
2025 లో మార్కెట్స్ కొంచెం నిరాశజనకంగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎఫ్ ఐఎస్ సెల్లింగ్, అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం తదితర అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ లో చైనా , ఇండియా ఇవన్నీ
కొంచెం నిరాశాజనకంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా కొన్ని కారణాలు చూస్తే ట్రంప్ తీసుకురాబోయే పాలసీలే మార్కెట్ పై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. చైనా మీద 10% టారిఫ్ విధించగా ఇండియా మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో కొన్ని ఐటమ్స్ మీద టారిఫ్స్ పడతాయా అనేది ఆందోళనకరంగా అనిపించడంతో మన మార్కెట్స్ కూడా కొంచెం డల్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఏదేమైనా భవిష్యత్తులో మార్కెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పుటి దాకా అయితే 20% మేజర్ ఇండిసెస్ లు ఫాల్ అవుతాయో ఆ 20 శాతాన్నే బేర్ మార్కెట్ అంటారు . మన మార్కెట్స్ ఇప్పుడు కేవలం 12 శాతం మాత్రమే ఫాల్ అయ్యాయి. మళ్ళీ వెంటనే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మనం దీన్ని బేర్ మార్కెట్ అనటానికి లేదు. ఇది క్రాష్ అనటానికి కూడా లేదు. ఇది ఒక హెల్దీ కరెక్షన్ మాత్రమే. అయితే ఇలాంటి సమయంలోనే మంచి స్టాక్స్ ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
షేర్లలో రకాలు
Types of Shares
మార్కెట్లో క్వాలిటీ షేర్లు ఉంటాయి. క్వాలిటీ లేని షేర్లూ ఉంటాయి. ఆపరేటర్లు రన్ చేసే షేర్స్ ఉంటాయి. ఆ తర్వాత దాంట్లో స్పెక్యులేషన్ చేసేవి.. రిగ్ చేసే షేర్స్ ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కి ఈ కేటగిరీలు తెలియవు. మార్కెట్ పెరుగుతుంది కాబట్టి అన్ని షేర్లూ పెరిగిపోతాయేమో.. భవిష్యత్తులో అన్ని రిటర్న్స్ ఇస్తాయేమో అనుకుంటారు. కానీ హెల్దీ కరెక్షన్స్ లో ఏమవుతుందంటే ఆ క్వాలిటీ లేని షేర్లు, రిగ్ చేయబడే షేర్లు కొన్ని కిందకి వచ్చేస్తాయి. అంటే ఆ షేర్లలో బాగా సెల్లింగ్ అయితే ఆపరేటర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. లేదా మనీ టైట్ అయిపోవడం, రిగ్ చేయడానికి ఫండ్స్ లేకపోతే ఉన్న షేర్లు అమ్మేసుకుని బయటికి వెళ్ళిపోతారు. క్వాలిటీ లేని షేర్లు కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి రావు. మార్కెట్స్ మళ్ళీ పైకి వెళ్లే తరుణంలో నిఫ్టీ మళ్ళీ ఆల్ టైం హై క్రియేట్ చేయొచ్చు. వన్ ఇయర్ లోపలే క్వాలిటీ ఉన్న స్టాక్స్ పైకి వెళ్తూ ఉంటాయి . అయితే అంతవరకూ జాగ్రత్తగా మార్కెట్లను వాచ్ చేయాలి. పోర్ట్ ఫోలియోని కూడా టైమ్లీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండాలి.
మార్కెట్‌ను దెబ్బతీసే సెక్టార్స్
Sectors That Affect the Market
గత మూడు నెలల్లో మార్కెట్ ని బాగా దెబ్బతీసిన సెక్టార్స్ ఉన్నాయి. మెయిన్ గా రియల్ ఎస్టేట్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, డిఫెన్స్, రైల్వేస్, పీఎస్ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఇవన్నీ కూడా బాగా ఫాల్ అయ్యాయి. మొత్తం మీద మార్కెట్ లో కొన్ని సెక్టార్స్ అయితే డీలా పడుతున్నాయి. అయితే కొన్ని స్టాక్స్ మళ్ళీ నిలదొక్కుకొని పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ కంపెనీస్ మంచి బ్యాలెన్స్ షీట్స్ తో వస్తున్నాయో.. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ లు ఇంప్రూవ్ అవుతున్నాయో.. పీఎన్ఎల్ స్టేట్మెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయన్నది చూసుకోవాలి. ఆ పర్టికులర్ సెక్టార్ లో ని మంచి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
మార్కెట్ ఫాల్‌లో ఉన్నా
Even in Market Fall
ప్రస్తుతం మార్కెట్స్ పెద్ద ఫాల్ లో ఉన్నాయి . అయితే ఇంత ఫాల్ లో ఉన్నా కూడా ఐటీలో మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో , హెచ్ సీఎల్ టెక్నాలజీస్ వాటిల్లో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టవచ్చు. ఫార్మా సెక్టార్, ఫైనాన్షియల్ కంపెనీస్ లో మెయిన్ గా బజాజ్ ఫైనాన్స్, హౌసింగ్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ షేర్లకు ఏ ఢోకా లేదు.
బడ్జెట్ రోజున
On Budget Day
బడ్జెట్ రోజున ఇదివరకు రోజుల్లో చాలా వాలటాలిటీ కనిపించేది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో బడ్జెట్ స్పీచ్ అనేది మూడు నుంచి నాలుగు గంటలు నడిచేది. కాబట్టి మార్కెట్ లో కూడా అంతసేపూ వాలటా
టాలిటీ కనిపించేది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేవలం ఒక గంటలోనే కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం చదివేస్తున్నారు. బడ్జెట్ లో హైలైట్స్ మాత్రమే చెబుతున్నారు. అయితే ఫైన్ ప్రింట్ లో ఏముందో తెలియడం లేదు. అది అందరికీ అందుబాటులోకి వచ్చేటప్పటికి కొన్ని గంటల సమయం పడుతుంది. అప్పటికి మార్కెట్స్ ట్రేడింగ్ టైం కూడా అయిపోతుంది. కాబట్టి మార్కెట్ రియల్ రియాక్షన్ ఒక వారంలో వస్తుందని చెప్పొచ్చు. ఆర్‌బీఐ వడ్డీరేట్లు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి.
సమ్మర్‌లో ఈ సెక్టార్స్ వైపు చూడడం మేలు
Better to Focus in Summer
ఈ సమ్మర్ లో టూరిజం, హాస్పిటల్, హోటల్ ఇండస్ట్రీ వైపు చూడడం మేలు. పర్టిక్యులర్ గా ఇండియన్ హోటల్స్ ను పరిశీలిస్తే రీసెంట్ టైం లో కూడా మంచి ప్రాఫిట్స్ చూపించాయి. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో అలాంటి హోటల్ సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ స్టాక్స్ కొంచెం బాగా రాణించే అవకాశం ఉంటుంది