజులు, ఖర్చులు ఉంటాయి.
* ETF లో ఫీజులు తక్కువ, ఖర్చులు కూడా తక్కువే.
* ఈటీఎఫ్ అనేది ఇండెక్స్ మీద పనిచేస్తుంది. డబ్బులు కావాలనుకున్నప్పుడు లేదా ప్రాఫిట్ బుక్ చెయ్యాలనుకున్నుపుడు ఓపెన్ మార్కెట్ లో అమ్మేసి మళ్ళీ ఓపెన్ మార్కెట్లో కొనవచ్చు.
* మనం ఒకే సారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ పెరిగినపుడు అమ్మేయవచ్చు, మార్కెట్ పెరిగినపుడు మళ్ళీ కొనవచ్చు, లేదా ఎస్ఐపీ ద్వారా కొనుక్కోవచ్చు. ఇవన్నీ ETF లో ఉన్నాయి.
* మనకు అత్యవసర పరిస్థితుల్లో రుణం కావాలనుకున్నపుడు ETFలో తక్కువ వడ్డీతో లోన్ తీసుకోవచ్చు. ఈ అవకాశం మ్యూచువల్ ఫండ్స్ కి లేదు.
* ETF అనేది ఇండెక్స్ పై ఆధార పడి ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ పెరిగినపుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అన్ని బ్రోకరేజ్ కంపెనీల్లో మార్కెట్ తగ్గిపోయినా మనకు లోన్ ఇస్తారు. ఆ లోన్ ఆ షేర్లను కొనడానికి మాత్రమే. ఇది ఎక్స్చేంజీ, సెబీ కలిసి ఒక పర్సంటేజ్ ను డిసైడ్ చేస్తాయి.
వీటిని గమనించండి..
స్టాక్ మార్కెట్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. దీనికి సంబంధించి మనకు అవగాహన అవసరం.
ముందు మనం స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా స్టడీ చెయ్యాలి.
స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మనం లాభాలు పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడికి ఎటువంటి అవగాహన లేకపోయినా పర్వాలేదు. కానీ ఈటీఎఫ్‌కు కనీస అవగాహన తప్పనిసరి. మార్కెట్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్‌కు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి.