P/E RATIO పనేంటి..?
what is PE ratio
ఒక షేర్ ఒరిజినల్ ప్రైస్‌కి మార్కెట్‌లో అది ట్రేడవుతున్న ప్రైస్‌కి ఉన్న డిఫరెన్స్ చెప్పేదే పీఈ రేషియో.. కంపెనీ ఇస్తున్న ఎర్నింగ్‌కి దాని ప్రైస్‌కి ఉన్న సంబంధం ఇది చూపుతుంది. కాబట్టి దీన్ని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటాం. ఆ స్టాక్ కు ఉన్న డిమాండ్ పై ఈ రేషియో ఆధారపడుతుంది.
ఉదాహరణకు పది రూపాయల లాభాలను ఇస్తున్న కంపెనీ షేర్‌ని మనం మార్కెట్‌లో వంద రూపాయలకు కొంటున్నామనుకుందాం. అంటే ఆ షేర్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది అని అర్థం.. ఆ కంపెనీ భవిష్యత్తులో మరిన్ని లాభాలను ఇస్తుందనే అంచనాతో ఇన్వెస్టర్లు ఆ షేర్‌ని ఎక్కువ ధర ఇచ్చి మరీ కొనుక్కుంటారు. అందు వల్ల ఆ షేర్ పీఈరేషియో అమాంతం పెరుగుతుంది. అంటే ఇలా పీఈ రేషియో ఎక్కువగా ఉంటే చాలా వరకు మంచిదే.. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇది సరైన ప్రామాణికం కాదు. పీఈ రేషియో మరీ ఎక్కువ ఉన్నా ఆ స్టాక్ కొనడానికి అనర్హమవుతుంది. అందుకే ఆ సెక్టార్‌లోని ఇతర కంపెనీలతో పోల్చి పీఈ రేషియోను లెక్కలోకి తీసుకుంటారు. ఈ రేషియో ఆ కంపెనీల వెబ్‌సైటలో దొరుకుతుంది. మిగిలిన అన్ని వెబ్‌సైల్‌లను పరిశీలించి పీర్ కాంపేరిజన్ చేయాలి.
what is the use of PE ratio
ఫండ్ మెంటల్స్ ని ఆధారంగా చేసుకుని ఈ షేర్లు కొనేవారికి P/E RATIO చాలా ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక సెక్టారుకి చెందిన ఏదైనా రెండు కంపెనీలలో ఒక దానిని ఎంచుకోవడానికి P/E RATIO పరిశీలిస్తాం.
how to calculate PE ratio
P/E RATIO ను లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంటుంది.
Current Market Price Of The Share/Earning Per Share.
ముందుగా Earning Per Share గురించి తెలుసుకుందాం. ఒక కంపెనీ నికర ఆదాయం ఎంత..? అలాగే ఆ కంపెనీ ఎన్ని షేర్లను ఇష్యూ చేసింది లేదా ఆ కంపెనీ ఎన్ని షేర్లు మార్కెట్ లో ఉన్నాయి అనేది. ఈ వివరాలు కంపెనీ బ్యాలెన్స్ షీటులో గాని లేదా ఆ కంపెనీ వెబ్ సైట్ లో గాని లభిస్తాయి.
Leave a Reply