Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఇంటి ఓనర్లకు షాక్..! మారిన రెంటల్ అగ్రిమెంట్ రూల్స్! Shock to Homeowners..! Changed Rental Agreement Rules!

Posted on 20/12/2025 By admin No Comments on ఇంటి ఓనర్లకు షాక్..! మారిన రెంటల్ అగ్రిమెంట్ రూల్స్! Shock to Homeowners..! Changed Rental Agreement Rules!

ఇకపై ఇల్లు అద్దెకిచ్చే యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. అద్దెకు ఉండేవారి హక్కులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెంటల్ అగ్రిమెంట్రూ ల్స్ (Rental Agreement Rules)ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాగా ఇప్పటివరకు కొనసాగిన మాటల ఒప్పందాలు, తక్కువ విలువైన స్టాంప్ పేపర్లపై రాసుకున్న అగ్రిమెంట్లకు ఈ చట్టం పూర్తిస్థాయి చెక్ పెట్టింది. ఈ కొత్త నిబంధనలతో అద్దె వ్యవస్థ పూర్తిగా డిజిటల్‌, పారదర్శకంగా మారనుంది. దీంతో ఒకవైపు అద్దెకు ఉండే వారికి భద్రత లభిస్తుండగా… మరోవైపు ఇంటి ఓనర్లకు ఇవి షాక్‌లా మారుతున్నాయి. రెంటల్ అగ్రిమెంట్ రూల్స్–2025 అనేది అద్దె వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చే చట్టం. అద్దెకు ఉండే వారికి భద్రత కల్పిస్తూనే, ఇంటి ఓనర్ల స్వేచ్ఛకు గట్టి నియంత్రణలు విధించింది. కానీ… ఈ నిబంధనలను ప్రజలు ఎంతవరకు అమలు చేస్తారన్నదే అసలు ప్రశ్నగా మిగిలింది.

డిజిటల్ అగ్రిమెంట్ తప్పనిసరి..Digital Rental Agreement Made Mandatory

ఇకపై ప్రతి రెంటల్ అగ్రిమెంట్‌ (Rental Agreement Rules)ను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రూపొందించి, డిజిటల్‌గా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. రూ.10 లేదా రూ.100 స్టాంప్ పేపర్లపై రాసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత ఉండదు.
స్టాంప్ డ్యూటీ కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తప్పకుండా చేరుతుంది.

సెక్యూరిటీ డిపాజిట్‌కు కళ్లెం..Cap on Security Deposit

(Rental Agreement Rules)ఇంతకాలం పెద్ద నగరాల్లో 6 నెలల నుంచి 10 నెలల అద్దె వరకు డిపాజిట్ తీసుకోవడం సాధారణంగా మారింది. కానీ కొత్త చట్టం ప్రకారం రెసిడెన్షియల్ ఇళ్లకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి. కమర్షియల్ ప్రాపర్టీలకు గరిష్ఠంగా 6 నెలల అద్దె తీసుకోవాలి. ఇంతకు మించి డిపాజిట్ తీసుకుంటే అది చట్టవిరుద్ధమే. ఇది ఇంటి ఓనర్లకు పెద్ద షాక్‌గా మారింది.

అద్దె పెంపుపై కఠిన నిబంధనలు..Strict Rules on Rent Hike

(Rental Agreement Rules)ఇప్పటివరకు యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్దె పెంచే పరిస్థితి ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం కనీసం 12 నెలలు పూర్తయ్యాకే అద్దె పెంచాలి. అద్దె పెంపు కోసం 90 రోజుల ముందే రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. నోటీసు లేకుండా అద్దె పెంచితే అది చట్టపరంగా చెల్లదు.

యజమాని ఇంట్లోకి రావాలంటే ముందస్తు నోటీసు ఇవ్వాలి.. Landlord Must Give Prior Notice Before Entering the House

(Rental Agreement Rules)ఇకపై యజమాని తన ఇంటిని పరిశీలించాలంటే కనీసం 24 గంటల ముందే రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. నోటీసు లేకుండా ఇంట్లోకి రావడం నేరంగా పరిగణిస్తారు. ఇది అద్దెకు ఉండే వారి ప్రైవసీకి పెద్ద రక్షణగా నిలుస్తోంది.

బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించ‌కూడ‌దు.. No Forced Eviction of Tenants

(Rental Agreement Rules)నోటీసు కాలం ముగిసినా అద్దెకు ఉండేవారు ఇల్లు ఖాళీ చేయకపోతే.. యజమాని బలవంతంగా బయటకు పంపలేడు. తాళాలు మార్చడం, నీరు–కరెంట్ కట్ చేయడం, బెదిరింపులు చేయడం నేరం తప్పనిసరిగా రెంట్ ట్రైబ్యునల్ లేదా కోర్టు ఆదేశం తీసుకోవాలి. ఈ నిబంధన కూడా tenants కిపెద్ద ఊరట కలిగిస్తోంది.

అసాంఘిక కార్యకలాపాలకు మినహాయింపు లేదు.. No Exemption for Anti-Social Activities

(Rental Agreement Rules) అద్దె ఇంటిని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తే మాత్రం ఈ రక్షణ వర్తించదు. వేశ్య వృత్తి, అక్రమ వ్యాపారాలు, ఆయుధాలు లేదా మత్తు పదార్థాల కార్యకలాపాలు జరిగితే యజమాని పోలీసుల సహాయంతో వెంటనే చర్యలు తీసుకోవచ్చు.

ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో చూపించాల్సిందే… Must Be Declared in Income Tax Returns

(Rental Agreement Rules)డిజిటల్ అగ్రిమెంట్ వల్ల అద్దె ఆదాయం ప్రభుత్వ రికార్డుల్లోకి వస్తుంది. నగదులో అద్దె తీసుకున్నా, ఆ ఆదాయం ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో చూపించాల్సిందే. రిసీప్ట్ ఇవ్వకపోయినా డిజిటల్ రికార్డే ఆధారంగా నిలుస్తుంది.

చట్టాన్ని పాటించకపోతే… If the Law Is Not Followed…

(Rental Agreement Rules)డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ లేకుండా అద్దె వ్యవహారం సాగితే.. కోర్టులు వివాదాలను స్వీకరించకపోవచ్చు. యజమాని, tenants ఇద్దరికీ చట్టపరమైన రక్షణ ఉండదు అందుకే ఈ చట్టాన్ని పాటించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

ప్ర‌భుత్వాల‌కు కొత్త ఆదాయ మార్గాలు.. New Revenue Streams for Governments

నూన‌త Rental Agreement Rules వ‌ల్ల అద్దె వ్య‌వ‌హారాల‌ను డిజిటల్ గా స్టాంప్ వేసి, ఆన్లైన్‌లో నమోదు చేయడం ద్వారా చాలా వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు–కేంద్రానికి కొత్త ఆదాయ మార్గాలను (Revenue Streams) తెస్తున్నాయి. అగ్రిమెంట్‌పై స్టాంప్ డ్యూటీ విలువ ప్రభుత్వ ఖజానాకు నేరుగా చేరుతుంది. స్టాంప్ డ్యూటీ ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తారు కాబట్టి అది పూర్తిగా రికార్డులోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం డిజిటల్ స్టాంపు లేకుండా అగ్రిమెంట్ చేసుకుంటే యజమాని/ అద్దె చెల్లించే వారికి ₹5,000ల వరకు జరిమానా విధిస్తారు. ఈ జరిమానా కూడా ప్రభుత్వం ఆదాయంగానే మారుతుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా … Through Online Registration Fees…

(Rental Agreement Rules)కొన్ని రాష్ట్రాల్లో అగ్రిమెంట్‌ను స్టాంప్ చేయడమే కాకుండా,ఆన్‌లైన్‌లో నమోదు (Registration) చేయాల్సి కూడా ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్‌కు మినిమం ఫీజులు వసూలు చేస్తారు. ప్రతి అగ్రిమెంట్ 60 రోజుల్లోనూ ఏకకాలంలో స్టాంపింగ్ + నమోదు చేయాలి. గడువు లేకుండా అగ్రిమెంట్‌ను నిర్వహిస్తే జరిమానాలు విధించవచ్చు. ఈ చిన్న-చిన్న రుసుములు కూడా సంవత్సరానికి పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వాల‌కు ఒక కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టిస్తాయి.

ప‌న్నుల ద్వారా.. Through Taxes…
(Rental Agreement Rules)అద్దెలు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని యజమాని కూడా ఇన్కమ్-టాక్స్ రిటర్న్‌లో చూపాలి. దీంతో రెంటల్ ఆదాయంపై చెల్లించే పన్ను ఆదాయాలు కూడా ప్రభుత్వానికి వ‌స్తాయి. ఇక‌ పెద్ద నగరాల్లో రియల్-ఎస్టేట్ ట్రాన్సాక్షన్‌ల పర్యవేక్షణ కూడాపెరుగుతుంది.

 

275
FEATURE NEWS Tags:Cap on Security Deposit, Digital Rental Agreement Made Mandatory, If the Law Is Not Followed…, Landlord Must Give Prior Notice Before Entering the House, Must Be Declared in Income Tax Returns, New Revenue Streams for Governments, No Exemption for Anti-Social Activities, No Forced Eviction of Tenants, Strict Rules on Rent Hike, Through Online Registration Fees…, Through Taxes…

Post navigation

Previous Post: కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health
Next Post: బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans?

Related Posts

  • ఎన్ఆర్ఐలు ఆస్తులు కొన‌చ్చా NRIs can buy properties in india FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates FEATURE NEWS
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిటర్లకు గుడ్‌న్యూస్.. ! Good News for HDFC Bank Depositors FEATURE NEWS
  • ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports! FEATURE NEWS
  • నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు.. Relief After Losses… Domestic Markets Rebound FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • `అత్య‌వ‌స‌ర నిధి` చాలా అవ‌స‌రం FINICAL PLANNING
  • పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden? FINICAL PLANNING
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు.. Relief After Losses… Domestic Markets Rebound FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ చేస్తున్నారా what is sip in mutual funds MUTUAL FUNDS
  • చిటికెలో రుణంతో జ‌ర భ‌ద్రం Secure with a loan in a pinch FEATURE NEWS
  • తొలి జీతం రూ.50 వేలు.. అయినా స‌రిపోవ‌డం లేదా? అయితే సిక్స్ పార్ట్ మ్యాజిక్ ఫార్ములా ఫాలో అవ్వండి! First Salary ₹50,000 but Still Not Enough? Follow This Six-Part Magic Formula! FEATURE NEWS
  • ఆటో పే సౌకర్యం… సౌలభ్యమేనా? లేక అప్రమత్తత అవసరమా? Auto Pay Facility: Convenience or a Call for Caution? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme