ఈ స్టాక్ ఓవర్ వాల్యూలో ఉందా how to know the real valuation of a stock
ఏదైనా స్టాక్ కొనాలనుకునే ముందు దాని వాల్యూ ఎంత ఉందో చూస్తాం. దాని ధర ఎక్కువగా ఉంటే ఆలోచిస్తాం. కానీ ఏ ధర ఆస్టాక్ కొనేందుకు సరైనదో ఎలా తెలుసుకోవాలి. అసలు స్టాక్ ఓవర్ వాల్యూలో ఉందా లేదా అండర్ వాల్యూనా అని ఎలా తెలుసుకోవాలి…?
సరైన స్టాక్ ప్రైస్ ను తెలుసుకునేందుకు కొన్ని మినిమం ఫార్మలాస్ ఉంటాయి.
what is PE ratio
అందులో ఒకటి P/E Ratio : Price To Earning Ratio.
P/E Ratio అనేది స్టాక్ ఎంపిక కోసం సాధారణంగా ఉపయోగించబడే నిష్పత్తి. ప్రస్తుత షేర్ విలువ ఆధారంగా భవిష్యత్తు ఆదాయాన్ని అంచనా వేస్తూ ప్రతి రూపాయికు కంపెనీ విలువను నిర్ధారించడానికి ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది.
what is EPS
EPS: ఎర్నింగ్స్ పర్ షేర్.
ఒక కంపెనీకి సంబంధించిన కామన్ స్టాక్స్ లో ఒక షేరుకు వచ్చే సంపాదనను ఈపీఎస్ అంటారు.
స్టాక్ ప్రైస్ కన్నా ఈపీఎస్ ప్రైస్ ఎక్కువ పెరిగితే ఆ స్టాక్ తక్కువ ధరలో ఉన్నట్టే. అలాగే 1 ఇయర్ లో లో ఉన్నా స్టాక్ కన్నా ఈపీఎస్ డౌన్ అయితే ఆ స్టాక్ చీప్ కాదు. దాని విలువ ఎక్కువగానే ఉన్నట్టు.
స్టాక్ ప్రైస్ వన్ ఇయర్ లోలో ఉంటే తక్కువ అని కాదు. వన్ ఇయర్ హైలో ఉంటే ఎక్కువ అని కాదు. ఆ స్టాక్‌పై వచ్చే ఎర్నింగ్స్ బట్టి దాని ధర నిర్ణయించుకోవాలి. మనం ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ ను ఎర్నింగ్స్ తో పోల్చాలి. అప్పుడే మనకు సరైన విలువ తెలుస్తుంది.
మన దేశంలో ఉన్న అన్నీ ఐటీ స్టాక్స్ హిస్టారికల్ పీఈ తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఎక్స్ పెన్సివ్ గానే ఉన్నట్టు. ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే , పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే ఎప్పుడైనా ఎక్కువ పీఈ వచ్చినపుడు హిస్టారికల్ పీఈ తో పోల్చి ఇది ఎక్స్ పెన్సివ్ అనుకున్నపుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు.
ఒక కంపెనీ ప్యూచర్ లో ఎర్నింగ్స్ పెరిగే చాన్స్ ఉంది అనుకుంటే దానిని ఖచ్చితంగా రీ రేటింగ్ కి ఇస్తారు.
`స్క్రీనర్. ఇన్ ` అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే ప్రతి కంపెనీ పీఈ రేషియోని చార్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో వెబ్ సైట్‌లో ఈ విషయాలను మనం తెలుసుకోవచ్చు. లీడింగ్ లో ఉన్న ఏదైనా కంపెనీని హిస్టారికల్ పీఈ తో పోల్చుకుంటే తక్కువ రేటుకి వచ్చినపుడు మనం కొనుక్కోవచ్చు. అది మనకు చాలా సేఫ్. స్టాక్ మార్కెట్లో కూడా సీజన్ ఉంటుంది. ఓవర్ వాల్యూషన్ ఉన్నప్పుడు స్టాక్స్ ను అమ్మకోవాలి. అలాగే నార్మల్ వాల్యూ వచ్చినపుడు స్టాక్స్ ను మనం కొనుక్కోవాలి.
Leave a Reply