గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అంటే..?
what is gap up and gap down
మనం తరుచుగా స్టాక్ మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యింది లేదా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యింది అని వింటూ ఉంటాం. మరి ఈ గ్యాప్ అప్, డౌన్‌లతో ఏంటి లాభం..? అసలు మార్కెట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ లో ఎందుకు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎలాంటి సందర్భంలో మనం ట్రేడ్ చేయాలి.. వీటి గురించి ఓ సారి తెలుసుకుందాం.
మనం ఉదయాన్నే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయినపుడు చూస్తే అవి నిన్న క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర కాకుండా అంతకన్నా పైనగాని లేదా కింద గానీ ఓపెన్ అవుతుంటూ ఉంటాయి. నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువలో ఓపెన్ అయితే దానిని గ్యాప్ అప్ అని, నిన్నటి క్లోజ్ ప్రైస్ కంటే తక్కువలో ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అని అంటారు. అసలు ఇలా ఎందుకు ఓపెన్ అవుతాయి అనేది తెలుసుకుందాం.
what is the timings of indian stock market
సాధారణంగా మార్కెట్స్ అనేవి 9.15am to 330pm వరకు ఓపెన్ అయి ఉంటాయి. ఈ టైమ్లో సాధారణంగా ట్రేడింగ్ జరుగుతుంది. అలాగే ఉదయం 9am to 9.15am వరకు ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది. ఈ సెషన్‌లో 3 పార్ట్స్ ఉంటాయి.
* 9.00 to 9.08 am: ఈ సమయంలో షేర్లును కొనాలన్న లేదా అమ్మాలన్న ఆర్డర్స్ పెట్టుకోవచ్చు.
9.08 to 9.12 am: ఈ సమయంలో ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి.
9.12 to 9.15 am: ఈ సమయంలో ఉండే పిరియడ్ ని బఫర్ పిరియడ్ అంటారు.
9.15 to3.30 pm ఈ సమయంలో మార్కెట్ ట్రేడ్ అయి తర్వాత క్లోజ్ అవుతుంది. ఒక వేళ ఆ తర్వాత మనం ఆర్డర్స్ చేయాలనుకుంటే AMO ద్వారా మరుసటి రోజు ప్రీ మార్కెట్ ఓపెన్ అయినంతవరకు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అలాగే 9.00 to 9.08 am వరకు కూడా ప్రీ మార్కెట్ లో కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇలా AMO ద్వారా వచ్చే ఆర్డర్స్, ప్రీ మార్కెట్ లో ప్రైస్ అయిన ఆర్డర్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల 9.15 am కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన ప్రైస్ పైన ఇన్పాక్ట్ చూపిస్తుంది. దీనిలో బయ్యర్స్ ఎక్కువగా ఉంటే గ్యాప్ అప్ లో, సెల్లర్స్ ఎక్కువగా ఉంటే గ్యాప్ డౌన్ లో చూపిస్తుంది.
Leave a Reply