మ్యూచువల్ ఫండ్ డౌన్ అయితే ఎగ్జిట్ కావొద్దు..
never exit from mutual fund if market downs
* లాంగ్ టైం లోనే ప్రాఫిట్ * అప్ అండ్ డౌన్ సాధారణమే
మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టైమ్ లోనే గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్ టైంలో ఎక్కవ కరెక్షన్‌లు ఉంటాయి కాబట్టి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఈ కరెక్షన్స్ లో మార్కెట్ `అప్’ అయినపుడు ఎంటర్ అవ్వాలనుకున్నవాళ్ళకి, మార్కెట్ `డౌన్’ అయినపుడు ఎగ్జిట్ అవుతామనుకున్నవాళ్ళకి రిటర్న్స్ రావు. గత 20 సంవత్సారాల నుంచి డేటా ప్రకారం కరెక్షన్స్ తో ఉన్నవాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. మనం ఇన్వెస్ట్ చేసిన తరువాత ఎంతగా కరెక్షన్ వస్తే అంత ప్రాఫిట్ వస్తుంది అని అర్థం. అంతే కానీ కరెక్షన్ వచ్చనప్పడు తీసేద్దాం అనే ఆలోచనే నష్టానికి గురి చేస్తుంది.
* మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తారు. కొంతమంది మార్కెట్ ఇంక్రీజ్ అయితే ఎంటర్ అవ్వడానికి, మార్కెట్ డిక్రీజ్ అయితే ఎక్జిట్ అవ్వడానికి చూస్తారు. కొంతమంది మార్కెట్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటపుడు టైమ్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్కెట్ గ్రాఫ్ ని మనం చూస్తే మార్కెట్ అప్ అండ్ డౌన్ లేకుండా తిన్నగా ఉంటే మార్కెట్ ఏమి రిటర్న్స్ ఇవ్వట్లేదు అని అర్థం.
* మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టైమ్ లో గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ గ్రోత్ సాధ్యమవుతుంది.
* మార్కెట్ కరెక్షన్స్ లో `డౌన్’అయినపుడు ఎగ్జిట్ అవ్వాలనుకున్నవాళ్ళకి, మార్కెట్ `అప్’ అయినపుడు ఎంటర్ అవుతామనుకున్నవాళ్ళకి రిటర్న్స్ రావు. గత 20 సంవత్సారాల డేటా ప్రకారం కరెక్షన్స్ తో ఉన్నవాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి.
why mutual fund investors have to stay long
* మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవాళ్ళు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల చదువు పరంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ ఎప్పుడు అమౌంట్ రిక్వైర్ మెంట్ అవుతుందో మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. మనం పిల్లల చదువు మొదలుపెట్టినపుడు మార్కెట్ లో ఎంటర్ అయితే మళ్ళీ వాళ్ళ చదువు పూర్తయ్యేసరికి ఎక్జిట్ అవుతాం. అలాంటపుడు మార్కెట్ తో మనకి సంబంధం లేదు.
* మార్కెట్ ని మనం పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం మనీని ఫండ్ మేనేజర్ కి అప్పగిస్తాం. ఆ ఫండ్ మేనేజర్ పెరిగిన స్టాక్స్ ని అమ్మడం, తగ్గిన స్టాక్స్ ని కొనడం చేస్తారు.
* ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్కెట్ ని పూర్తిగా చూడనవసరం లేదు. లమ్ సమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవాళ్ళు, డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా, మనం లమ్ సమ్ ని ఈక్విటీ ఫండ్స్ లో పెట్టి, రెగ్యులర్ గా ఎస్ టీ పీ ద్వారా ట్రాన్సఫర్ పెట్టుకోవచ్చు. మార్కెట్లో ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా, కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దీనినే సిస్టమేటిక్ ట్రాన్సఫర్ ప్లాన్ అంటారు.
* మనం మ్యూచువల్ ఫండ్స్ లో మంత్లీ రూ.500 తో కూడా ఇన్వెస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు.
*మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఎప్పుడూ కావాలంటే అప్పుడు ఎంటర్ అవ్వవచ్చు, ఎక్జిట్ కూడా అవ్వవచ్చు.
Leave a Reply