FIIs AND DIIs అంటే ఏమిటి ?
what is meant by fii and dii
మనం తరుచుగా మార్కెట్ లో FIIs AND DIIs యాక్టివిటీస్ ఎక్కువగా ఉందని వింటుంటాం.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ దిశను మార్చేవి ఇవే..
FII : Foreign Institutional Investors
వీళ్ళని తెలుగులో విదేశీ సంస్థాగత మదుపరులు అంటారు. వీళ్ళు ఎవరంటే ఇతర దేశాలకి చెందిన ఎసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీలుగాని హెడ్జ్ ఫండ్స్, ఇన్సురెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీళ్ళు రాబోయే రోజుల్లో ఏ దేశం ఆర్థికంగా అబివృద్ధి చెందుతుందో అలాగే ఆ దేశంలో ఏ రంగంలో ఏఏ కంపెనీలు మంచి గ్రోత్ ఉంటుంది అనేది స్టడీ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు.
DII: Domestic Institutional Investors
వీళ్ళని తెలుగులో దేశీయ సంస్థాగత మదుపరులు అంటారు. వీళ్ళు మన దేశానికి చెందిన ఇన్వెస్టర్స్ అని అర్థం. మన దేశంలో ఉండే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు, ఇన్సురెన్స్ కంపెనీలు, చాలా పెద్ద ఇన్వెస్టర్లు.. వీరంతా మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఏ సెక్టార్ లో గ్రోత్ ఉంది, ఏ కంపెనీలు షేర్లు పెరగడానికి అవకాశం ఉంది అనేది నిరంతరం పరిశోధిస్తూ వాటిలో ఇన్వెస్ట్ చేయడమే ఈ FIIs AND DIIs పని.
how fii and diis impact stock market
స్టాక్ మార్కెట్లో మనలాంటి ఇన్వెస్టర్ల పాత్ర చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు మార్కెట్ను నడిపించేది వీళ్ళే. వీళ్ళు ఎక్కువగా కొనడం మొదలుపెడితే మార్కెట్స్ పెరుగుతాయి. అదే వీళ్ళు అమ్మేస్తే మార్కెట్స్ పడతాయి. ఈ FIIs అనేవి ఒకటో రెండో కాదు. కొన్ని వందల కంపెనీలుంటాయి. ఇవన్నీ కలిసి కొన్ని వేలకోట్లు కొనడం అమ్మడం చేస్తాయి. కాబట్టి వీళ్ళు కొంటున్నారా లేదా అమ్ముతున్నారా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనిని బట్టి మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు.ఈ డేటా ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Leave a Reply