ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు… ఎలా నిర్వహిస్తున్నామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తోంది. నెలకు ₹50 వేల జీతం ఉన్నా… ₹5 లక్షలు ఉన్నా… ₹5 కోట్లు ఉన్నా… డబ్బు సక్రమంగా ప్లాన్ చేయకపోతే చేతిలో మిగిలేది తక్కువే. మరోవైపు, సరైన ప్రణాళికతో చిన్న ఆదాయం ఉన్నవారూ క్రమంగా సంపదను సృష్టించగలుగుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే హై నెట్‌వర్త్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు వారి ఆర్థిక అలవాట్లను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. వారు ఎక్కువ సంపాదించడం వల్ల కాదు… సిస్టమేటిక్‌గా డబ్బును మేనేజ్ చేయడం వల్లే సంపన్నులయ్యారు. ఈ నేపథ్యంలో సాధారణ వ్యక్తి కూడా సులభంగా పాటించగలిగే ఒక సింపుల్ ఫైనాన్షియల్ ఫ్రేమ్‌వర్క్ 15:65:20 రూల్ (Follow the 15:65:20 Rule) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
15:65:20 రూల్ అంటే ఏమిటి? What is the 15:65:20 Rule?
మన నెల జీతాన్ని మూడు భాగాలుగా విభజించడం ఈ రూల్ (Follow the 15:65:20 Rule) సారాంశం. సంపాదించిన మొత్తాన్ని ఒకే చోట ఖర్చు చేయకుండా, ముందుగానే విభజించడం ద్వారా మన ఆర్థిక నియంత్రణను పెంచుకోవచ్చు. ఉదాహరణకు మీకు నెలకు ₹1 లక్ష జీతం వస్తే… మొదట 15% సేవింగ్స్‌గా పక్కన పెట్టాలి. తర్వాత 65% నిత్యావసర ఖర్చులకు వినియోగించాలి. మిగిలిన 20% వ్యక్తిగత కోరికలు, ఆనందం కోసం వినియోగించుకోవాలి. ఈ సరళమైన పద్ధతి ద్వారా మన ఖర్చులు, సేవింగ్స్, జీవనశైలి .. ఒక సమతుల్యతలో ఉంటాయి.
ముందుగా సేవింగ్స్.. తర్వాత ఖర్చులు.. Save First, Spend Later
చాలామంది చేసే పెద్ద తప్పు మొదట ఖర్చులు చేసి, మిగిలితే సేవ్ చేయడం. కానీ ఈ పద్ధతిలో సాధారణంగా సేవింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సరైన విధానం ఏమిటంటే మొదట సేవింగ్స్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఖర్చులను ప్లాన్ చేయాలి. ఈ 15% సేవింగ్స్ కేవలం డబ్బు నిల్వ కాదు. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఎమర్జెన్సీ ఫండ్ ప్రాముఖ్యత.. Importance of Emergency Fund
జీవితంలో అనుకోని సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ఆకస్మిక ఖర్చులు .. ఇవన్నీ ఒక్కసారిగా ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి. అందుకే కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ముందుగానే సేవ్ చేసుకోవాలి. ఇది ఎమర్జెన్సీ ఫండ్‌గా పనిచేస్తుంది. ఈ ఫండ్ (Follow the 15:65:20 Rule)ఉంటే… మనకు ఆర్థిక భయం తగ్గుతుంది. తప్పు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రాదు. అత్యవసర సమయంలో అప్పులు తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది
సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వైపు .. From Savings to Investments
ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధమైన తర్వాత తదుపరి దశ.. ఇన్వెస్ట్మెంట్స్. డబ్బు బ్యాంకులో ఉంచితే అది పెద్దగా పెరగదు. ద్రవ్యోల్బణం వల్ల విలువ తగ్గిపోతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ వంటి మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలంలో ఇవి 10–15% వరకు రాబడులు ఇవ్వగలవు. ఈ విధంగా క్రమంగా పెట్టుబడి పెడితే… రిటైర్మెంట్ ప్లానింగ్ సులభమవుతుంది. పిల్లల విద్య, భవిష్యత్తు లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఆర్థిక స్వాతంత్య్రం సాధించవచ్చు
ఖర్చుల నియంత్రణలోనే రహస్యం.. The Secret Lies in Expense Control
మన సంపాదన పెరిగినకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనిని “లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్” అంటారు. సొసైటీ ప్రెజర్, స్టేటస్ కోసం ఎక్కువ ఖర్చు చేయడం .. ఇవి చాలా మందిని అప్పుల బారిన పడేస్తున్నాయి. ఉదాహరణకు, ఆదాయానికి మించి రెంట్ చెల్లించడం, అధిక ఈఎంఐలు తీసుకోవడం వంటివి ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తాయి. అందుకే 65% ఖర్చుల (Follow the 15:65:20 Rule) పరిమితిలోనే జీవనశైలిని డిజైన్ చేసుకోవాలి.
65% ఖర్చులు ఎలా ఉండాలి? How to Structure Your 65% Expenses?
ఈ భాగంలో మన నిత్యావసర ఖర్చులు ఉంటాయి. ఇంటి అద్దె, ఈఎంఐలు, విద్య, ఆహారం, బిల్లులు ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఇవి అవసరమైన ఖర్చులే అయినా… అవి నియంత్రణలో ఉండాలి. ఖర్చులు 65% దాటితే మీ సేవింగ్స్ తగ్గుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. భవిష్యత్తు లక్ష్యాలు దూరమవుతాయి
జీవితం కూడా ఆస్వాదించాలి… Don’t Forget to Enjoy Life
పూర్తిగా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించే ఆలోచిస్తూ జీవితం గడపడం కూడా సరైంది కాదు. అందుకే 20% డబ్బును మన కోరికలు, ఆనందం కోసం కేటాయించాలి. ట్రావెల్, హాబీస్, ఎంటర్టైన్మెంట్, స్వీయ అభివృద్ధి.. ఇవన్నీ ఈ భాగంలోకి వస్తాయి. ఈ ఖర్చులు మనకు మానసిక సంతృప్తి ఇస్తాయి. జీవితం సమతుల్యంగా ఉంటుంది.
ఖర్చులు ఎక్కువైతే ఏమి చేయాలి? What If Expenses Are Too High?
చాలామందికి ఒక సమస్య ఏమిటంటే.. జీతం వచ్చిన వెంటనే ఖర్చులు పూర్తవుతాయి. సేవింగ్స్ చేయడానికి డబ్బు మిగలదు. ఇలాంటి పరిస్థితిలో ముందుగా ఖర్చులను రికార్డ్ చేయాలి. ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతోందో గుర్తించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఉదాహరణకు, అధిక రెంట్, ఎక్కువ ఈఎంఐలు.. ఇవే పెద్ద సమస్యలు అవుతాయి.
అప్పుల నిర్వహణ అవసరం .. Managing Debt is Crucial
ఈఎంఐలు అధికంగా ఉంటే సేవింగ్స్ అసాధ్యం అవుతుంది. అందుకే ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తీర్చాలి. అనవసర లోన్లను తగ్గించాలి ఇలా చేస్తే ప్రతి నెల కొంత డబ్బు సేవింగ్స్‌కు మళ్లించవచ్చు.
ఇన్సూరెన్స్ – ఆర్థిక రక్షణ.. Insurance as Financial Protection
సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా… ఒక పెద్ద ఆరోగ్య సమస్య వస్తే మొత్తం డబ్బు ఖర్చవుతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అలాగే కుటుంబ భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అవసరం. ఇవి లేకపోతే ఆర్థిక ప్రణాళిక పూర్తికాదు.
ఆదాయం పెరిగితే ప్లాన్ మారాలి.. Adjust the Rule as Income Grows
₹50 వేల జీతం ఉన్నవారికి ఒక విధంగా పని చేసే రూల్… ₹3 లక్షల జీతం ఉన్నవారికి వేరుగా ఉండవచ్చు. అందుకే ఆదాయం పెరిగిన కొద్దీ ఇన్వెస్ట్మెంట్స్ శాతం పెంచాలి. ఖర్చుల శాతం నియంత్రించాలి అంటే ఎక్కువ సంపాదించినంతగా సేవింగ్స్ కూడా పెరగాలి.
సిస్టమ్ ఉంటేనే సంపద.. Wealth Needs a System
సంపద సృష్టి అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. ఇది క్రమశిక్షణ, సమయం, సరైన విధానంతోనే ఫలితాలు వస్తాయి. ఎవరైనా పెద్దగా సంపాదించకపోయినా… సిస్టమేటిక్‌గా సేవింగ్స్ చేస్తూ.. క్రమంగా ఇన్వెస్ట్ చేస్తే
కొన్ని సంవత్సరాల్లోనే గణనీయమైన సంపదను సృష్టించగలరు. డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగం మాత్రమే. దాన్ని సక్రమంగా నిర్వహించడం నిజమైన నైపుణ్యం. 15:65:20 వంటి సరళమైన పద్ధతిని పాటించడం ద్వారా మనం మన ఆర్థిక జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవచ్చు. ఖర్చులు నియంత్రించడం, ముందుగా సేవింగ్స్ చేయడం, క్రమంగా ఇన్వెస్ట్ చేయడం.. ఇవే సంపద సృష్టి పునాది సూత్రాలు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, సహనం ఉంటే.. ఏ ఆదాయ స్థాయిలో ఉన్నా… ఆర్థిక స్వాతంత్య్రం సాధ్యమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
