
how will we plan early retirement
సాధారణంగా ఉద్యోగులు 58 లేదా 60 సంవ్సరాలకి రిటైర్ అవుతారు. అప్పుడు వాళ్లకు ఆ సంస్థ నుంచి కొంత మొత్తం డబ్బు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ లాంటివి వస్తాయి. ఆ డబ్బును తీసుకుని వాళ్లు తమ జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు, తమ చివరి దశను ఆనందంగా గడిపేందుకు ఉపయోగిస్తారు. కొంత మంది ఉద్యోగులకు పెన్షన్ రూపంలో కూడా నెలవారీ కొంత ఆదాయం వస్తుంది. దీంతో జీవితం హాయిగా గడుస్తుంది. కానీ మనలాంటి చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారుల మాటేమిటి..? లేదా రిటైర్మెంట్ దశ దాకా ఆగకుండా ముందుగానే రిటైర్ అవ్వాలనుకునే వారు ఏం చేయాలి అనేది చూద్దాం.
how much amount we need for retirement
ఇప్పుడు ఎవరైనా రిటైర్ అవ్వాలనుకుంటే తప్పకుండా వాళ్ల దగ్గర ఉండాల్సిన డబ్బు కోటి రూపాయలు. ప్రస్తుతం ఉన్న ఖర్చులు, ఇన్‌ఫ్లేషన్ ను పరిగణలోకి తీసుకుంటే కోటి రూపాయలు సంపాదిస్తే మనం ఆర్థికంగా స్వతంత్రం పొంది, రిటైర్ కావచ్చు. మరి ఆ కోటి సంపాదించడం మనకు చాలా అవసరం. ఆ కోటి ని ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టి సిస్టమెటిక్ విత్‌డ్రాల్ ప్లాన్ (ఎస్ డబ్ల్యూపీ) ద్వారా ప్రతి నెలా స్థిరంగా కొంత ఆదాయం రూపంలో మనం డబ్బులు తీసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో మనం తక్కువలో అనుకుంటే 12 శాతం రాబడిని ఆశించినా సంవ్సతరానికి 12 లక్షల ఆదాయం వస్తుంది. దీన్ని నెలకు పెట్టుకుంటే సుమారు లక్ష రూపాయల వరకు రాబడి వస్తుంది. కానీ మన అవసరాలకు తగ్గట్టుగా కేవలం అందులో సగం డబ్బు అంటే 6 శాతం మాత్రమే మనం తీసుకున్నా నెలకు యాబై వేలు వడ్డీ ఆదాయంగా తీసుకోవచ్చు. దీంతో మనం ఏ పనీ చేయకుండానే నిత్యం రాబడి పొందగలం. అంతే కాకుండా కొంత కాలం మనం పెట్టిన ఆ అసలపై అధిక మొత్తంలోనే దీర్థకాలంలో రాబడి పొందగలం. అంటే మనం ఆర్థికంగా స్వాతంత్రం పొందినట్టే. మరి ఆ కోటి రూపాయలు లేని వారెలా..?
how to earn one crore rupees
రూ. కోటి ఇలా సంపాదించండి..
రిటైర్ అవ్వడానికి 15 సంవత్సరాల టైమ్ ఉన్నవాళ్లు కోటిరూపాయలు కావాలంటే, ఇప్పుడు నుంచి వాళ్ళు ఎంత సేవింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, లమ్సమ్ పెడితే ఎంత వస్తుందో మనం రెండు రకాలుగా విభజించవచ్చు.
* పదిహేను లక్షల రూపాయలను ఒకే సారి 15 శాతం వడ్డీ వచ్చే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టి 15 సంవత్సరాల పాటు వేచి చూస్తే, 15 సంవత్సరాలు పూర్తయ్యేనాటికి కోటి 20 లక్షల రూపాయలను మనం పొందవచ్చు.
* నెలకు15 వేలు రూపాయలను 15 శాతం వడ్డీ వచ్చే మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపీలో పెడితే 15సంవత్సరాలలో మనకి కావలిసిన కోటిరూపాయల కార్పస్ వస్తుంది. దీనినే 15 * 15 *15 సూత్రంగా మనం సులభంగా గుర్తించుకోవాలి.
* మనం మరో పది సంవత్సరాలలోనే రిటైర్ అవ్వాలనుకుంటే 10 సంవత్సరాల పాటు దాదాపు 35,000 రూపాయలను ప్రతి నెలా 15 శాతం వడ్డీ వచ్చే మ్యూచువల్ ఫండ్‌లో పెడితే కోటిరూపాయలు కార్పస్ మనం సంపాదించగలుగుతాం.
* రిటైర్ అవ్వడానికి 5 సంవత్సరాలు ఉన్నవారు వాళ్ళు 35వేలు ఎస్ఐపీలో 5 సంవత్సరాలు, 35 లక్షలు లమ్సమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి కోటి రూపాయల కార్పస్ వస్తుంది.
ఇక్కడ మనం గుర్తించాల్సిన మేజిక్ కాంపౌండింగ్. అంటే ఎంత త్వరగా మనం జాగ్రత్త పడి ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ మెంట్ చేయగలుగుతామో అంత ఎక్కువగా మనం రిటర్న్ పొందగలుగుతాం.