
should we pay tax on dividends
స్టాక్‌మార్కెట్లో షేర్‌హోల్డర్లకు డివిడెండ్లు వస్తుంటాయి. కంపెనీ తమకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులకు ఇస్తుంది. దీనినే డివిడెండ్ అంటారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, రిటైలర్లు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వారు మంచి కంపెనీలనుంచి ఇలా డివిడెండ్ల రూపంలో ఆదాయం పొందుతారు. అయితే ఇలా వచ్చే ఆదాయంపై ట్యాక్స్ కట్టాలా అనే సందేహం చాలా మంది ఉంటోంది. మరి ఏం చేయాలో ఓ సారి చూద్దాం..
what is the new tax rule on dividends
2020 నుంచి కొత్త రూల్..
2019 ఆర్థిక సంవత్సరం వరకు మన ఇండియన్ కంపెనీలు షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇచ్చినప్పుడు
ట్యాక్స్‌ని కంపెనీలే చెల్లించేవి. షేర్ హెల్డర్‌కి ఎటువంటి సంబంధం ఉండేది కాదు.
కానీ 2020 లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అందువల్ల 2020-21 నుంచి డివిడెండ్‌పై కంపెనీలు ట్యాక్స్ పే చేయవు. కాబట్టి షేర్ హోల్డర్లే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
have to file ITR on dividend profit
ఐటీఆర్ ఫైల్ చేయల్సిందే..
డివిడెంట్ ఇన్ కమ్ కి స్పెషల్ రేటు ఏమీ ఉండదు. మనకి అప్లికెబుల్ అయ్యే స్లాబ్ రేట్ బట్టి ట్యాక్స్ రేటు ఉంటుంది. డివిడెండ్ ఇన్ కమ్ ని వేరే మార్గాల్లో ఇన్ కమ్ వచ్చేలా చూపించుకోవాలి.
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఒక కంపెనీ నుంచి మనకి 5,000 రూపాయలు డివిడెండ్ వస్తే దానిపై టీడీఎస్ ఉండదు. కానీ 5,000 రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ వస్తే మొత్తంపై 10 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్ ఇన్కం ఎంత వచ్చినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే.
రెండు రకాలుగా..
డివిడెండ్ లో ఇన్ టెర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ అని రెండు రకాలు ఉంటాయి.
ఇన్ టెర్మ్ డివిడెండ్ అంటే కంపెనీలు ఆర్థిక పనితీరుని బట్టి, త్రైమాసికంగా లేదా అర్ఠవార్షికంగాను ఇచ్చే డివిడెండ్. అంటే ఆ డివిడెండ్ ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో ఇస్తారు.
ఫైనల్ డివిడెండ్ అంటే సంవత్సరానికొకసారి ఇస్తారు. అది కూడా ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక, కంపెనీ ఆర్థిక పనితీరు బాగుంటే డిక్లేర్ చేస్తారు. మంచి లాభదాయక కంపెనీల్లో పెట్టుబడులు స్థిరంగా ఎక్కవ కాలం పాటు పెడితే డివిడెండ్లను ఆదాయంగా పొందవచ్చు.