Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS

ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌… లాభామా? లేక న‌ష్ట‌మా? F&O Trading: Opportunity or High-Risk Gamble?

Posted on 30/03/2026 By admin No Comments on ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌… లాభామా? లేక న‌ష్ట‌మా? F&O Trading: Opportunity or High-Risk Gamble?

స్టాక్‌ మార్కెట్‌ అంటే చాలా మందికి ఇప్పటికీ షేర్లు కొనడం, వాటి ధర పెరిగినప్పుడు అమ్మడం అనే సాదాసీదా భావన మాత్రమే ఉంటుంది. కానీ మార్కెట్‌లో మరో ప్రపంచం ఉంది. అది ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O). ఈ విభాగం పెట్టుబడిదారులకు వేగంగా లాభాలు తెచ్చిపెట్టే అవకాశమున్నప్పటికీ.. అదే సమయంలో భారీ నష్టాలకు కూడా కారణమవుతుంది. ఇటీవల‌ కాలంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా ఎఫ్‌అండ్‌ఓ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే ఇది అందరికీ సరిపడే మార్గమా? లేదా కొందరికే పరిమితమా? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.

సాధారణ ట్రేడింగ్‌కు భిన్నమైన ఎఫ్‌అండ్‌ఓ.. How F&O Differs from Regular Stock Investing
సంప్రదాయ స్టాక్‌ పెట్టుబడిలో మీరు షేర్‌ కొనుగోలు చేస్తే, ఆ కంపెనీలో భాగస్వామి అవుతారు. ధర పెరిగితే లాభం, పడితే నష్టం. కానీ ఎఫ్‌అండ్‌ఓ(F&O)లో మీరు స్టాక్‌ను కొనడం కాదు… దాని భవిష్యత్తు ధరపై ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫ్యూచర్స్‌లో గడువు తేదీ ఉంటుంది. ఆ తేదీకి ముందు లేదా ఆ రోజున మీరు మీ పొజిషన్‌ను ముగించాలి. ఆప్షన్స్‌లో ప్రీమియం చెల్లించి హక్కు పొందుతారు కానీ బాధ్యత ఉండదు. ఇంకా ముఖ్యమైన విషయం—మార్కెట్‌ పడిపోయినా కూడా మీరు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. దీనినే షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. ఇది సాధారణ పెట్టుబడికి పూర్తిగా భిన్నమైన విధానం.

డెరివేటివ్స్‌ మార్కెట్‌… నైపుణ్యం ఉన్నవారికే? Derivatives Market Demands Skill and Expertise
ఎఫ్‌అండ్‌ఓ (F&O)ట్రేడింగ్‌ డెరివేటివ్స్‌ విభాగంలోకి వస్తుంది. ఇది సాధారణంగా నైపుణ్యం కలిగిన ట్రేడర్ల కోసం రూపొందించబడింది. మార్కెట్‌ ట్రెండ్‌, వాల్యూమ్‌, వోలాటిలిటీ, టైమ్‌ డికే—ఇలా అనేక అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి తెలియకుండా ట్రేడింగ్‌ చేయడం అంటే చీకట్లో నడిచేలా ఉంటుంది. ఇదే కారణంగా సెబీ వంటి నియంత్రణ సంస్థలు కూడా రిటైల్‌ ఇన్వెస్టర్ల ఎఫ్‌అండ్‌ఓ పాల్గొనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

టైమ్‌ వాల్యూ… కనిపించని ప్రమాదం.. Time Value: The Hidden Risk Factor
ఎఫ్‌అండ్‌ఓ(F&O)లో అత్యంత క్లిష్టమైన అంశం “టైమ్‌ వాల్యూ”. కాలం గడిచేకొద్దీ ఆప్షన్స్‌ విలువ తగ్గిపోతుంది. మీరు సరైన దిశలో ఉన్నా కూడా, సమయం మీకు వ్యతిరేకంగా పని చేయొచ్చు. ఆప్షన్స్‌లో మీరు క్లోజ్‌ చేయకపోతే మొత్తం ప్రీమియం కోల్పోయే ప్రమాదం ఉంది. ఫ్యూచర్స్‌లో నష్టం వస్తే అదనపు మార్జిన్‌ పెట్టాల్సి రావచ్చు. ఈ లెక్కలు అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇక్కడే తప్పిదాలు చేస్తున్నారు.

లీవరేజ్‌… ఆకర్షణా? లేక ఉచ్చు? Leverage: Attraction or Trap?
ఎఫ్‌అండ్‌ఓలో(F&O) లీవరేజ్‌ ప్రధాన ఆకర్షణ. తక్కువ డబ్బుతో పెద్ద కాంట్రాక్ట్‌ను నియంత్రించవచ్చు. ఉదాహరణకు రూ.1 లక్షతో రూ.5 లక్షల విలువైన ట్రేడ్‌ చేయవచ్చు. ఇది వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రమాదకరం కూడా. మార్కెట్‌ 1% మీకు అనుకూలంగా కదిలితే పెద్ద లాభం… అదే వ్యతిరేకంగా కదిలితే భారీ నష్టం. ఒక్క తప్పు ట్రేడ్‌ మీ ఖాతాను పూర్తిగా ఖాళీ చేయగలదు.

ఎందుకు ఎక్కువ మంది నష్టపోతున్నారు? Why Most Retail Traders Lose Money?
వివిధ అధ్యయనాల ప్రకారం దాదాపు 90% రిటైల్‌ ట్రేడర్లు ఎఫ్‌అండ్‌ఓ(F&O)లో నష్టపోతున్నారు. ప్రారంభంలో కొందరికి లాభాలు వస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్ద పొజిషన్‌లు తీసుకుంటారు. కానీ ఒక్క తప్పు నిర్ణయం… నెలల తరబడి సంపాదించిన లాభాలను నిమిషాల్లో తీసుకుపోతుంది. ఇది ఒక సైకాలజికల్‌ ట్రాప్‌ కూడా. లాభం వచ్చినప్పుడు నియంత్రణ కోల్పోవడం, నష్టం వచ్చినప్పుడు తిరిగి సంపాదించాలని ఎక్కువ రిస్క్‌ తీసుకోవడం—ఇవి ప్రధాన కారణాలు.

ఎఫ్‌అండ్‌ఓ ఎవరికోసం? Who Should Trade in F&O?
ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌(F&O) చేయాలంటే కేవలం డబ్బు ఉండటం సరిపోదు. మార్కెట్‌పై లోతైన అవగాహన, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, క్రమశిక్షణ తప్పనిసరి. టెక్నికల్‌ అనాలిసిస్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, స్టాప్‌లాస్‌ వినియోగం.. ఇవి బాగా తెలిసినవారే ఈ విభాగంలో నిలబడగలరు. అలాగే రోజూ మార్కెట్‌ను గమనించే సమయం ఉండాలి. ఇది పార్ట్‌టైమ్‌గా చేయగలిగే పని కాదు.

ఎవరికి సరిపోదు? Who Should Avoid F&O Trading?
కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారు, మార్కెట్‌పై అవగాహన తక్కువగా ఉన్నవారు, భావోద్వేగాలతో ట్రేడింగ్‌ చేసే వారికి ఎఫ్‌అండ్‌ఓ(F&O) సరిపోదు. అత్యవసర ఖర్చుల కోసం ఉంచిన డబ్బు, ఈఎంఐలు, కుటుంబ అవసరాలకు అవసరమైన నిధులు.. ఇవన్నీ ఎఫ్‌అండ్‌ఓలో పెట్టడం చాలా ప్రమాదం. నష్టం వచ్చినప్పుడు మానసిక ఒత్తిడిని తట్టుకోలేని వారు కూడా ఈ విభాగానికి దూరంగా ఉండటం మంచిది.

ఏం చేయాలి? సురక్షిత మార్గం ఏది? What is the Safer Approach for Investors?
ఎఫ్‌అండ్‌ఓ(F&O)లోకి వెళ్లే ముందు కనీసం ఒక సంవత్సరం పాటు క్యాష్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ అనుభవం సంపాదించడం అవసరం. మార్కెట్‌ ప్రవర్తన, ధరల మార్పులు, ట్రెండ్‌లను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కూడా చిన్న మొత్తాలతో ప్రారంభించడం మంచిది. సాధారణ పెట్టుబడిదారులు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌, బ్లూ చిప్‌ స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు, ఐపీవోలలో పాల్గొనడం వంటి మార్గాలను అనుసరించడం సురక్షితం.

వేగం కాదు, అవగాహన ముఖ్యం.. Knowledge Matters More Than Speed
ఎఫ్‌అండ్‌ఓ(F&O) ట్రేడింగ్‌ ఒక అవకాశమూ… అదే సమయంలో ఒక ప్రమాదకరమైన మార్గమూ. ఇది త్వరగా డబ్బు సంపాదించే సాధనం కాదని గుర్తించాలి. మార్కెట్‌లో నిలబడటానికి సహనం, క్రమశిక్షణ, అవగాహన కీలకం. లాభాల కోసం పరుగులు పెట్టడం కంటే… నష్టాలను నియంత్రించడం నేర్చుకున్నవారే నిజమైన ట్రేడర్లు. “ఎఫ్‌అండ్‌ఓ(F&O)లోకి అడుగుపెట్టే ముందు, మీకు మీరు సిద్ధమా అని ఒకసారి ఆలోచించుకోవాలి.” అని నిపుణులు సూచిస్తున్నారు.

161
MARKET Tags:Derivatives Market Demands Skill and Expertise, How F&O Differs from Regular Stock Investing, Knowledge Matters More Than Speed, Leverage: Attraction or Trap?, Time Value: The Hidden Risk Factor, What is the Safer Approach for Investors?, Who Should Avoid F&O Trading?, Who Should Trade in F&O?, Why Most Retail Traders Lose Money?

Post navigation

Previous Post: ఇన్వెస్టింగ్ వైపు మహిళ‌ల అడుగులు.. Women Moving Towards Investing
Next Post: దంపతుల జాయింట్ ప్రాపర్టీ ..! టాక్స్‌లో ఎంత ఆదా సాధ్యం? Joint Property for Married Couples ..! How Much Tax Can You Save?

Related Posts

  • డివిడెండ్ ఎందుకిస్తారు what is dividend in stock market MARKET
  • ఎల్ ఐ సీ రాయితీ షేర్లకు పాన్ లింక్ త‌ప్ప‌నిసరి FEATURE NEWS
  • This is how to check for losses in the stock market స్టాక్ మార్కెట్‌లో న‌ష్టాల‌కు ఇలా చెక్ పెట్టండి FINICAL PLANNING
  • పెన్నీ స్టాక్స్ అంటే ఏవి what is penny stock MARKET
  • స్టాక్ మార్కెట్ అంటే గేంబ్లింగ్ కాదు stock market is not a gambling MARKET
  • లాభాలొచ్చాయ‌ని తొంద‌ర ప‌డొద్దు Don’t be in a hurry to make a profit MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఈపీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ ప‌డుతుందా? Is EPF Withdrawal Taxable? FEATURE NEWS
  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS
  • ఏదీ స‌రైన పెట్టుబ‌డి..? FEATURE NEWS
  • డబ్బు, కుటుంబం, జీవన ప్రణాళిక – సినిమా చెప్పిన ఆర్థిక సత్యాలు.. Money, Family and Life Planning – The Financial Truths Told by a Film FEATURE NEWS
  • 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026 FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • పెన్షన్ టెన్షన్ వద్దు.. LIC ‘మ్యాజిక్’ పాలసీలతో జీవితాంతం ఆదాయం! No Pension Worries.. Lifetime Income with LIC ‘Magic’ Policies! INSURANCE
  • అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme