పొదుపు ఖాతాలో బ్యాంకులు అన్ని రకాల సేవలను ఉచితంగా అందించవు. ఈ ఖాతాకు అందించే సేవలకు బ్యాంకులు రుసుము విధిస్తాయి. సాధారణంగా పొదుపు ఖాతాలో నెలవారి సగటు బ్యాలెన్స్ నిర్వహించాలి. ఈ కనీస బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలం అయితే అపరాధ రుసుం తప్పదు.
types of banking charges
* మనం వాడే ఏటీఎం కార్డులకు నిర్వహణ చార్జీలు ఉంటాయి. ట్రాన్జాక్షన్ పరిమితి దాటితే వాటిపై పడే జరిమానా కూడా ఎక్కువే ఉంటుంది.
* లావాదేవీల అనంతరం బ్యాంకులు మనకు మెసేజీల ద్వారా సమాచారం అందిస్తాయి. వీటిపై కూడా చార్జీలు వేస్తాయి.
* యాన్యువల్ మెయింటినెన్స్ చార్జీల గురించి ఎలాగో తెలిసిందే. ఈ చార్జీలు ఒక్కో బ్యాంకుకు సుమారు ఒకేలా ఉంటాయి.
* ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వాడితే అందులో జరిపే లావాదేవీలపై చార్జీలు వర్తిస్తాయి.
* ఎక్కువ ఖాతాలు ఉన్నట్లయితే ప్రతి ఖాతాలోనూ సగటు బ్యాలెన్స్ ఉంచాలి. కాబట్టి, ఎక్కువ మొత్తం ఖాతాలో లాక్ అయ్యి ఉంటుంది.
ఇలా మనం కలిగి ఉన్న బ్యాంకు అకౌంట్ల అన్నింటిలోనూ ఈ రకాలైన చార్జీలు మనపై పడుతునే ఉంటాయి. ఈ విషయాన్ని చాలా చిన్నగా భావించి పెద్దగా పట్టించుకోం. వీటన్నింటి మొత్తం కలిపి చూస్తే అది చాలా భారమే..
మనలో కొందరు బ్యాంకు అకౌంట్లో ఉంచే డబ్బులపై వడ్డీ వస్తుంది కదా అనుకుంటారు. కానీ అక్కడ ఇచ్చే వడ్డీ చాలా తక్కువ. 4 శాతం కూడా ఉండని ఆ లాభంపై అనవసరంగా చార్జీలు చెల్లించడం అనవసరం. వీటి కన్నా మెరుగైన పొదుపు పథకాల్లో, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో డబ్బులు ఉంచుకుంటే చాలా అధికమైన లాభాలను పొందవచ్చు.
how to close bank account
ఖాతా మూసివేయచ్చు..
చాలా వరకు బ్యాంకులు ఈ మధ్య ఆన్ లైన్ లోనే ఖాతాలు తెరిచే సౌకర్యం కలిపిస్తున్నాయి. అయితే, ఆన్లైన్ లో ఖాతా మూసే వీలు మాత్రం ఉండదు. మీరు నేరుగా మీ బ్యాంకు కి వెళ్ళి అక్కడ సంబంధిత ఫారం నింపి, ఖాతా లో ఉన్న బ్యాలన్స్ ని మీ ఇతర ఖాతాకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాత కొద్ది రోజులకి ఖాతా మూతపడుతుంది.
వేతన ఖాతాలో మీ వేతనానికి సంబంధించిన లావాదేవీలనే నిర్వహించండి. ఒక సంస్థ నుంచి వేరొక సంస్థకు మారినప్పుడు, కొత్త సంస్థ శాలరీ ఖాతా తెరిస్తే, మీ పాత సంస్థ వారు ఇచ్చిన శాలరీ ఖాతా రద్దు చేయాల్సిందే. వాడకంలో లేని ఖాతాలను వీలైనంత వెంటనే రద్దు చేసుకోండి.
what will happen if u forget to close a bank account
కొంతమంది 10 నుంచి 15 సంవత్సరాల క్రితం తెరిచిన పొదుపు ఖాతాను మర్చిపోతుంటారు. మీరు తెరిచిన ఖాతాలో డబ్బును ఉంచి, మర్చిపోతే, మీరు ఆ మొత్తాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే ఈ చార్జీలన్నీ మీపై విధిస్తునే ఉంటారు. మీరు చూసే సమయానికి బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండకపోగా మీరే చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి నిరూపయోగమైన ఖాతాల వల్ల మీతో పాటు నామినీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఉన్న అన్ని ఖాతాల్లోనూ కనీస నిల్వ ఉండాలి. ఇది మీ క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం చూపిస్తుంది.
బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలన్స్ ఎంత ఉండాలి
What is the minimum balance in the bank account
బ్యాంక్స్ లో ఏజంట్ లు వాళ్ళకి వచ్చిన కమీషన్ దృష్ట్యా అకౌంట్స్ ఓపెన్ చేయించేస్తుంటారు. ఎందుకంటే ఎంట్రీ లెవల్ బ్యాలన్స్ డిఫరెంట్. ఎంట్రీ లెవల్ లో రూ.100 తో అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. కొన్ని బ్యాంకులలో మినిమమ్ బ్యాలన్స్ అని ఉంటుంది. అలాగే యావరేజ్ బ్యాలన్స్ కూడా ఉంటుంది. సాధారణంగా కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవడానికి రూ.10,000 పెట్టాల్సి ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే రూ.10,000తో ఓపెన్ చెయ్యాలి. ప్రభుత్వ బ్యాంకుల్లో సామాన్యులు ఎవరైనా రూ.1000 నుంచి అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. కానీ యావరేజ్ బ్యాలన్స్ అనేది ఒకటి ముఖ్యం. దీనికి ట్యాక్స్ ఛార్జస్ పడతాయి.
* బ్యాంకులు ప్రైవేటు వాళ్ళ కి డిపాజిట్లు, లోన్స్, హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్ వంటివి అవుట్ సోర్సింగ్ కి ఇస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు కమిషన్ కోసం కొన్ని రకాల ప్రక్రయలు చేస్తారు. దీంతో వినియోగదారులు కొంత మొత్తంలో చార్జీల రూపంలో అధికంగా చెల్లించాల్సి వస్తుంది. మినిమమ్ బ్యాలన్స్ ఎంత ఉండాలి, మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసుకోకుండా అకౌంట్ ఓపెన్ చెయ్యకూడదు. మనం అకౌంట్ ఓపెన్ చేసినపుడు కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకోవాలి.
- మామూలు అకౌంట్ కి డెబిట్ కార్డ్ ఇస్తారు. రూ.లక్ష యావరేజ్ ఉంటే ప్లాటినమ్ కార్డ్ ఇస్తారు. ప్లాటినమ్ కార్డ్ ఇస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎయిర్ ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటుంది. డెబిట్ కార్డ్స్ వల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. మనం అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి బ్యాంకు నుంచి డెబిట్ కార్డ్ తీసుకోవాలి. డెబిట్ కార్డ్ ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతే రూ.2లక్షలు వస్తుంది. యావరేజ్ బ్యాలన్స్ రూ.లక్ష ఉంటే ప్లాటినమ్ కార్డ్ అడిగి తీసుకోవాలి. ముందే అకౌంట్ ఉన్నవాళ్ళకి కొన్ని బ్యాంకులు డిస్కౌంట్ ఇస్తాయి. హౌసింగ్ లోన్స్ గాని, ఎడ్యుకేషనల్ లోన్స్ లో గాని కొంత వడ్డీ భారం తగ్గిస్తారు. ఇవన్నీకనుక్కుని అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.
- బ్యాంకులు చేసే మరో వ్యాపారం క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకులకి 24 శాతం వడ్డీ తెచ్చి పెట్టే ఏకైక సాధనం. మనం క్రెడిట్ కార్డ్ తీసుకుని నెల రోజులు వాడిన తర్వాత కట్టలేకపోతే వడ్డీ పడిపోతుంది. ఛార్జీలు ఎన్ని పడతాయో అని తెలుసుకోకుండా క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు. ఛార్జీలు ఎంత పడతాయి, కమిషన్ ఎంత పడుతుంది, డీఫాల్ట్ ఇంటరెస్ట్ ఎంత అని మనం క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు తెలుసుకోవాలి. మనం అకౌంట్ తీసుకున్నప్పుడు గాని, క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు గానీ ఆలోచించి, రేటు తెలుసుకోకపోతే చాలా మొత్తంలో వడ్డీలు, జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.