అముల్ ఫ్రాంచైజీ ఇలా పొందండి how to apply for amul franchise
నిత్య జీవితంలో ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి. మనకు వచ్చే ఆదాయం మన ఖర్చులకు సరిపడని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో కొందరు అదనపు ఆదాయం గురించి ఆలోచిస్తుంటారు. ఉద్యోగం చేసే వారి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. వారు రెండో ఆదాయపు వనరు గురించి ఎప్పడూ అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఏదీ వారికి వీలుకాక ఊరుకుంటారు. సరిగ్గా అలాంటి వారికి ఉన్న అవకాశాల్లో ఉత్తమ మైనది అముల్ ఫ్రాంచైజీ..
what are the amul products
పాల ఉత్పత్తుల వ్యాపారంలో పెను మార్పు తీసుకువచ్చిన సంస్థ అముల్. ఇండియాలో ఈ రంగంలో దిగ్గజంగా పిలువబడుతున్న అముల్ ఇప్పుడు ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ వచ్చాక అముల్ సంస్థకు ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ రైతులతో అముల్ ఒప్పందం కుదుర్చుకుని పాలు కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కాబట్టి అముల్‌కు ప్రత్యేకంగా ప్రచారం కూడా అక్కర్లేదు. అముల్ ఆఫర్ చేస్తున్న రకరకాల ఫ్రాంచైజీలతో మనం వ్యాపారం చేసి లాభాలు గడించే అవకాశం వచ్చింది. ఎప్పటికప్పుడు, పాలు ఇతర ఉత్పత్తుల కోసం ఫ్రాంచైజ్ లేదా వ్యాపార భాగస్వామి కోసం అముల్ దరఖాస్తు ఆహ్వానిస్తూనే ఉంటుంది. అముల్ ఫ్రాంచైజీని తీసుకోవాలంటే లేదా అముల్ తో వ్యాపార భాగస్వామి కావాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
what are the requirements for amul milk parlour franchise
– మిల్క్ పార్లర్ ఫ్రాంచైజీకి 100 నుంచి 150 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
– ఈ స్థలంలో మిల్క్ పార్లర్, అముల్ కియోస్క్ సెంటర్, అముల్ అవుట్లెట్ ఏర్పాటు చేయవచ్చు.
-పెట్టుబడిగా 2 లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది.
– మీరు దుకాణంలో అముల్ ఉత్పత్తులను మాత్రమే అమ్మాల్సి ఉంటుంది.
మీ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాత, అముల్ టోకు డీలర్లు మీ దుకాణానికి స్టాక్ సరఫరా చేస్తారు. దీనికోసం, మీరు విడిగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అముల్ ఉత్పత్తులను అమ్మడానికి దుకాణాలు లేదా పార్లర్ లకు రిటైల్ మార్జిన్ లభిస్తుంది. ఫ్రాంచైజీ రెవెన్యూ అముల్ తో ఎలాంటి రాయల్టీని పంచుకోవాల్సిన అవసరం లేదు. అముల్ పార్లర్ ఆదాయాలు మీ స్టోర్ లొకేషన్, డిమాండ్ ను ఆధారపడి ఉంటుంది. మీ స్థానం నివాస ప్రాంతంలో ఉంటే మీ సంపాదన అవకాశాలు పెరుగుతాయి. అముల్ మీకు పాల పాకెట్ల పై 2.5శాతం కమీషన్ ఇస్తుంది. ఇతర పాల ఉత్పత్తులకు ఇది 10 శాతం కమీషన్ వస్తుంది.
requirements for amul store franchise
* అముల్ స్టోర్ ఫ్రాంచైజీ తెరవాలనుకుంటే 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
– 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఇందులో నాన్ బ్రాండ్ సెక్యూరిటీ రూ.50 వేలు,
ఉపసంహరణ రూ.4లక్షలు, సామగ్రి ఖర్చులు.రూ.1.5 లక్షలు ఉంటాయి.
– స్టోర్ ఉద్యోగుల ఖర్చు భరించాలి.
– స్టోర్ కు అద్దె , విద్యుత్, ఇతర ఛార్జీలు దుకాణానికి సంస్థ చెల్లిస్తుంది.
– దుకాణాలను ప్రారంభించడమే కాకుండా, సంస్థ మీకు ఎప్పటికప్పుడు అనేక ఆఫర్లను ఇస్తుంది.
commission on amul products
* ఐస్ క్రీమ్ పార్లర్లలో మిల్క్ పార్లర్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇక్కడ స్టోర్ కమీషన్ ఇలాంటిదే. ఐస్ క్రీం, పిజ్జా, బర్గర్ మొదలైన ఉత్పత్తులకు 50 శాతం కమీషన్ లభిస్తుంది. అదే సమయంలో ప్రీ ప్యాక్ ఐస్ క్రీంలపై 20 శాతం కమిషన్ స్టోర్ కు వస్తుంది. ఇక్కడ, అముల్ కాకుండా ఇతర కంపెనీ ఉత్పత్తులను కూడా అమ్మవచ్చు. అయితే, ఈ సందర్భంలో కమిషన్ 10 శాతం ఉంటుంది.
Leave a Reply