ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మన స్టాక్ మార్కెట్‌లపై ఆ ప్రభావం ఉంటుంది. మార్కెట్లు చాలా సెన్సిటివ్‌గా రెస్పాండ్ అవుతాయి. ఈ కారణం చేతే స్టాక్ మార్కెట్‌లు అంత వాలటైల్ గా ఉంటాయి.
ప్రపంచంలో మన దేశం ఒక గ్లోబల్ విలేజ్ లాంటిది. అన్ని దేశాల మర్కెట్లు కూడా మన మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మనం విదేశాల మార్కెట్లను చూసి ఓ అంచనాకు రావచ్చు. అయితే విదేశీ మార్కెట్లలో ఏది ప్రధానంగా మనం ఫాలో కావాల్సి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం ఓ సారి పరిశీలిద్దాం.
FII: FOREIGN INSTITUTIONAL INVESTERS
ఇన్వెస్టర్లలో ప్రధానంగా రెండు రకాలు ఉంటారు. ఒకటి DIIలు, రెండోది FIIలు. DIIలు అంటే డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే దేశీయ మదుపరులు. FIIలు అంటే ఫారిన్ ఇన్వెస్టర్లు. వీరు చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ట్రేడ్ చేస్తుంటారు. వీరు చేసే పెట్టుబడుల బట్టి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది.
america play key role in indian stock market
అమెరికా ముఖ్యమైనది..
ఇండియలో 100 కంపెనీలు డైరెక్ట్ గా FIIల సొంతం. ఇప్పుడు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో మెజారిటీ వాటా FII లకి ఉంటుంది. లోకల్ కి ఉండదు. ఇలాంటి కంపెనీలలో 70 శాతం FIIలకి ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంకులో కూడా 15 శాతం FIIలకి ఉంటుంది. ఇండియా స్టాక్ మర్కెట్లో 25 శాతం వరకు వీరిదే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫార్నర్స్ ఉంటారు. మనం ఏదైనా మార్కెట్ ను తీసుకోవాలంటే మొదటి ఫోకస్ చేయవలిసింది అమెరికన్ మార్కెట్ పైనే. మన ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి వేకువ జామున 2.30 నిమిషాల వరకు అమెరికన్ మార్కెట్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మార్కెట్లను ప్రభావితం చేసే ఏకైక మార్కెట్ అమెరికన్ మార్కెట్.
ఇండియాలో ఉన్న అన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ తో పోల్చుకున్నా ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా పెద్దది. అందువల్ల అమెరికన్ మార్కెట్ లో పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఏసియన్ మార్కెట్ మీద పడుతుంది. ఆసియా లో మొదట ఓపెన్ అయ్యే మార్కెట్ సింగపూర్ నిప్టీ. ఇక్కడ మార్కెట్ ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మొదటి సిప్ట్. 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సెకెండ్ సిప్ట్ పనిచేస్తుంది.
which international markets have to track
ఈ మార్కెట్లను ట్రాక్ చేయాల్సిందే..
మన మార్కెట్ అనేది సింగపూర్ నిప్టీ ద్వారా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం నిరంతరం ఎస్ జీ ఎక్స్.లైవ్ లో మన నిప్టీని ట్రాక్ చేసుకోవడం ముఖ్యం.
ఆసియ లో అతి ముఖ్యమైన మర్కెట్లు చైనా, హాంగ్ కాంగ్, తైవాన్. ఆ తర్వాత జపాన్ మార్కెట్ నిక్కి. మనం వీటిని పరిశీలించుకోవాలి. జపాన్ & చైనా ఇండియా కన్నా పెద్ద మార్కెట్లు తర్వాత హాంగ్ కాంగ్.
ఆసియాలో ఆలస్యంగా ఓపెన్ అయ్యేది ఇండియన్ మార్కెట్. కాబట్టి మన కంటే ముందుగా ఓపెన్ అయ్యే మార్కెట్లను ఆధారంగా చేసుకుని మన మార్కెట్‌ను అంచనా వేయవచ్చు.
* అమెరికన్ మార్కెట్, ఆసియలో హాంగ్ కాంగ్, చైనా, జపాన్ లను ట్రాక్ చేసుకోవాలి. యూరప్ నుంచి లండన్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లను పరిశీలించాల్సి ఉంటుంది.
మార్కెట్ స్టార్ట్ అయినపుడు మొదటి 15 నిమిషాలకి దూరంగా వెళ్ళే మార్కెట్స్ ను ట్రెండింగ్ మార్కెట్స్ అంటారు.
* మనం ఏదైనా మార్కెట్లో ఎంటర్ అయినపుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సెంటిమెంట్ ఎనాలిసిస్ తీసుకోవడం చాలా అవసరం.
* ఇంట్రాడే ట్రేడింగ్ కి వరల్డ్ మార్కెట్స్, డెమో అండ్ డేటా, చార్ట్ అనేవి చాలా ముఖ్యం.
* ఇన్వెస్టింగ్.కమ్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లను మనం ట్రాక్ చేసుకోవచ్చు.